Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. టాలీవుడ్ టు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది.. ప్రస్తుతం ఈమె అర డజను సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. ఈ అమ్మడు సినిమాల పరంగా సక్సెస్ అయ్యింది. కానీ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్లో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆన్ స్క్రీన్ జోడీల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల కాంబోకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆరేళ్ల కిందట వచ్చిన ‘గీతా గోవిందం’ సినిమా సెన్సేషనల్ హిట్టవ్వడానికి కారణం వీళ్లద్దరి కెమిస్ట్రీనే. వీరిద్దరినీ రియల్ లైఫ్ లో జంటగా చూడాలని ఆశ పడుతున్నారు. అయితే నిన్న రెస్టారెంట్ లో ఇద్దరు కలిసి కెమెరాలకు చిక్కారు. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
గతంలో మాల్దీవులలో ఒకే లోకేషన్‌లో దిగిన ఫోటోలు రోజుల గ్యాప్‌లలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే విధంగా విజయ్ దేవరకొండ ఇంట్లో కూడా రష్మిక పలు ఫోటోలను దిగినట్లు చర్చలు జరిగాయి. ఇక ఆ మధ్య దీపావళికి పోస్ట్ చేసిన ఫోటోలు కూడా విజయ్ దేవరకొండ ఇంట్లోనే దిగినట్లు అనిపించాయి. ఆ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ మధ్య విజయ్ దేవరకొండ.. తాను డేటింగ్‌లో ఉన్నానని, ఇప్పుడు తన వయసు 35 ఏళ్లు. ఇంకా సింగిల్‌గా ఉండమంటారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అందరం ఏదో ఒక సమయంలో పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేకపోతే వేరే అనుకోండి.. నేను మాత్రం పెళ్లి చేసుకోవాలనే అనుకుంటున్నా అంటూ తాను రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.. ఇక రష్మికను నెటిజన్లు ప్రశ్నలు మీద ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు రష్మిక సమాధానం చెప్పలేదు.
ఇదిలా ఉండగా.. తాజాగా చైన్నైలో జరిగిన పుష్ప2 వేడుకలో రిలేషన్ షిప్ స్టేటస్‌పై ఓపెన్ అయింది. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? అతను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. రష్మిక మాట్లాడుతూ.. అతను ఎవరో అందరికీ తెలుసని చెప్పింది. దాంతో ఒక్కసారిగా ఆడిటోరియం ఊగిపోయింది. అంతేకాదు.. అక్కడే కూర్చున్న అల్లు అర్జున్ శ్రీలీల దానికి నవ్వారు. అక్కడే ఉన్న వాళ్లంతా ఒక క్లారిటీకి వచ్చేసారు. రష్మిక, విజయ్‌తో రిలేషన్‌లో ఉందని క్లారిటీ మాత్రం వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. మొత్తానికి అయితే ఈ వార్త సంచలనంగా మారింది.. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని తెలిసిపోయింది. ఇక పెళ్ళెప్పుడు చేసుకుంటారో అనేది తెలియాల్సి ఉంది.
ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ ఛావా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సికిందర్ సినిమాలో సల్మాన్ కు జోడిగా నటిస్తుంది. వీటితో పాటుగా మరో నాలుగు సినిమాలు చేస్తుంది. వచ్చే ఏడాది ఆ సినిమాలు విడుదల కాబోతున్నాయి.