E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode : అవనికి షాకిచ్చిన అక్షయ్.. హాస్పిటల్ లో తల్లి మాయం.

Intinti Ramayanam Today Episode :  అవనికి షాకిచ్చిన అక్షయ్.. హాస్పిటల్ లో తల్లి మాయం.
Advertisement

Intinti Ramayanam Today Episode November 24th:  నిన్నటి ఎపిసోడ్ లో..  తన డాడీ ఎందుకు తప్పు చేశాడు అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అవని అక్కడికొస్తుంది. ఏంటి పల్లవి ఇదంతా ఎలా జరిగింది. అని జుట్టు పీక్కుంటున్నావా ఏంటి అనేసి పల్లవి అడుగుతుంది. మీ నాన్న ఎందుకు వాళ్ళని తీసుకొచ్చాడు ఎందుకు నిజం చెప్పేలా చేశాడని ఆలోచిస్తున్నావు కదా అందుకు కారణం ఈ వీడియోనే ఇదంతా నువ్వు చేసావని నా తమ్ముని వాడుకొని నన్ను దోషిని చేద్దామని అనుకున్నావు ఇది ఒకసారి చూస్తే నీకే అర్థమవుతుందని అవని చెప్తుంది. ఆ వీడియోని చూసిన పల్లవి షాక్ అవుతుంది. ఈరోజు నువ్వు నా మీద గెలిచావని ఆనందపడకు పల్లవి అంటుంది. దానికి అవని నా అమ్మ తమ్ముడు గురించి నిజం చెప్పాలనుకుంటున్నావా అయితే చెప్పుకో ఈ విషయాన్ని నేను ఇంట్లో చెప్పలేకపోతున్నాను అంటే దానికి కారణం మా అమ్మకి ఇచ్చిన మాటే అని అంటుంది. నువ్వు చెప్తానంటే నాకే ప్రాబ్లం లేదు నేను చెప్పలేంది నువ్వు చెప్పావని నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. కొన్ని రోజులుగా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా అని పల్లవికి కౌంటర్ ఇస్తుంది. నా పై ఏదైనా చేసేటప్పుడు ముందుగా ఆలోచించు.. నన్ను ఒక్కసారి దెబ్బ కొట్టావు కానీ మళ్లీ మళ్లీ కొట్టాలని చూస్తే ఊరుకుంటాను అని అనుకోకు నీ లిమిట్స్ లో నువ్వు ఉండు అని అవని వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

ఇవాళ ఎపిసోడ్ ప్రోమో విషయానికొస్తే.. అవని పల్లవి తనను ఇరికించాలని చేసిందని తెలుసుకుంటుంది. ఆ విషయాన్ని అవని తెలుసుకుంటుంది. పల్లవికి గట్టి షాక్ ఇస్తుంది. ఇక ముందు నా గురించి ఏదైనా చేసేటప్పుడు ఆలోచించు. ఇప్పటికైనా నీ గురించి నిజం చెప్పాలని నాకు లేదు. ఇంట్లో వాళ్లకి ఈ వీడియో ఒకసారి చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఇంట్లో వాళ్ళు నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారని అవని అంటుంది. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని అంటుంది. అవని ఇచ్చిన షాక్ కు పల్లవి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక పల్లవికి ఏదైనా చేసే ముందు ఆలోచించు అంటుంది. ఒక ఆడదానిలా బిహేవ్ చెయ్యి అనగానే పల్లవి కోపంతో రగిలిపోతుంది..

Advertisement

ఇక ఇంట్లోకి వెళ్లిన అవనికి కమల్, ప్రణవి సడెన్ సర్ ప్రైజ్ ఇస్తారు. అవనికి ఆకాశానికి పొగిడేస్తూ స్వీట్స్ పెడతారు. దానికి అవని పొంగిపోతుంది. కానీ పల్లవి మాత్రం కుళ్ళుకొని చచ్చిపోతుంది. అవనికి హారతి ఇచ్చి ఇంట్లో వాళ్ళ దిష్టే నీకు తగిలిందనేసి చెప్తుంది. ఇక పల్లవి బామ్మను కూడా కమల్ స్వీట్ పెట్టమని చెప్తాడు. అందరు సంతోషంగా ఉంటారు..

ఇక చక్రధర్ తన ఫ్రెండ్ కు ఆ వీడియోని చూపిస్తాడు. చెప్పాను కదా అవని తెలివి తక్కువదేమీ కాదు అని అని అంటాడు. అతనికి తన ఫ్రెండు నువ్వు చెప్తే నేను ఏదో అనుకున్నాను కానీ అవని చాలా తెలివైనది నువ్వు అనుకున్నట్టు మీ తెలివిని మించిపోయింది అనేసి అంటాడు. అవని నీ కట్టడి చేయాలంటే కొత్తగా వచ్చిన బంధాలని దూరం చేయాలని సలహా ఇస్తాడు. తన తమ్ముడు అమ్మని చంపేయాలని సలహా ఇవ్వడంతో చక్రధర్ అలానే చేస్తానని అంటాడు. మీనాక్షి తో పాటు ఆ భరత్ ని కూడా దూరం చేయాలని చక్రధరనుకుంటాడు. ఇక అక్షయ్ కోసం తన ఫ్రెండు వెయిట్ చేస్తూ ఉంటాడు.  ముందు ఇది తీసుకోరా నీకు ఒక నిజం చెప్పాలి అనేసి అంటాడు. కానీ అక్షయ్ నాకొద్దు అని అంటాడు. ఆ భరత్ నీ భార్య తమ్ముడు అని అంటున్నావు కదా వాళ్ళిద్దరి మధ్య నిజానికి ఎఫైర్ నడుస్తుంది అనేసి చెప్తాడు. మాట వినగానే అక్షయ్ తన ఫ్రెండ్ ని కొడతాడు. భార్య గురించి నువ్వు ఇంత తప్పుగా మాట్లాడుతావా అసలు నీకేం తెలుసు అవని గురించి అని అంటాడు. కొడతావని నేను ఊహించాను కాకపోతే ఈ ఫోటోలను చూడు ఒకసారి అనేసి అంటాడు. పక్కపక్కనే నిల్చుని ఫోటో దిగినంత మాత్రాన ఎఫైర్ అంట కడతావా అనేసి అనగానే అక్షయ్ మరోసారి తనని కొడతాడు.

Advertisement

అక్షయ్ మనసులో అనుమానం మొదలవుతుంది. అవని ఎందుకు మోసం చేస్తుందని ఆలోచిస్తూ బాధ పడతాడు. కోపంలో ఇంకాస్త ఎక్కువగా తాగి వస్తాడు.. ఇంటికి రాగానే అవనిని నిలదీస్తాడు. భరత్ మీనాక్షి నా తమ్ముడు తల్లి అని నిజం చెబుతుంది. ఆ తర్వాత హాస్పిటల్ కు తీసుకొని వెళ్తుంది కానీ అక్కడ మీనాక్షి, భరత్ కనిపించరు. అక్షయ్ మాత్రం కొత్త నాటకం మొదలు పెట్టావా అని అడుగుతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×