BigTV English
Advertisement

OTT Movie : సీను సీనుకో ట్విస్ట్ తో గుండె గుభేల్మనిపించే హర్రర్ మూవీ… ఒంటరిగా చూసే దమ్ముందా?

OTT Movie : సీను సీనుకో ట్విస్ట్ తో గుండె గుభేల్మనిపించే హర్రర్ మూవీ… ఒంటరిగా చూసే దమ్ముందా?

OTT Movie : హర్రర్ మూవీస్ అంటే చెవి కోసుకుంటారా? భాష ఏదైనా సరే హర్రర్ మూవీ అయితే చాలు అని ఓటిటిలో తెగ వెతికేస్తున్నారా? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ప్రస్తుతం ఓటీటీలలో లెక్కలేనని హర్రర్ సినిమాలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇతర భాషల సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి వదులుతున్నారు. ఇక హర్రర్ సినిమాలు అనగానే కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్ అనే విషయం గుర్తొస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ హర్రర్ థ్రిల్లర్ కూడా హాలీవుడ్ లో తెరకెక్కిందే. ఇందులో క్షణం క్షణం హర్రర్ ఎలిమెంట్స్ తో, సినిమాలో వచ్చే ఊహించని ట్విస్ట్ లకు భయంతో చెమటలు పట్టడం ఖాయం. మరి ఈ హారర్ సినిమా ఏ ఓటిటిలో ఉందో చూద్దాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హర్రర్ సినిమాలో థ్రిల్లర్స్, సస్పెన్స్ అంశాలతో పాటు హర్రర్ ప్రియులను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. హర్రర్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఒక్కసారి ఈ సినిమాను చూశారంటే మరణ భయం అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. సినిమా మొత్తం ముగ్గురు వ్యక్తులు దయ్యం ఉన్న ఒక సీక్రెట్ రూమ్ నుంచి ఎలా తప్పించుకుని బయటపడ్డారు అనే విషయం చుట్టూ తిరుగుతుంది. ఈ ది డెడ్ రూమ్  (The Dead Room) మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుంది.


కథలోకి వెళ్తే…
న్యూజిలాండ్ లోని ఒక హాంటెడ్ ఫామ్ హౌస్ ను పరిశోధించే ముగ్గురు దెయ్యం వేటగాళ్ల కథ ఇది. ఓ ఇంట్లో ఉండే ఫ్యామిలీని దయ్యం భయపెట్టి, అక్కడినుంచి పారిపోయేలా చేస్తుంది. ఈ భయంకరమైన సంఘటన తర్వాత ఆ ఫ్యామిలీ మళ్ళీ ఇంట్లోకి అడుగుపెట్టే ధైర్యం చేయదు. కానీ ఆ ఇంట్లో దయ్యం ఉందా లేదా అనే విషయాన్ని తేల్చుకోవడానికి ఓ సంస్థకు చెందిన ముగ్గురు దెయ్యం వేటగాళ్ళను కన్సల్ట్ అవుతారు. సాంకేతిక సాధనాలను చూసుకునే వ్యక్తి లియామ్, సైకిక్ హోలీ, స్కెప్టిక్ స్కాట్ అనే ముగ్గురు వ్యక్తుల బృందం అక్కడ నిజంగా దయ్యం ఉందా లేదా అనే విషయాన్ని కనుక్కోవడానికి వెళ్తారు. కానీ తీరా రూమ్ లోకి వెళ్ళాక ఉదయం 3 గంటలకు ఆ రూమ్లో వింత వింత సంఘటనలు ఎదురవుతాయి. మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున మూడు గంటలకు ఓ పెద్ద శబ్దంతో ఈ దయ్యం వేటగాళ్లు నిద్ర లేస్తారు. అయితే ఆ దయ్యం మిగతా ఇద్దరు అబ్బాయిలకు కనిపించదు కానీ ఈ టీంలో ఒక అమ్మాయి అయిన హోలికి మాత్రం కనిపిస్తుంది. కానీ దాన్ని తమ క్లైంట్స్ కి సాక్ష్యంగా చూపించలేం కాబట్టి ఏదైనా పారా నార్మల్ యాక్టివిటీని కనుగొనాలని డిసైడ్ అవుతారు. అయితే దయ్యం ఎక్కువగా తెల్లవారుజామున మూడు గంటలకే ఏదో ఒక పని చేసి భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది కాబట్టి ఆ టైంలో అలారం పెట్టుకుంటారు. ఆ తర్వాత రోజు ఏం జరిగింది? దయ్యం ఉంది అని వీళ్ళు ఎలా నిరూపించగలిగారు? అసలు ఆ దయ్యం ఎందుకు భయపెడుతోంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Related News

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : భార్య చనిపోవడంతో మరో అమ్మాయితో… దెయ్యం పాపతో ఆ పనులేంటి భయ్యా ?

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Big Stories

×