OTT Movie : డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందులోనూ థ్రిల్లర్ స్టోరీలను వదిలిపెట్టకుండా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం థ్రిల్లర్ సినిమా ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఇది సోషల్ మీడియా డార్క్ సైడ్, ఫేక్ న్యూస్, జర్నలిజం ఎథిక్స్, పర్సనల్ స్ట్రగుల్స్ థీమ్స్‌ను ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
“Live” ఒక మలయాళం సోషల్ థ్రిల్లర్ సినిమా. వి.కె. ప్రకాశ్ దర్శకత్వంలో లిస్టిన్ స్టీఫెన్ దీనిని నిర్మించారు. ఇందులో మమతా మోహన్‌దాస్ (డాక్టర్ అమల), సౌబిన్ షాహిర్ (సామ్), షైన్ టామ్ చాకో (సతీష్), ప్రియా ప్రకాశ్ వారియర్ (అన్నా) ప్రధాన పాత్రలు పోషించారు. 2 గంటల 5 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈసినిమా 2023 మే 26 థియేటర్లలో విడుదలై, మనోరమ మాక్స్, సన్ NXTలో మలయాళం, తమిళ, తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ అన్నా పాల్ అనే ఒక యువతితో ప్రారంభమవుతుంది. అన్నా ఒక మెడికల్ విద్యార్థి. డాక్టర్ కావాలనే కలతో జీవిస్తుంటుంది. ఆమె తన చదువుపై దృష్టి పెట్టి, సాధారణ జీవితం గడుపుతుంది. అదే సమయంలో డాక్టర్ అమల శ్రీరామ్ అనే ఒక ప్రసిద్ధ పీడియాట్రిక్ సర్జన్ సామాజిక కార్యకర్తగా ఉంటూ, సమాజంలో అన్యాయాలపై పోరాడుతూ ఉంటుంది. ఆమె సైబర్ హరాస్‌మెంట్, ఫేక్ న్యూస్‌కు వ్యతిరేకంగా గొంతు విప్పుతుంది, దీనివల్ల ఆమె కొందరు శక్తివంతమైన వ్యక్తుల ఆమెకు శత్రువుగా మారుతారు.
మరోవైపు అన్నా జీవితం ఒక ఊహించని సంఘటనతో తలకిందులవుతుంది. ఒక రాత్రి, ఆమె స్నేహితుడు సామ్ తో కలిసి ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొంటుంది. ఈ సందర్భంలో ఆమె వల్ల ఒక అరెస్ట్ జరుగుతుంది. ఇది అన్నాకు సమస్యలు తెచ్చిపెడుతుంది. సామ్ జాన్ అనే ప్రముఖ మీడియా హౌస్ ఎడిటర్, టీఆర్‌పీ రేటింగ్స్ కోసం అన్నా గురించి తప్పుడు వార్తలను ప్రచురిస్తాడు. ఈ వార్తలు అన్నాను ఒక నేరస్థురాలిగా చిత్రీకరిస్తాయి. దీనివల్ల ఆమె జీవితం, చదువు, కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి. సోషల్ మీడియాలో ఆమెపై సైబర్ హరాస్‌మెంట్ పెరుగుతుంది.
ఈ సమయంలో అన్నా, డాక్టర్ అమల శ్రీరామ్‌ను కలుస్తుంది. అమల కూడా సైబర్ హరాస్‌మెంట్‌కు బాధితురాలిగానే ఉంటుంది. ఆమె సామాజిక కార్యక్రమాల కారణంగా శక్తివంతమైన మీడియా సంస్థల నుండి దాడులను ఫేస్ చేస్తుంది. అమల, అన్నాకు మద్దతుగా నిలబడి, ఆమె కేసును ఒక సామాజిక సమస్యగా తీసుకుంటుంది. వీళ్ళు కలిసి సామ్ జాన్, అతని మీడియా హౌస్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన పోరాటం ప్రారంభిస్తారు. ఈ పోరాటంలో, అన్నా స్నేహితుడు సామ్ కూడా వారికి సహాయం చేస్తాడు. అతను ఒక జర్నలిస్ట్‌గా నిజాన్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అన్నా, అమల ఒక వైపు చట్టపరమైన యుద్ధం చేస్తూంటే, మరోవైపు సామ్ జాన్, అతని సహచరులు వారిని మరింత దిగజార్చడానికి కొత్త కుట్రలు పన్నుతారు.
ఈ క్రమంలో అన్నా కుటుంబం, స్నేహితులు ఆమెపై నమ్మకం కోల్పోతారు. ఆమె మానసికంగా కృంగిపోతుంది. ఈ సమయంలో అమల తన అనుభవం ధైర్యంతో, అన్నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. వారు కలిసి ఒక సామాజిక ఉద్యమాన్ని నడిపిస్తారు. సామ్ ఒక సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా సామ్ జాన్ మీడియా హౌస్‌లోని అవినీతిని బయట పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అతను కొన్ని ఆధారాలను సేకరిస్తాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్‌లో అన్నా, అమల ఒక కోర్టు కేసు ద్వారా సామ్ జాన్ అతని మీడియా హౌస్‌ను ఎదుర్కొంటారు. సామ్ సేకరించిన ఆధారాలు కోర్టులో కీలకంగా మారుతాయి. అయితే క్లైమాక్స్ ఒక ట్విస్ట్‌తో ముగుస్తుంది. అన్నా, అమల ఈ పోరాటంలో విజయం సాధిస్తారా ? కుట్రలకే బలవుతారా ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి
Read Also : ప్రెగ్నెంట్ వైఫ్ ఫోటో మార్ఫింగ్… ఒక్క రాత్రిలో ఫుడ్ డెలివరీ బాయ్ లైఫ్ అతలాకుతలం… సీను సీనుకో ట్విస్ట్