BigTV English

OTT Movie : దైవాన్ని ఎదిరించి గర్ల్ ఫ్రెండ్ కోసం ప్రాణాలను రిస్క్ లో పెట్టే ప్రియుడు… వీడు మామూలోడు కాదు

OTT Movie : దైవాన్ని ఎదిరించి గర్ల్ ఫ్రెండ్ కోసం ప్రాణాలను రిస్క్ లో పెట్టే ప్రియుడు… వీడు మామూలోడు కాదు

OTT Movie : ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలలో ఫాంటసీ సినిమాలంటే మూవీ లవర్స్ చెవి కోసుకుంటారు. ఈ సినిమాలు ఎంటర్టైన్ చేసే పద్ధతి క్రేజీగా ఉంటుంది. అందులోనూ హాలీవుడ్ సినిమాలంటే చెప్పాల్సిన పని లేదు. బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఒక అడ్వెంచర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది? ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ మూవీ పేరు ‘ది గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్‘ ( The gods of Egypt). దేవతల మధ్య ఆదిపత్యం కోసం యుద్ధం జరుగుతుంది. చివరికి మనుషుల సాయంతో ఒక దేవుడు విజయం సాధిస్తాడు. ఈ ఫాంటసీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఈజిప్ట్ ప్రాంతంలో హోరస్ అనే ఒక దేవుడి కుమారుడికి పట్టాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇతనిని అభినందించడానికి దేవతలందరూ అక్కడికి వస్తారు. మనుషులు కూడా ఒకచోట నమస్కరిస్తూ కూర్చుంటారు. ఆ ప్రాంతానికి సెట్ అనే దేవుడు కూడా వస్తాడు. హోరస్ తండ్రిని అక్కడికి వచ్చి చంపేస్తాడు. హోరస్ ని ఓడించి రెండు కళ్ళు పీకేసి, అతనిని ఒకచోట బంధిస్తాడు. ఆ శక్తివంతమైన కళ్ళను ఒక చోట దాచిపెడతడు. ఆ ప్రాంతానికి వచ్చిన బెక్ అనే మానవుడు దొంగతనాలు చేయడంలో ఎక్స్పెక్ట్ గా ఉంటాడు. హోరస్ కళ్లను తిరిగి తెస్తే సెట్ అధిపత్యాన్ని ముగిస్తాడని, అతనికి సాయం చేయడానికి ట్రై చేస్తాడు. అంతఃపురంలో ఉండే ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు బెక్. ఆమె ద్వారా ఆ కళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాడు. ఈ ప్రయాణంలో బెక్ ప్రియురాలుకు బాణం తగిలి ప్రాణాలు కోల్పోతూ ఉంటుంది. ఒక కన్ను సంపాదించిన బెక్ హోరస్ దేవుడి దగ్గరికి వచ్చి, నా ప్రియురాలని కాపాడాలని చెప్తాడు. అందుకు ఇంకో కన్ను కూడా వస్తే బ్రతికించగలను అని  హోరస్ చెప్తాడు. వీళ్ళిద్దరూ ఆ కన్ను వెతకడం ప్రారంభిస్తారు.

ఈ విషయం తెలుసుకున్న సెట్ వీళ్లను అంతం చేయడానికి ఒక సైన్యం  పంపిస్తాడు. అయితే వారిని హోరస్ తుక్కు చేసి పంపిస్తాడు. హోరస్ తాత సూర్యదేవుడు కావడంతో అతని సాయం కోరుతాడు. సూర్యదేవుడు సైతాన్ రాకుండా ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటాడు. ఆ తర్వాత సెట్ సూర్యదేవుని దగ్గరికి వచ్చి అతనిని కూడా చంపేస్తాడు. సైతాన్ ప్రపంచాన్ని ఆవహిస్తూ ఉంటుంది. నరక ద్వారాలు మూసుకుంటాయి. కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని అనుకుంటాడు సెట్. చివరికి హోరోస్ తన రెండు కళ్ళను తిరిగి తెచ్చుకుంటాడా? బెక్ ప్రియురాలని హోరస్ కాపాడుతాడా? సెట్ ను యుద్ధంలో ఓడిస్తాడా? మళ్లీ హోరస్ రాజ్యం సంతోషంగా ఉంటుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : అమ్మాయంటే పడి చచ్చే సోఫా… అబ్బాయిలు చెయ్యేస్తే చావే… ఇదెక్కడి దిక్కుమాలిన చేతబడి భయ్యా ?

OTT Movie : అమ్మాయిని వదలకుండా… సొంత తండ్రి నుంచి అద్దెకిచ్చిన ఓనర్ దాకా… క్లైమాక్స్ కి పిచ్చోళ్ళయిపోతారు మావా

OTT Movie : భార్య ఉండగా పెళ్ళైన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా… పక్క అపార్ట్మెంట్లోకి మారి ఆమె చేసే పనికి దిమాక్ ఖరాబ్

OTT Movie : నవ్వుతూ చంపే మిస్టీరియస్ వ్యక్తి… డబ్బు కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : HIV ఎక్కించి అమ్మాయిల్ని చంపే సైకో… ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన సామీ ?

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

Big Stories

×