Netflix : నెట్‌ఫ్లిక్స్‌లో 2025 మేలో 20కి పైగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ లిస్ట్ లో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంటరీలు ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సినిమాలు
The Biggest Fan – మే 1
‘ది బిగ్గెస్ట్ ఫ్యాన్’ అనేది ఒక కామెడీ డ్రామా. ఒక నటి ఆన్‌లైన్ క్యాన్సల్ కల్చర్ ను ఎదుర్కొని, తన కెరీర్‌ను రీస్టార్ట్ చేయడానికి మెక్సికోకు వెళుతుంది. అక్కడ ఆమె తన అతిపెద్ద అభిమానిని కలుస్తుంది. తరువాత ఆమె జీవితం అనూహ్యంగా మారుతుంది.
Forever – మే 8
జూడీ బ్లూమ్ నవల ఆధారంగా రూపొందిన రొమాంటిక్ డ్రామా ‘ఫరెవర్’. బాల్య స్నేహితులైన కీషా, జస్టిన్‌ల మధ్య నడిచే టీనేజ్ ప్రేమకథ ఈ మూవీ. ఈ చిత్రంలో లవీ సిమోన్, మైఖేల్ కూపర్ జూనియర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Nonnas – మే 9
కామెడీ ఎంటర్టైనర్ ‘నోన్నాస్’. విన్స్ వాన్ తన తల్లి జ్ఞాపకార్థం ఇటాలియన్ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తాడు. ఇందులో స్థానిక గ్రాండ్ మదర్స్ చెఫ్‌లుగా పని చేస్తారు. సుసాన్ సరండన్, తలియా షైర్, లిండా కార్డెల్లిని, లోరైన్ బ్రాకో వంటి నటులు ఈ చిత్రంలో ఉన్నారు.
Fear Street: Prom Queen – మే 22
ఇదొక హర్రర్ మూవీ. R.L. స్టైన్ ‘ఫియర్ స్ట్రీట్’ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో 1988లో షేడీసైడ్ హైస్కూల్ ప్రామ్‌లో జరిగే హర్రర్ స్టోరీని చూడవచ్చు. ఒక కొత్త అమ్మాయి ప్రామ్ క్వీన్‌గా ఎంపిక కావడంతో, పాపులర్ అమ్మాయిలు ఒక్కొక్కరూ అదృశ్యమవుతారు. ఇందులో ఇండియా ఫౌలర్, సుజానా సన్, లిలీ టేలర్ నటిస్తున్నారు.
Smile – మే 14
సైకియాట్రిక్ వార్డ్‌లో పని చేసే థెరపిస్ట్ రోజ్ కాటర్. ఒక యువతి ఆత్మహత్యను చూసిన తర్వాత ఆమెను అతీంద్రియ శక్తి వెంటాడుతుంది. ఈ హర్రర్ మూవీలో సోసీ బేకన్, జెస్సీ టి. అషర్ నటించారు.
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్
The Four Seasons – మే 1
ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్ లో టీనా ఫే, స్టీవ్ క్యారెల్, కోల్మన్ డొమింగో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ మూడు జంటల మధ్య ఫ్రెండ్షిప్ తో నడుస్తుంది. కానీ ఒక జంట విడాకులతో వీళ్ళ డైనమిక్స్ మారుతాయి.
Sirens – మే 22
డార్క్ కామెడీగా రూపొందిన ఈ సిరీస్ లో జూలియన్ మూర్, మేఘన్ ఫాహీ, మిల్లీ ఆల్‌కాక్ మెయిన్ లీడ్స్ గా నటించారు. ఈ సిరీస్ లో ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితంలో జరిగే చీకటి రహస్యాలను చూడవచ్చు.
Big Mouth సీజన్ 8 – మే 23
ఈ యానిమేటెడ్ కామెడీ ఎమ్మీ-విన్నింగ్ సిరీస్ లో ఇదే చివరి సీజన్. టీనేజ్ జీవితాలు, హార్మోన్ల గందరగోళం వంటివి ఈ సిరీస్ లో చూడవచ్చు.
Love, Death & Robots వాల్యూమ్ 4 – మే 15
10 కొత్త సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ కథలతో ఈ యానిమేటెడ్ ఆంథాలజీ సిరీస్ తిరిగి వస్తుంది. వీటితో పాటు 8 కొత్త డాక్యుమెంటరిలు కూడా ఈ నెల నెట్ ఫ్లిక్స్ లో అడుగుపెట్టబోతున్నాయి.