MCG Crowd: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్ లు పూర్తి అయిన ఈ సిరీస్ లో.. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో భారత జట్టు విజయం సాధించింది. అనంతరం ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా జరిగిన రెండవ మ్యాచ్ లో కంగారులు విజయం సాధించారు. ఈ విజయంతో సిరీస్ ను 1 – 1 తో సమం {MCG Crowd} చేసింది ఆస్ట్రేలియా.
ఆ తర్వాత బ్రిస్ బెన్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ కి పలుమార్లు వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఇప్పుడు మేల్ బోర్న్ {MCG Crowd} వేదికగా బాక్సింగ్ డే రోజున (డిసెంబర్ 26) నుండి 4వ టెస్ట్ ప్రారంభమైంది. ఇరుజట్లకు కీలకమైన ఈ మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూసేందుకు క్రీడాభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ దృశ్య ఈ మ్యాచ్ ఇరుజట్లకు చాలా కీలకం. ఈ ట్రోఫీలో 2 – 1 ఆదిత్యం సాధించాలని ఆశిస్తుంది భారత జట్టు.
అయితే డిసెంబర్ 26వ తేదీన జరిగిన ఈ నాలుగోవ టెస్ట్ మొదటి రోజు ఆటకి {MCG Crowd} ఏకంగా 87,242 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. రెండవ రోజు 85,147, మూడవరోజు 83, 073, నాలుగో రోజు 43,867, ఐదవ రోజు 51, 371 ఇలా మొత్తంగా మెల్ బోర్న్ గ్రౌండ్ లో జరిగే ఈ నాలుగో టెస్ట్ కి భారత్ – ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూసేందుకు ఐదు రోజులలో 3,50, 700 మంది హాజరై రికార్డ్ సృష్టించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఓ టెస్ట్ మ్యాచ్ కి ఇంత మంది హాజరు కావడం ఇదే తొలిసారి.
1936 – 37 లో ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ {MCG Crowd} అటెండెన్స్ ని ఈ నాలుగవ టెస్ట్ దాటేసిందని మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ప్రకటించింది. టి-20 మేనియాలో టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందన్న వాదన నిజం కాదని.. ఈ మ్యాచ్ నిరూపించిందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ నాలుగో టెస్ట్ ఐదో రోజు ఆటలో భారత జట్టు ఇబ్బందుల్లో పడింది.
Also Read: Pro Kabaddi League 2024 Final: ప్రో కబడ్డీ విన్నర్‌గా హరియాణా స్టీలర్స్…ఇదే తొలిసారి !
33 పరుగుల వద్ద మూడు వికెట్లను కోల్పోయి మరోసారి కష్టాల్లో పడింది టీమిండియా. సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత జట్టు 112 పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోయింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (28*), యశస్వి జైస్వాల్ (63*) క్రేజ్ లో ఉన్నారు. ఈ సిరీస్ లో భారత జట్టు 2-1 ఆదిక్యం సాధించాలంటే.. మరో 228 పరుగులు చేయాల్సి ఉంది.
🚨 𝑯𝑰𝑺𝑻𝑶𝑹𝒀 🚨
Melbourne Cricket Ground witnesses a record-breaking crowd in the fourth Boxing Day Test between Australia and India! 🇮🇳🇦🇺
The previous record of 350,534 was set during the #AUSvENG match in 1936. History has been made once again! 🏟️😳#AUSvIND #Tests… pic.twitter.com/gfjEmLfOtY
— Sportskeeda (@Sportskeeda) December 30, 2024