OTT Movie : లవ్ ఎప్పుడు ఎవరి మీద పడుతుందో ఖచ్చితంగా చెప్పలేము. వయసుతో సంబంధం లేకుండా ప్రేమలు మొదలవుతాయి. నిజ జీవితంలో కూడా వీటిని చాలా చూస్తూ ఉంటాం. అయితే ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఇటువంటి లవ్ స్టోరీలు కూడా చాలానే ఉన్నాయి. ఎక్కువ ఏజ్ ఉన్న మహిళలతో వ్యవహారం నడిపే, తక్కువ వయసు ఉన్న అబ్బాయిల సినిమాల గురించి తెలుసుకుందాం.
వాటర్ ఫర్ ఎలిఫెంట్స్ (Water for Elephants)
2011లోవచ్చిన ఈ అమెరికన్ రొమాంటి మూవీకి ఫ్రాన్సిస్ లారెన్స్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రీస్ విథర్‌స్పూన్, రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టోఫ్ వాల్ట్జ్, హాల్ హోల్‌బ్రూక్ నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 22, 2011న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. విమర్శకుల నుండి ప్రశంసలు కూడా ఈ మూవీ అందుకుంది. $38 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ, ప్రపంచవ్యాప్తంగా $117 మిలియన్లు వసూలు చేసింది. ఈ అమెరికన్ రొమాంటి మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
హోమ్ ఎగైన్ (Home again)
2017లో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి హాలీ మేయర్స్ దర్శకత్వం వహించారు. ఇందులో రీస్ విథర్‌స్పూన్, నాట్ వోల్ఫ్, జోన్ రుడ్నిట్స్‌కీ, పికో అలెగ్జాండర్, మైఖేల్ షీన్, కాండిస్ బెర్గెన్ నటించారు. 40 ఏళ్ల ఒంటరి మహిళ జీవితంలోకి వచ్చే అబ్బాయిలచుట్టూ, మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ సెప్టెంబర్ 8, 2017న ఓపెన్ రోడ్ ఫిల్మ్స్ ద్వారా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా $37 మిలియన్లు వసూలు చేసింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
హౌ హి ఫెల్ ఇన్ లవ్ (How he fell in love)
2015 లో విడుదల అయిన ఈ అమెరికన్ రొమాంటిక్ డ్రామా మూవీకి మార్క్ మేయర్స్ దర్శకత్వం వహించారు. మాట్ మెక్‌గోరీ, అమీ హార్గ్రీవ్స్, బ్రిట్నే ఓల్డ్‌ఫోర్డ్, మార్క్ బ్లమ్ నటించారు. ఈ మూవీ జూలై 15, 2016న ఓరియన్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలో విడుదల చేయబడింది. వయసులో ఉన్న మెజిసియన్ తనకన్నా చిన్న వ్యక్తితో ప్రేమలో పడుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
పూల్ బాయ్ నైట్ మేర్ (Pool boy Nightmare)
ఈ మూవీకి రోలఫ్ కాంఎఫ్స్కీ దర్శకత్వం వహించారు. పూల్ బాయ్ ఆడమ్‌తో, గేల్ అనే మహిళ ఆ సంబంధాన్ని నడుపుతుంది. ఆ తర్వాత ఆమె ఆడమ్ కి బ్రేక్ అప్ చెప్తుంది. దీనికి ప్రతీకారంగా ఆమె కుమార్తె బెక్కాతో ఆడమ్ డేటింగ్ చేయడం ద్వారా మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ప్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతోంది.
క్రాష్ ప్యాడ్ (Crash pad)
2017 లో రిలీజ్ అయిన ఈ అమెరికన్ కామెడీ మూవీకి కెవిన్ టెన్ట్ దర్శకత్వం వహించారు. ఇందులో డోమ్‌నాల్ గ్లీసన్, క్రిస్టినా యాపిల్‌గేట్, థామస్ హాడెన్ చర్చ్, నినా డోబ్రేవ్ నటించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.