BigTV English

OTT Movie : చదువు కోసం అందాన్ని అమ్ముకునే చదువుల తల్లి…. సింగిల్ గా చూడాల్సిన యూత్ ఫుల్ మూవీ

OTT Movie : చదువు కోసం అందాన్ని అమ్ముకునే చదువుల తల్లి…. సింగిల్ గా చూడాల్సిన యూత్ ఫుల్ మూవీ
Advertisement

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు మూవీ లవర్స్ ని మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో యూత్ ని బాగా అట్రాక్ట్ చేసే మూవీస్ కొన్ని మాత్రమే ఉంటాయి. అటువంటి మూవీ ఒకటి ఈ రోజు మన మూవీ సజెషన్. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరేమిటో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మూవీ పేరు “స్టూడెంట్ సర్వీసెస్” (Student Services). ఇది ఒక ఫ్రెంచ్ మూవీ. చదువు కోసం తపిస్తూ, చదువుకోవటానికి తన అందాన్ని అమ్మకానికి పెట్టిన ఆ స్టూడెంట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ “అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

లారా అనే ఒక అమ్మాయి బాగా పేదరికంలో ఉంటుంది. చదువుకోవటానికి డబ్బు లేకపోవడంతో చాలా కస్టాలు పడుతుంది. డబ్బులు అవసరం ఉండటంతో, ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఆమె  ఆన్లైన్ లో తన అందాన్ని అమ్మకానికి పెడుతుంది. ఈమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అయితే  అతడు లారాని సరిగ్గా పట్టించుకోకపోవడంతో తప్పలేక ఈ వృత్తిలోకి దిగుతుంది. మొదటగా ఒక క్లయింట్ దగ్గరికి వెళుతుంది. అతడు ఆమెకు ఇస్తానన్న డబ్బులకంటే కొంచెం ఎక్కువగానే ఇస్తాడు. అక్కడ వచ్చిన డబ్బులతో లారాకు కొన్ని ప్రాబ్లమ్స్ తీరుతాయి. అయితే తను చేస్తున్న పని తప్పనిపించినా తప్పని పరిస్థితుల్లో చేయవలసి వచ్చినందుకు బాధపడుతూ ఉంటుంది. ఇలా ఉంటే ఈమె బాధను అర్థం చేసుకోలేని బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. అయితే మిగతా పేద స్టూడెంట్స్ కూడా వాళ్లకు నచ్చిన ఖరీదైన వాటిని కొనుక్కోవడం చూసి, వీళ్లు కూడా నాలాగే చేస్తూ ఉంటారని అనుకుంటుంది.

ఆ తర్వాత ఈమెను కొంతమంది చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. కొంతమంది క్లయింట్స్ ఆమెను చాలా ఇబ్బంది పెడతారు. అయితే ఆమె చదువులో మాత్రం మంచి మార్కులు సాధిస్తుంది. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లి ఒక జాబ్ లో జాయిన్ అవుతుంది. తను సొంతంగా ఒక అపార్ట్మెంట్ తీసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె క్లైంట్స్ మళ్లీ కాల్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. చివరికి లారా ఆ వృత్తిని వదిలిపెడుతుందా? చదువుకొని గొప్ప స్థాయికి వస్తుందా? ఆమె వెళ్లిన కొత్త ఊరిలో ఏమైనా సమస్యలు వస్తాయా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “స్టూడెంట్ సర్వీసెస్” (Student Services) మూవీని తప్పకుండా చూడండి. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీని ఒంటరిగా చూడటమే బెట్టర్.

Related News

Conistable Kanakam: ఫ్రీగా సినిమా చూడండి.. ఐఫోన్ గెలుచుకోండి ..బంపర్ ఆఫర్ ఇచిన మూవీ టీమ్!

OTT Movie : లైవ్‌లో అమ్మాయిని కట్టేసి ఆ పాడు పనులు చేసే సైకో… గూస్ బంప్స్ మూమెంట్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : ఈ వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, సిరీస్ లు… ఒక్కో భాషలో ఒక్కో సినిమా… ఈ 4 డోంట్ మిస్

OTT Movie : ‘థామా’కి ముందు చూడాల్సిన ఆయుష్మాన్ ఖురానా 4 థ్రిల్లింగ్ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : 456 మంది ఆటగాళ్ళు…. 40 కోట్ల నజరానా… ఇండియాలో ‘స్క్విడ్ గేమ్ ది ఛాలెంజ్ సీజన్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Movie : 300 కోట్ల దోపిడీ… బిగ్గెస్ట్ రియల్ లైఫ్ దొంగతనం… ‘మనీ హీస్ట్’లాంటి కేక పెట్టించే థ్రిల్లర్

Vash level 2: ఓటీటీలోకి వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?

Dude OTT : ‘డ్యూడ్’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Big Stories

×