OTT Movie : కొన్ని హర్రర్ మూవీస్ ను చూడాలంటే ఎవరైనా కాసేపు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ మూవీలో దయ్యాల కంటే బొమ్మలే ఎక్కువగా భయపెడతాయి. వెండితెరపై హర్రర్ మూవీ లవర్స్ ను భయపెట్టి ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ హల్చల్ చేస్తోంది. ఆ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరేమిటో? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్ (Netflix)
ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీలో ఒక అమ్మాయికి బహుమతిగా ఇచ్చిన భయంకరమైన బొమ్మలో దయ్యం చెరటంతో ఆ బొమ్మ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు “సబ్రిన” (Sabrina). ప్రస్తుతం ఈ మూవీ “నెట్ ఫ్లిక్స్” (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి.
స్టోరీ లోకి వెళితే
వానియ అనే ఒక అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోవడంతో పిన్ని, బాబాయ్ దగ్గర చదువుకుంటూ ఉంటుంది. వాళ్లు కూడా ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటూ చదివిస్తూ ఉంటారు. ఒకరోజు స్కూల్లో ఒక పిల్లాడు ఆత్మలను పిలిచే ఆటను ఆడుతుండగా, అది ఎలా ఆడాలో నేర్పించమని అడుగుతుంది. ఆ పిల్లవాడు ఆ ఆట ఎలా ఆడాలో వానియకు నేర్పిస్తాడు. ఇంటికి వెళ్ళిన ఆ అమ్మాయి తన తల్లిదండ్రులను చూడాలని ఆ ఆత్మలను పిలిచే ఆట ఆడుతుంది. అదే రోజు బాబాయ్ ఆ అమ్మాయికి ఒక బొమ్మను బహుమతిగా ఇస్తాడు. ఆ బొమ్మ చాలా భయంకరంగా ఉంటుంది. వానియ ఆత్మలను పిలవడంతో అక్కడికి వచ్చిన ఆత్మ ఆ బొమ్మలోకి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయికి ఆత్మ కనబడుతూ భయపెట్టిస్తుంది. ఆ తర్వాత వానియ పిన్నికి కూడా ఆ ఆత్మ కనపడి ఆమె మీద అటాక్ చేస్తుంది. వీళ్ళందరూ ఆ దయ్యాన్ని వెలగొట్టడానికి ఒక మంత్రగత్తెను పిలుస్తారు.
అక్కడికి వచ్చిన ఆ మంత్రగత్తే ఇది చాలా శక్తిలు ఉన్న దయ్యం. ఆ అమ్మాయి తల్లిదండ్రులను చంపింది కూడా ఈ దయ్యమే అంటూ చెప్తుంది. ఆ దయాన్ని బంధించాలనుకునే లోపు ఆ దయ్యం ఆ బొమ్మ లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ బొమ్మను చూస్తే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఉంటుంది. అందులో దయ్యం ఉంటే ఇక చెప్పేదేముంది గుండె ఆగిపోవడం ఖాయం. చివరికి ఆ దయ్యాన్ని మంత్రగత్తె వెళ్లగొడుతుందా? ఆ దయ్యం ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఎందుకు చంపింది? ఆ దయ్యంతో ఆ అమ్మాయి ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే “నెట్ ఫ్లిక్స్” (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “సబ్రిన” (Sabrina) మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీని ఒంటరిగా చూడాలనుకొనేవాళ్ళు కాస్త ఆలోచించాలి. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీలో కొన్ని సీన్స్ గుండెల్లో దడ పుట్టిస్తాయి. ముఖ్యంగా ఆ బొమ్మను చూస్తే పగలు కూడా భయపడతారు. మరి రాత్రి పూట అయితే మీరే ఆలోచించండి.