BigTV English

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన అచ్చ తెలంగాణ ఫీల్ గుడ్ మూవీ… చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళాల్సిందే

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన అచ్చ తెలంగాణ ఫీల్ గుడ్ మూవీ… చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళాల్సిందే

OTT Movie : ఈ మధ్య కాలంలో ఓటీటీ హవా ఎక్కువగా నడుస్తోంది. ప్రేక్షకులు ఓటీటీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ కు లాంగ్వేజ్ బారియర్ కూడా అడ్డుగా ఉండట్లేదు. ప్రేక్షకులు ఇంట్లోనే కూర్చుని తమకు నచ్చిన భాషలో, నచ్చిన జానర్లో సినిమాలు చూసే ఛాన్స్ ఉండడంతో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త ఓటీటీలు పుట్టుకొస్తున్నాయి. ఇక కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి, ప్రేక్షకులను అలరించి ఓటిటిలోకి వస్తుంటే, మరికొన్ని మూవీస్ ఓటీటీలోనే డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇటువంటి మూవీస్ కూడా ప్రేక్షకాదరణ ఎక్కువగానే పొందుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక కామెడీ ఎమోషనల్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆ మూవీ పేరేంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం పదండి.


మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి.. 

ఓటీటీలో ఎన్ని సినిమాలు ఉన్నా ఫీల్ గుడ్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అయితే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ఈటీవీ విన్ చాలా వరకు మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ని రిలీజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన అచ్చ తెలంగాణ మూవీ మరికొన్ని గంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది. ఈటీవి విన్ ఓటీటీలో మన చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చేలా, మంచి సినిమాను చూశామన్న తృప్తిని ఇచ్చే ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మూవీ పేరేంటో కాదు సోపతులు. ఇందులో భాను ప్రకాష్, మోహన్ భగత్, సృజన ప్రధాన పాత్రలలో నటించారు. అనంత్ వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సెప్టెంబర్ 19న ఈటీవీలో స్ట్రీమింగ్ తీసుకురానున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.


Sopathulu Trailer | Bhanu Prakash, Srujan, Mohan Bagath | Ananth Vardhan | Sinjith Yerramilli

మూవీ స్టోరీ ఏంటంటే?

ఈ సినిమా మొత్తం స్కూలుకు వెళ్లే ఇద్దరు చిన్నారుల చుట్టూ నడుస్తుంది. ఒకప్పుడు అంటే పుస్తకాలు ఉంటే చాలు అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు తరం, టెక్నాలజీ రెండూ మారాయి. ముఖ్యంగా కోవిడ్ నుంచి చిన్న పిల్లలకు ఆన్లైన్ క్లాస్ అనేది ట్రెండ్ గా మారింది. తాజాగా ఈ సినిమాలో కూడా ఈ ఇద్దరు అబ్బాయిలు ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కావలసి ఉంటుంది. అయితే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఆ ఫోన్ ఉండదు. మరి ఈ ఇద్దరు పిల్లలు స్మార్ట్ ఫోన్ సంపాదించడానికి ఏం చేశారు? చివరకు ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యారా లేదా? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని గంటల్లో ఈటీవి విన్ లోకి రానున్న సోపతులు అనే ఈ సినిమాను చూడాల్సిందే. సాధారణంగానే కంప్లీట్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇలాంటి టైమ్ లో మనసుని కదిలించే మంచి స్టోరీతో రాబోతున్న సోపతులు మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అయితే మూవీ ప్రమోషన్స్ చూస్తుంటే కచ్చితంగా ప్రతి ఒక్కరికీ తమ చిన్నతనం గుర్తొచ్చే అవకాశం ఉంది.

Tags

Related News

OTT Movie: మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. భయంతో వణుకు పుట్టించే హారర్ సీన్లు.. ఒంటరిగా మాత్రం చూడకండి..!

OTT Movie : చస్తేనే మనుషులుగా మారే రాక్షస జీవులు… ఊరిని పట్టి పీడించే వింత శాపం… సీట్ ఎడ్జ్ హర్రర్ థ్రిల్లర్

OTT Movie : నాలుక కోసి అమ్మాయి హత్య… చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదేం పాడు పనిరా అయ్యా?

OTT Movie : ఫస్ట్ నైట్ నాడు ఏం చేయాలో తెలియని ఆణిముత్యం… ఫ్రెండ్ మాట విని భార్యపై అఘాయిత్యం… ఫీల్ గుడ్ మలయాళ డ్రామా

OTT Movie : రాత్రైతే క్రూరంగా మారే భర్త… తెల్లార్లూ అదే టార్చర్… పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : అంతు చిక్కని ఏలియన్ మిస్టరీ… గవర్నమెంట్ బండారం బట్టబయలు… బుర్రబద్దలయ్యే ట్విస్టులున్న సై-ఫై థ్రిల్లర్

Big Stories

×