BigTV English

Jani Master case : జానీ పై కేసుకు ఆ సినిమానే కారణం.. ఇన్నాళ్లకు వెలుగులోకి నిజం..

Jani Master case : జానీ పై కేసుకు ఆ సినిమానే కారణం.. ఇన్నాళ్లకు వెలుగులోకి నిజం..

Jani Master case : ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు జరిగాయి. అవే నిజం అయ్యాయి. బాధితురాలు తనపై అనేక మార్లు రేప్‌ చేశాడంటూ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ దాఖలు చేసింది. పరారీలో ఉన్న మాస్టర్ ను గోవాలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్ కు తీసుకువచ్చి ఉప్పర పల్లీ కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయట పడినట్లు తెలుస్తుంది. విస్తూపోయే నిజాలు బయటకు వచ్చాయి.. ఈ కేసు పెట్టడానికి మరో కారణం ఉందని పోలీసుల విచారణలో వెళ్లడయింది.. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం..


బుల్లితెర మీద పాపులర్ డ్యాన్స్ షోలో జానీ మాస్టర్‌కు పరిచయమైన డ్యాన్సర్‌.. ఆయనతో ట్రావెల్ అవ్వడం ప్రారంభించింది. ఆమెలోని ప్రతిభను చూసి అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చారు. అయితే వారిద్దరి మధ్య గురుశిష్యుల బంధం కంటే ఎక్కవే రిలేషన్‌షిప్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరి మధ్య ఉన్న బంధం కారణంగానే అనేక అవకాశాలు ఇచ్చినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఆ క్రమంలోనే తాను హీరోగా నటించే యధా రాజా తథా ప్రజా సినిమాలో ఆమెకు హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చారు. ఆ సమయంలో జానీ మాస్టర్‌ను ఆకాశానికి ఎత్తేయడం తెలిసిందే.. అదే ఇద్దరికీ గొడవలు పెట్టిందని టాక్..

Is that movie the reason for filing a case against Johnny Master?
Is that movie the reason for filing a case against Johnny Master?

ఆ తర్వాత ఈ అమ్మడు కూడా మాస్టర్ తో కలిసి డ్యాన్స్ షోలు, సినిమాలు చేసేది. ఓరోజు మాస్టర్ ను కాదని కొన్ని ఆఫర్స్ డైరెక్ట్ గా ఈమె వద్దకు రావడం జానీ మాస్టర్ సహించలేక పోయాడు. బాధితురాలికి అవకాశం ఇవ్వడం ఈ గొడవకు బీజం పడినట్టు సమాచారం. తనకు ఇచ్చిన ఆఫర్‌ను ఆమెకు ఎలా ఇస్తారనే విషయంపై ఆ సినిమా డైరెక్టర్‌తో గొడవ పడ్డారనేది చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్నది.. స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు వస్తే నువ్వు ఎలా తీసుకుంటావని గొడవలు జరిగాయట. మాస్టర్ భార్య భాధితురాలి పై గొడవకు దిగిందని టాక్. ఆ గొడవల తర్వాతే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాలని ప్రోత్సాహించారు. అలా ఆ కేసు ఇప్పటికి బయట పడింది. ఇక మాస్టర్ ఆమె పై లైంగిక దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో బయట పడింది.. ఈ కేసు నుంచి అసలు మాస్టర్ బయట పడతారో లేదో చూడాలి.. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం ఆయనను చంచల్ గూడా పోలీసు స్టేషన్ కు రిమాండ్ కు తరలించారు. పోక్స్ కేసు నమోదు అయ్యింది. పూర్తి వివరాలు తెలియనున్నాయి. మరోవైపు ఆయనకు నామ్ బెయిల్ అయ్యింది. అంటే ఇక మాస్టర్ బయటకు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ కేసు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. భాధితురాలికి అండగా సినీ తారలు ముందుకు వస్తున్నారు.


 

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×