BigTV English

Brahmamudi Serial Today October 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:   రాజ్‌ కాపురంలో నిప్పులు పోసిన రుద్రాణి – తల్లి, నాన్నమ్మలకు దూరం అయిన రాజ్‌

Brahmamudi Serial Today October 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:   రాజ్‌ కాపురంలో నిప్పులు పోసిన రుద్రాణి – తల్లి, నాన్నమ్మలకు దూరం అయిన రాజ్‌

Brahmamudi serial today Episode:  కనకం నాటకం గురించి రాజ్‌కు చెప్పేందుకు రుద్రాణి ప్రయత్నిస్తుంది. దీంతో విషయం పసిగట్టిన అపర్ణ.. రుద్రాణిని వారిస్తుంది. ఏమైనా ఉంటే ఇంటికి వెళ్లాక మాట్లాడుకుందాం అంటుంది. రసవత్తరమైన నాటకం ఇక్కడ జరుగుతుంటే ఎక్కడికో వెళ్దాం అంటావేంటి వదిన అంటూ నీ నాటకం గురించే చెప్తున్నాను కనకం అంటుంది రుద్రాణి. రుద్రాణి మాటలకు రాజ్‌ అసలు ఏం జరగుతుంది అత్తా అంటాడు. మీ అత్తనే అడుగు రాజ్‌ అని చెప్తుంది రుద్రాణి. ఇంతలో కనకం.. రుద్రాణి దగ్గరక వెళ్లి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం మీరు దయచేసి సైలెంట్‌ గా ఉండండి అని ప్రాదేయపడుతుంది.


కావ్య కోపంగా రుద్రాణి గారు ఏ ఆధారం లేకుండా మా అమ్మ మీద నిందలు వేస్తే ఈ ఇంటి వియ్యపురాలు అని కూడా నేను చూడను అని సీరియస్‌ అవుతుంది. అవునా  నువ్వు చూసేదేంటి? ఇలాంటి ఇంటికి వియ్యపురాలిని అని చెప్పుకుంటే నా పరువే పోతుంది అంటూ సమాధానం ఇస్తుంది రుద్రాణి. అంత అంత తప్పు మా అమ్మ ఏం  చేసిందని కావ్య అడగ్గానే  అల్లుణ్ని రప్పించడానికి కూతుర్ని అల్లుడిని కలపడానికి మీ అమ్మకు క్యాన్సర్‌ వచ్చి నాలుగు రోజుల్లో చావబోతుందని అబద్దం చెప్పింది అని రుద్రాణి అసలు నిజం చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. దీంతో రాజ్‌ కోపంగా అత్తా నీకేం తెలుసని మాట్లాడుతున్నావు. ఇలాంటి విషయాలు అందరి ముందు బయటపెడతారా? ఆవిడకు నిజంగానే క్యాన్సర్‌ ఉంది. ఆవిడ త్వరలోనే చనిపోతుంది అంటాడు.

రుద్రాణి..  అవునా ఆ ముక్క మీ అత్తని తల పైకెత్తి చెప్పమను..క్యాన్సర్‌ తో కుంగిపోతుందా? సిగ్గుతో తల నేలకు వాల్చిందా? అంటుంది. రుద్రాణి. వెంటనే రాజ్‌  ఏంటండి.. మా అత్త ఏదేదో మాట్లాడుతుంది. మీరు ఎప్పట్లా ఎదురు తిరిగి మాట్లాడటం లేదు. వాళ్లు చెప్పేది అబద్దం అని ఎందుకు చెప్పడం లేదు. మీకు నిజంగానే క్యాన్సర్‌ లేదా.. చెప్పండి?  అని కనకాన్ని అడగ్గానే లేదని కనకం తలూపుతుంది. దీంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. మూర్తి, కనకం దగ్గరకు వచ్చి ఏంటో ఇది ఏం చేసినా క్షమిస్తున్నాను అని చివరికి ఇలా కూడా తలవంపులు తీసుకొస్తున్నావా? ఇంతమందిలో దోషిగా నిలబడి నువ్వేం సాధించావే అంటూ నిలదీస్తాడు.


అయితే తాను స్వార్థం కోసం చేయలేదని కనకం చెప్పబోతుంటే రాజ్‌ అడ్డు పడి ఎందుకండి నా  ఎమోషన్స్‌ తో ఇలా ఆడుకున్నారు. మీరు త్వరలో చనిపోబోతున్నారని  మీ ఆఖరి కోరికను తీర్చడం కోసం మీ పెళ్లి రోజు జరిపించాలనుకున్నందుకు చివరికి నన్నే ఫూల్‌ ను చేశారు కదండి. అడుగడుగునా నాటకమే.. నోరు విప్పితే మాయాజాలమే. మీ మోసం బయటపడి వెర్రి వాణ్ని అయ్యాను అంటూ రాజ్‌ బాధపడుతుంటాడు. వంచనతో కాపురాలు నిలబడతాయని ఎలా అనుకున్నారు. ఏంటీ దారణం. దుగ్గిరాల ఫ్యామిలీ అనుకున్నారా? మీకు లేకపోతే కనీసం మీ కూతురుకైనా లేదా..? అంటూ రాజ్‌ ఆగిపోగానే..

