BigTV English
Advertisement

OTT Movie : అనాధ శరణాలయంలో అమ్మాయిలు దయ్యాలయితే….. వణుకు పుట్టించే ఇండోనేషియన్ హర్రర్ థ్రిల్లర్

OTT Movie : అనాధ శరణాలయంలో అమ్మాయిలు దయ్యాలయితే….. వణుకు పుట్టించే ఇండోనేషియన్ హర్రర్ థ్రిల్లర్

OTT Movie : ఈమధ్య హారర్ థ్రిల్లర్ సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలను చూడాలంటే ఉత్సాహం చూపిస్తుంటారు మూవీ లవర్స్. వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమాలలో మాత్రమే ఉంటాయి. ఇటువంటి గూస్  బంప్స్ తెప్పించే సినిమా ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


రెండు ఓటిటిలలో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇండొనేషియన్ మూవీ పేరు ‘ది క్వీన్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్‘ (The queen of black magic). ఈ మూవీ ఒక అనాధ శరణాలయం చుట్టూ తిరుగుతుంది. వెన్నులో వణుకు పుట్టించే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హనీఫ్, నదియా తన చిన్నప్పుడు పెరిగిన అనాధ శరణాలయం చూడటానికి వెళుతూ ఉంటారు. ఆ శరణాలయంలో వార్డెన్ చావు బతుకుల మధ్య ఉండటంతో, వీళ్ళు కారులో ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. మార్గమధ్యంలో ఒక జింక అడ్డుగా రావడంతో తప్పించుకోలేక దానిని గుద్దుతారు. అయితే జింకే కదా అని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అయితే అక్కడ ఒక అమ్మాయిని గుద్దడంతో స్పృహ కోల్పోతుంది. అనాధ శరణాలయంకి వచ్చిన తర్వాత వార్డెన్ ని కలుస్తారు. అక్కడికి వచ్చిన ఈ ఫ్యామిలీ ఒక గది మూసి ఉండడం గమనిస్తుంది. ఆ గదిలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరా అనే అమ్మాయి మానసిక రోగంతో బాధపడటం వలన అందులో బంధించారని చెప్తారు. ఆ తర్వాత ఆమె తన తలను గోడకు కొట్టుకొని చనిపోయిందని తెలుసుకుంటారు. అందువల్ల ఆ గదిని క్లోజ్ చేసామని, అందులో పనిచేసే వ్యక్తులు చెప్తారు. బయటికి వచ్చి కారు దగ్గర హనీఫ్ చూడగా కారుకి రక్తపు మరకలు అంటుకుని మనిషి వెంట్రుకలు కూడా ఉంటాయి.

కంగారుపడి ఆక్సిడెంట్ చేసిన  చోటుకి వెళ్ళి హనీఫ్ వెళ్లి చూస్తాడు. అక్కడ ఒక బస్సులో అమ్మాయిలు చాలా మంది చనిపోయి ఉంటారు. ఒక ఆత్మ ఆ బస్సులోకి వచ్చి అందరిని చంపేసి ఉంటుంది. హనీఫ్ కి ఈ విషయం గాయపడిన అమ్మాయి చెబుతుంది. అనాధ శరణాలయంలో వీళ్ళకు కొన్ని చేదు నిజాలు తెలుస్తాయి. వార్డెన్ అమ్మాయిలను వేధించి వాడుకునేవాడు. ఆ నిజం మీరికి తెలియడంతో, ఆమెను బంధించి చనిపోయేలా చేస్తాడు. అలా చనిపోయిన వాళ్లలో ఒకరైన ఈ ఆత్మ కొంతమందిపై ప్రతి కారం తీర్చుకుంటుంది. చివరికి అనాధ శరణాలయం లో ఆ పిల్లల పెరగకూడదు అని వాళ్లను చంపేసి ఉంటుంది. ఆ తర్వాత హనీఫ్ ఫ్యామిలీని ఆ దయ్యం ఏం చేస్తుంది? వార్డెన్ ని కూడా చంపేస్తుందా? హనీఫ్ ఫ్యామిలీ అనాధ శరణాలయం నుంచి తప్పించుకుంటారా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ని తప్పకుండా చూడండి.

Related News

The Great Pre Wedding Show OTT : చిన్న సినిమాగా వచ్చి చితగ్గొడుతున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’… క్రేజీ ఓటీటీ డీల్

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

Big Stories

×