Bigg Boss Nabeel : తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ ను చూస్తమా? విన్నర్ ఎవరు? అనేది తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపటితో ఈ బిగ్ బాస్ సీజన్ 8 కు ఎండ్ కార్డు పడబోతుంది. ప్రస్తుతం హౌస్ లో కేవలం 5 గురు మాత్రమే ఉన్నారు. వీరిలో బిగ్ బాస్ ట్రోపీని ఎవరు అందుకుంటారు అనే ప్రశ్నలు గంట గంటకు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ వారం బిగ్ బాస్ ఎటువంటి టాస్క్ లు ఇవ్వకుండా కేవలం సీరియల్స్ బ్యాచ్ తో కానిచ్చేశాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ జర్నీని ఏవి రూపంలో చూపించాడు. నబీల్ తన ఏవిని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఆ ఏవిలో ఏముందో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..
నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా నిఖిల్ గురించి ముందుగా చూపించాడు. ఆ తర్వాత ప్రేరణ గురించి చూపించి ఆమెను తన మాటల తో ఎమోషనల్ అయ్యేలా చేసాడు. ఆ తర్వాత అంటే చివరకి నబీల్ ఏవి ని చూపించాడు. హౌస్ లో తన పెర్ఫార్మన్స్ ఎలా ఉందో చూసుకొని నబీల్ కూడా ఫీల్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ మాట్లాడుతూ.. వరంగల్ కా షేర్ నబీల్ అన్న పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లో సుపరిచితం. మీ టాలెంట్, వ్యక్తిత్వాన్ని కోట్లమందికి తెలియజేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎవిక్షన్ షీల్డ్ త్యాగం చేసి ఉన్నతంగా ఆలోచించే గుణానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. మీరు సెల్ఫ్ మేడ్. అందుకే ఆత్మగౌరవం కూడా ఎక్కువే. దాన్ని ప్రశ్నించినవారికి ఆటతోనే ధీటుగా జవాబిచ్చారు అని పొగడ్తల వర్షం కురిపించి నబీల్ ను ఫుల్ ఖుషి అయ్యేలా చేసాడు.
అలాగే ఇంటి మొదటి మెగా చీఫ్‌గా నిలిచారు. మీలో ఫైర్ తగ్గిందన్నప్పుడు మీ సామర్థ్యాన్ని ప్రశ్నించుకున్నారు. మీ చుట్టూ ఉన్న తారల తళుకుబెళుకుల మధ్య ఒక సామాన్యుడిలా ఒంటరై నిల్చున్నట్లు మీకనిపించింది. కానీ అది మీ బలహీనత కాదు మీ బలం అంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు. అది చూసి నబీల్ ఓపక్క సంతోషిస్తూనే మరోపక్క కంటతడి పెట్టుకున్నాడు. మొత్తానికి అందరి జర్నీ వీడియోలు పూర్తయ్యాయి. ఇక విన్నర్ ను తేల్చడం మాత్రమే మిగిలింది.. ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది కాస్త సస్పెన్స్ గా ఉన్నా కూడా మరోవైపు గౌతమ్ విన్నర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమ్ విన్నర్ యితే నిఖిల్ రన్నర్ అవుతాడని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు చెక్ పెట్టాలంటే ఒక్క రోజు వెయిట్ చెయ్యాల్సిందే… ఇప్పటికే హౌస్ లో తనదైన శైలిలో ఆడుతున్న నబీల్ కు ఓటింగ్ ప్రకారం చూస్తే కాస్త తక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. అవినాష్, నబీల్ ఎలిమినేట్ అవ్వగా, ప్రేరణ అమౌంట్ కలిగిన బాక్స్ ను తీసుకొని బయటకు వస్తుందని ఓ వార్త షికారు చేస్తుంది. ఆదివారం ఎపిసోడ్ లో విన్నర్ ఎవరో తెలియనుంది..