BigTV English

OTT Movie : పిల్లలు పుట్టట్లేదని భర్తని చెల్లికిచ్చి పెళ్లి చేసే భార్య… తరువాత వచ్చే ట్విస్ట్ కిరాక్

OTT Movie : పిల్లలు పుట్టట్లేదని భర్తని చెల్లికిచ్చి పెళ్లి చేసే భార్య… తరువాత వచ్చే ట్విస్ట్ కిరాక్

OTT Movie : డిజిటల్ ప్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు తమకు నచ్చినప్పుడు ఇష్టమైన సినిమాలను వీక్షిస్తున్నారు. థియేటర్లలో సందడి చేసిన సినిమాలు కొద్దిరోజులలో నే డిజిటల్ మీడియాలోకి రావడంతో ప్రేక్షకులు థియేటర్లకి వెళ్లకుండానే ఓటీటీల ద్వారానే సినిమాలను వీక్షిస్తున్నారు అందులోనూ కుటుంబ కథా చిత్రాలు తక్కువగా వస్తున్న ఈరోజుల్లో ఒక మంచి కుటుంబ కథా చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను తెలుసుకుందాం.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

ఈ సినిమా పిల్లలు కలగని ఒక జంట చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ‘సౌంకన్ సౌంకనే’ (Saunkan Saunkne). ఈ ఆసక్తికర మూవీ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదివరకే ఇటువంటి స్టోరీలు థియేటర్లలోకి చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ తెరకెక్కిన  విధానం ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇస్తుంది.


స్టోరీలోకి వెళితే.. 

నిర్మల్, నాసిబ్ అనే ఇద్దరు దంపతులు ఉంటారు. వీరికి పెళ్లి అయ్యి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగరు. ఆ విషయంలో వీరిద్దరూ బాగా బాధపడుతూ ఉంటారు. ఒకరోజు నిర్మల్ తల్లి వీళ్లిద్దరిని ఊరి చివరికి తీసుకొని వెళ్లి పిల్లల కలగాలని క్షుద్ర పూజలు చేయిస్తూ ఉంటుంది. ఎవరో పూజలు చేస్తున్నారని ఊరి ప్రజలు తరమడానికి ట్రై చేస్తారు. చీకటిగా ఉండటంతో వారు పారిపోతారు.  మరోవైపు నిర్మల్ భార్య నాసిబ్ ను కొంతమంది ఊరి ప్రజలు గొడ్రాలుగా చూస్తారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని నాసిబ్ తన భర్తకి మరొక పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటుంది. ఆ విషయాన్ని తన భర్తకి చెప్తుంది. తన భర్త మొదట నిరాకరించినప్పటికీ ఆమె బ్రతిమాలడంతో ఒప్పుకుంటాడు. కొన్ని సంబంధాలు చూసినప్పటికీ సెట్ కాకపోవడంతో చివరికి తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది.

తర్వాత తన భర్తని ఆ పని మీద తన పుట్టింటికి తీసుకు వెళుతుంది. అప్పుడే తన చెల్లికి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. ఈ హఠాత్ పరిణామానికి కంగుతిన్న నాసిబ్ ఈ పెళ్లి చెడగొట్టాలని తన భర్తతో చెప్తుంది. పెళ్లిచూపులకు వచ్చిన ఆ పెళ్ళికొడుకుతో నిర్మల్ లేనిపోని మాటలు చెప్పి, ఆ పెళ్లిని చెడగొడతాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు ఇతనిపై కోపంతో ఉంటారు. నసీబ్ వారిని సముదాయించి దీనికి కారణం నేనే అని, నా భర్తకి పిల్లలు పుట్టకపోవడంతో నా చెల్లికి తనకి ఇచ్చి వివాహం జరిపించాలని అనుకున్నాను అని చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె చెల్లి మొదట కోపగించుకున్నప్పటికీ తర్వాత పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లి పనులు ప్రారంభమయ్యేలోపే నసీబ్ కు వాంతులు మొదలవుతాయి. ఆమె నెల తప్పుతుంది. ఈలోగా చెల్లి పెళ్లి తన భర్తతో జరిగిపోతుంది. ఆ తర్వాత నసీబ్ నిర్మల్ కు జరిగిన వివాహాన్ని అంగీకరిస్తుందా ? నసీబ్ కు పిల్లలు పుడతారా ? తన చెల్లితో తన భర్త కాపురం చేస్తాడా? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : పని మనిషిపై అంతులేని ప్రేమ… ఆ పాడు పని కోసం దిక్కుమాలిన ప్లాన్… ఇలాంటి గెస్ట్ ను ఎక్కడా చూసుండరు

OTT Movie : ఇంకొకడి కోసం ప్రేమించిన వాడిని నిండా ముంచే అమ్మాయి… కిల్లర్ల గ్యాంగ్ మొత్తం ఒకే చోట… బ్రూటల్ రివేంజ్ డ్రామా

OTT Movie : కట్టుకున్నోడి దగ్గర అడ్డంగా బుక్… భర్తను అడ్డు తొలగించుకోవడానికి షాకింగ్ పని… మతిపోగోట్టే స్పై థ్రిల్లర్

OTT Movie : ఫన్ కోసం ఆడిన గేమ్ రియల్ లైఫ్ లోకి… ప్రతీ మాస్క్ వెనుక ఓ నిజం… మైండ్ బెండయ్యే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : ప్రియురాలి గదిలోకి స్నేహితున్ని పంపే ప్రియుడు … ముసలోడి నుంచి నిక్కరేసుకున్న వాడి దాకా…

OTT Movie : ఇదేం సినిమారా బాబూ… అన్నీ అవే సీన్లు… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : వీళ్ళు అమ్మాయిలా ఆడ పిశాచులా మావా? వీళ్ళకి డబ్బులిస్తే చాలు ఎవరికైనా తడిచిపోవాల్సిందే

OTT Movie : బంకర్లో నుంచి బయటకొస్తే చావు మూడినట్టే… ఒక్కో సీన్ కు వణికిపోవాల్సిందే మావా

Big Stories

×