E-Paper
Advertisement

OTT Movie : జీవితాన్ని మార్చే బావి, శంకం…. మైండ్ బ్లాక్ అయ్యే టైం లూప్ కాన్సెప్ట్ మూవీ

OTT Movie : జీవితాన్ని మార్చే బావి, శంకం…. మైండ్ బ్లాక్ అయ్యే టైం లూప్ కాన్సెప్ట్ మూవీ
Advertisement

OTT Movie : ఇటీవల కాలంలో శాండల్‌ వుడ్‌లో డిఫరెంట్ కథతో వస్తున్న కొత్త సినిమాల సందడి ఎక్కువగా కన్పిస్తోంది. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో సినిమా చేరింది. ఈ సినిమా సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైంది. టైం లూప్ కాన్సెప్ట్‌తో కూడిన విలక్షణమైన కథాంశంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. నిజానికి కన్నడలో టైమ్ ట్రావెల్, టైమ్ లూప్ కథనాలు చాలా అరుదు. రీసెంట్ గా వచ్చిన ఈ జానర్ మూవీ బ్లింక్ సినిమా కూడా విజయం సాధించింది. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ వేరు. మరి ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

స్టోరీ ఏంటంటే?
తుమకూరు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో నలుగురు అబ్బాయిల మధ్య కథ నడుస్తుంది. ఒకరోజు ఆ ఊరిలో ఉండే బావిలో రంగ (గిరీష్)కి శంఖం దొరుకుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అతనికి శంఖం దొరికిన రాత్రి నుండి కలలో రకరకాల వింత సంఘటనలు కనిపిస్తాయి. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు కలలో ముందుగానే కనిపిస్తూ అతనికి ఆందోళన కలిగిస్తాయి. ఈరోజు తన కలలో ఏం చూశాడో రేపు అదే జరుగుతుంది. ఇలా కలలు కంటున్న రంగా.. వీటన్నింటి వెనుక శంఖం మహిమ దాగి ఉందని గ్రహిస్తాడు. బావిలో పడి నీటిలో మునిగిపోయిన స్నేహితుడిని కూడా రంగ శంఖం వల్ల కాపాడతాడు. గ్రామంలోని కొన్ని వింతలకు కూడా శంఖం కారణం అవుతుంది. ఆ శంఖం నేపథ్యం ఏమిటి? తర్వాత ఏం జరుగుతుంది? పౌరాణిక కాలం నాటి ఆ శంఖం ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇలా అన్ని సందేహాలకు దర్శకుడు సినిమాలోనే సమాధానం చెప్పాడు.

Advertisement

Shalivahana Shakhe Movie Review: A Time Pass, Back To The Future On Loop  Experience! | Times Now

రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు…
శాలివాహన షేక్ సినిమా రెగ్యులర్ ఫార్మాట్ మూవీ జానర్‌కి చెందింది మాత్రం కాదు. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ న కూర్చోబెట్టే టైమ్ ట్రావెల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ద్వాపర యుగం, త్రేతాయుగం, సత్యయుగం కూడా ఈ సినిమాలో ఉంటుంది. ఓవరాల్ గా దర్శకుడు ప్రేక్షకుడిని మరో లోకంలోకి తీసుకెళ్లాడు. సినిమా మొదలయ్యాక ప్రేక్షకుడు సినిమాలో ఏం జరగబోతుందో కనీసం ఊహించలేడు. అయితే శాలివాహన శక అనే ఈ సినిమా ఉత్కంఠ భరితంగా సాగే మూవీనే అయినప్పటికీ టైమ్ లూప్ స్టోరీ కావడంతో కొన్ని సన్నివేశాలు తెరపై పదే పదే కనిపిస్తున్నా తట్టుకోవాల్సిందే. లేకపోతే దీనిని టైమ్ లూప్ అని పిలవరు కదా. గిరీష్ దర్శకుడిగానే కాకుండా ప్రధాన నటుడిగా కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటాడు. ఈ సినిమాలో సుప్రీత నారాయణ్, సుందర్ వీణ, చిల్లర్ మంజు, శైలేష్ కుమార్, దయానంద్ సాగర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాలాన్ని వెనక్కి నడిపించే కథలను తెరపై చూడడానికి ఇష్టపడే మూవీ లవర్స్ కు ఈ శాలివాహన శక మూవీ బెస్ట్ ఆప్షన్. ఈ మూవీ త్వరలోనే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×