OTT Movie : 1990ల కాలంలో నక్సలైట్-పోలీసు కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో, ఒక తెలుగు సిరీస్ బో*ల్డ్ కంటెంట్ తో హైప్ క్రియేట్ చేసింది. అతిగా హింస, బూతు డైలాగుల వల్ల ఈ సినిమా సెన్సార్ కంట్లో కూడా పడింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు సూట్ కాదని డైరెక్టర్ కూడా చెప్పాడంటే ఈ కంటెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘Shaitan’ 2023లో విడుదలైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనికి మహి V రాఘవ్ దర్శకత్వం వహించారు. ఇందులో రిషి (బాలి), షెల్లీ కిషోర్ (సావిత్రి), దేవియాని శర్మ (జయప్రద), జాఫర్ సాదిఖ్ (గుంఠి) ప్రధాన పాత్రల్లో నటించారు. 9 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్ IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది. ఈ సిరీస్ ప్రస్తుతం JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.
సావిత్రి ఒక సింగిల్ మదర్. ఆమెకు బాలి, జయప్రద, గుంఠి అనే ముగ్గురు పిల్లలు ఉంటారు. సావిత్రి, తన పిల్లలను పోషించడానికి ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్‌తో సంబంధం పెట్టుకుంటుంది. దీని వల్ల ఆమె సమాజంలో అవమానాలు పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు బాలిని క్రిమినల్ మార్గంలోకి నడిపిస్తాయి. అతను నక్సలైట్ గ్రూప్‌లో చేరతాడు. సిరీస్ మొదటి ఎపిసోడ్ నుండే ఇంటెన్స్‌గా స్టార్ట్ అవుతుంది. బాలి హోమ్ మినిస్టర్‌పై అటాక్ చేసి, పోలీసుల నుండి తప్పించుకునే సీన్‌తో ఓపెన్ అవుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో బాలి కుటుంబం అన్యాయాల వల్ల ఎలా బాధపడిందో చూపిస్తుంది. బాలి నక్సలైట్ లీడర్ సంబన్న కోసం, ఒక గ్రేహౌండ్ ఆఫీసర్ విజయ్ కుమార్‌ను చంపే టాస్క్ తీసుకుంటాడు. దీంతో అతని జీవితం మరింత డేంజర్‌లో పడుతుంది.
సెకండ్ హాఫ్‌లో బాలి సిస్టర్ జయప్రద పీస్‌ఫుల్ లైఫ్ కోరుకుంటుంది. కానీ ఆమె డెస్టినీ ఆమెను వేరే దారిలోకి తీసుకెళ్తుంది. బాలి సోదరుడు గుంఠి మర్డరర్‌గా మారతాడు. పోలీస్ ఆఫీసర్ నాగి రెడ్డి బాలిని అరెస్ట్ చేసి, నక్సలైట్ నెట్‌వర్క్‌ను డిస్ట్రాయ్ చేయడానికి అతనితో డీల్ చేస్తాడు. బాలి తన ఫ్యామిలీని సేవ్ చేయడానికి, నక్సలైట్స్, పోలీసుల మధ్య స్ట్రగుల్‌లో చిక్కుకుంటాడు. క్లైమాక్స్ ఊహించని మలుపులు తీసుకుంటుంది. బాలి తన ఫ్యామిలీని కాపాడు కుంటాడా ? నక్సలైట్స్ కి అన్యాయం చేస్తాడా ? పోలీసుల చేతిలో ఇరుక్కుపోతాడా ? అనే ప్రశ్నలకు సామాధానాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : సర్ఫింగ్ కోసం వెళ్లి సావును కొనితెచ్చుకునే తండ్రీకొడుకులు… వణుకు పుట్టించే సైకలాజికల్ థ్రిల్లర్