అనండి సిగ్గు లేదా? అని ఆ మాట కూడా అనండి..అని కావ్య అనగానే  ఎన్ని అంటే ఏం లాభం ఆ రక్తంలోనే ఉంది ఈ మోసం  చేసే గుణం. ఆ పెంపకంలోనే  ఉంది ఎదుటివాళ్లను వంచించే గుణం. ఎక్కడో ఒక చోట మారిపోతారని ఆశ ఉండేది. కానీ మీ బుద్ది చూపించుకున్నారు. చ ఏం బతుకులు మీవి.. చూస్తుంటేనే ఆసహ్యం వేస్తుంది అంటూ రాజ్‌ తిట్టగానే కావ్య ఏడుస్తూ ఇక మనం బతికి ఏం లాభం అమ్మా అంటూ కనకాన్ని నిలదీస్తుంది. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా ఎవ్వరూ నమ్మరు అంటుంది. ఇంతలో ఎవరూ  నమ్మక్కర్లేదు. ఈ నాటకానికి తెర తీసిందే నేను అని చెప్తుంది అపర్ణ. ఇంతలో ఇందిరాదేవి నేను కూడా కనకం వెనకుండి నడిపించాను అంటుంది. దీంతో రాజ్‌ మరింత కోపంగా

మీరు కూడా మోసపోయారని ఇప్పటిదాకా అనుకున్నాను. కానీ మీరు కూడా ఈవిడలాగే మోసం చేశారని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఈవిడతో చేరి మీరు ఇలాగే తయారయ్యారా?  ఇక జీవితంలో కళావతిని ఈ కుంటుంబాన్ని నేను చచ్చినా నమ్మను. గుడ్‌ బై.. అంటూ రాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఇందిరాదేవి రుద్రాణిని కొట్టి తిడుతుంది. అపర్ణ కొట్టబోయి ఇంటి ఆడపడుచు కాబట్టి వదిలేస్తున్నాను వెళ్లిపో ఇక్కడి నుంచి అని చెప్తుంది. ఇందిరాదేవి కావ్య దగ్గరకు వెళ్లి ఓదారుస్తూ మీ అమ్మను అపార్థం చేసుకోకు అని చెప్పి వెళ్లపోతుంది. తర్వాత  అపర్ణ, కళ్యాణ్‌, అప్పు అందరూ వెళ్లిపోతారు. ఇంట్లో కావ్య, కనకం, మూర్తి మాత్రమే మిగులుతారు. ముగ్గురు ఏడుస్తూ కూర్చుని ఉంటారు.

టికి వెళ్లిన రాజ్‌ను అపర్ణ, ఇందిరాదేవి తిడతారు. ఇంటికి పట్టిన దరిద్రం మాటలు నమ్మి నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావని చెప్తారు. ఇప్పటికీ కూడా మేము చేసింది కరెక్టే నీ కాపురం నిలబెట్టడానికి మేము ఇదంతా చేశాము అంటారు. ఇద్దరూ కలిసి రాజ్‌కు ఎంత నచ్చజెప్పాలని చూసినా రాజ్‌ మారడు. మిమ్మల్ని ఇక జన్మలో నమ్మనని చెప్తాడు.  అసలు మీరు నాకు చెప్పే హక్కును కోల్పోయారు అంటాడు. ఇక నాజీవితంలో ఇంతే అంటూ ఎమోషనల్‌ అవుతాడు రాజ్‌. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Intinti Ramayanam Today Episode: గుడ్ న్యూస్ చెప్పిన అవని.. ఫిట్టింగ్ పెట్టిన పల్లవి.. నిజం తెలుసుకున్న అవని..?

GudiGantalu Today episode: మీనా పై అక్కసు కక్కేసిన ప్రభావతి.. శృతి మాటతో రోహిణికి షాక్.. మీనాను గెంటేసిన ప్రభావతి..

Illu Illalu Pillalu Today Episode: వేదవతికి కొత్త టెన్షన్.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..ఇంట్లో బాంబ్ పేల్చిన కళ్యాణ్..

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మేజర్‌ వైఫ్‌ ముందు అడ్డంగా బుక్కయిన అమర్‌     

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today September 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌, మిస్సమ్మల మధ్య రొమాన్స్‌     

Illu Illalu Pillalu Today Episode: రామరాజుకు ప్రేమ గురించి తెలుస్తుందా..? కాలేజీలో ప్రేమకు షాక్.. శ్రీవల్లికి అనుమానం..

Brahmamudi Serial Today September 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డాక్టర్‌ ను తిట్టిన రాజ్‌ – రాజ్‌ను ఓదార్చిన కళ్యాణ్‌    

Big Stories

×