OTT Movie : అందరూ ఇష్టపడే సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అవి కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు మాత్రమే. ఈ సినిమాలను మైండ్ రిఫ్రెష్ కోసం చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎన్నో కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కామెడీ మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
ఈ హాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ది డిక్టేటర్‘ (The Dictator). మందు బుద్ధి అయిన వ్యక్తి ఆ దేశానికి రాజు అయితే ఆ పాలన ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. సినిమా మొత్తం హీరో తన యాక్టింగ్ తో నవ్వులు పూయిస్తూ ఉంటాడు. ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒడియా అనే దేశాన్ని పరిపాలించే రాజు, రాణి కి ఒక అబ్బాయి పుడతాడు. అతనికి పుట్టుకతోనే విచిత్రంగా గడ్డం ఉంటుంది. అతనికి అల్లావుద్దీన్ అనే పేరు పెడతారు. చిన్నప్పుటి నుంచి అల్లావుద్దీన్ కొంచెం మంద బుద్ధి కలిగి ఉంటాడు. అతడు పరిపాలన ఏ విధంగా చేస్తాడంటే, ఒలంపిక్ గేమ్స్ నడిపిస్తూ అన్నిట్లోనూ అల్లావుద్దీన్ పార్టిసిపేట్ చేసి, మెడల్స్ ను అతనే సొంతం చేసుకుంటాడు. ఎవరైనా గెలిస్తే తుపాకీ చూపించి బెదిరిస్తూ ఉంటాడు. ఈ సీన్స్ చూస్తే కడుపుబ్బ నవ్వుకోకుండా ఉండలేరు. ఆ తర్వాత అమ్మాయిలను మాత్రమే తనకు బాడీగార్డ్స్ గా పెట్టుకుంటాడు. తనకు నచ్చిన అమ్మాయిలతో ఏకాంతంగా గడుపుతూ, ఆ ఫోటోలను గోడ మీద అతికిస్తూ ఉంటాడు. ఇతని తిక్క పరిపాలన నచ్చక కొంతమంది కాల్పులు జరుపుతారు. అయితే కాల్పులు జరిపినప్పుడల్లా అతనికి డూప్ గా ఉండే వ్యక్తులు చనిపోతూ ఉంటారు. ఒకరోజు అమెరికా నుంచి ఈ రాజుకు పిలుపు వస్తుంది.
బాబాయ్ తో కలిసి అల్లావుద్దీన్ అమెరికా దేశానికి వెళ్తాడు. అక్కడ అల్లావుద్దీన్ ని ఒక వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. అతనికి గడ్డం తీసేసి నిప్పు పెడతాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న అల్లావుద్దీన్ గడ్డం లేకుండా తిరుగుతాడు. అతనికి గడ్డం లేకపోవడంతో ఎవరూ గుర్తు పట్టకుండా ఉంటారు. ఇదే అదునుగా బాబాయ్ ఒక నకిలీ రాజును ఆదేశానికి పరిచయం చేస్తాడు. బాబాయ్ మోసం చేశాడని అల్లావుద్దీన్ తెలుసుకుంటాడు. అల్లావుద్దీన్ ఒక సాధారణ మనిషిగా మారిపోతాడు. చివరికి అల్లావుద్దీన్ తన తప్పులను తెలుసుకుంటాడా? అమెరికా నుంచి అతని దేశానికి తిరిగి వస్తాడా? అతని పరిపాలన మళ్లీ గాడిన పడుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది డిక్టేటర్’ (The Dictator) అనే ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి.