BigTV English

OTT Movie : ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు మాత్రమే బ్రతికి ఉంటే… క్రేజీ ఫ్యాంటసీ మూవీ

OTT Movie : ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు మాత్రమే బ్రతికి ఉంటే… క్రేజీ ఫ్యాంటసీ మూవీ

OTT Movie : ఒకప్పుడు థియేటర్లలోనే మూవీలను చూసేవారు మూవీ లవర్స్. ప్రస్తుతం డిజిటల్ మీడియా బాగా పాపులర్ కావడంతో బుల్లితెరపై కూడా తమకు నచ్చిన సినిమాలు చూస్తున్నారు. అందులో అడ్వెంచర్ మూవీలను చూడాలంటే చెవి కోసుకొనే అభిమానులు చాలా మంది ఉన్నారు. థియేటర్లలో సందడి చేసిన ఒక అడ్వెంచర్ మూవీ ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

భూమి మీద మనుషులు ఎవరూ లేకుండా ఒక్కరే మిగిలితే ఎలా ఉంటుందో ఈమూవీలో చక్కగా ప్రజెంట్ చేశారు మేకర్స్. ఈ మూవీ పేరు “ది లాస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్“(The last man on earth). ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

భూమి మీద ఒక ప్రమాదకరమైన వైరస్ రావడంతో అందరూ చనిపోతారు. ఒక వ్యక్తి మాత్రమే మిగిలి ఉంటాడు. ఆ మిగిలిపోయిన వ్యక్తి ఈ కథలో హీరో. అతడు ఎంత వెతికినా ఎవరూ మనుషులు కనబడరు. ఒక పెద్ద ప్యాలెస్ ని తన నివాసంగా చేసుకొని అందులో తనకు నచ్చినట్లు జీవిస్తూ ఉంటాడు. ఎలా పడితే అలా ఉంటూ మనుషులు ఎవరూ లేకపోతే ఏమేమి చేస్తారో అలా ఉంటూ బతికేస్తూ ఉంటాడు. అయితే అతడు ఒక పెద్ద బోర్డు మీద నేను ఒకడిని బ్రతికే ఉన్నానంటూ, ఎవరన్నా బ్రతికుంటే నన్ను కలవాలని రాసి వెళ్ళిపోతాడు. హీరో తనకు ఒక అందమైన అమ్మాయి ఉంటే ప్రసాదించమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. అయితే ఇంతలో ఒక అమ్మాయి ఆ బోర్డు ను చూసి ఇతని దగ్గరకు వస్తుంది. ఆ అమ్మాయి మరీ అంత అందంగా ఉండకపోవడంతో హీరో  కాస్త నిరుత్సాహ పడతాడు. భూమి మీద ఎవరూ లేకుండా ఈమె మాత్రమే కనపడడంతో కాస్త రిలాక్స్ అవుతాడు. ఒకే ఇంట్లో ఉంటూ వీళ్ళు పిల్లలను కని ఒక సొసైటీ తయారు చేయాలనుకుంటారు.

పెళ్లి కాకుండా ఆపనికి ఆమె ఒప్పుకోకపోవటంతో హీరో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అలాగే వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతూ ఉంటారు. అలా నడుస్తున్న క్రమంలో వీరున్నచోటికి మరొక అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని చూసి హీరో మరింత బాధపడతాడు. ఎందుకంటే ఇతను అందంగా లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, కొన్ని రోజులు వెయిట్ చేసి ఉంటే ఇప్పుడున్న అమ్మాయి తనకు దక్కేదని అనుకుంటాడు. చివరికి వీళ్లు పిల్లలను కని సొసైటీని ఏర్పాటు చేస్తారా. భూమి మీద వీళ్ళే చివరి మనుషులు అవుతారా? కొత్తగా వచ్చిన అందమైన అమ్మాయిని హీరో మళ్లీ పెళ్లి చేసుకుంటాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “ది లాస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్”(The last man on earth) మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×