BigTV English

Siraj – Gill : ICC భారీ తప్పిదం.. సిరాజ్ కు అన్యాయం… గిల్ చేసింది తప్పు కాదా.. కండ్లు మూసుకుపోయాయా !

Siraj – Gill : ICC భారీ తప్పిదం.. సిరాజ్ కు అన్యాయం… గిల్ చేసింది తప్పు కాదా.. కండ్లు మూసుకుపోయాయా !

Siraj – Gill :   టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం మూడో టెస్టు మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 387 పరుగులకు ఆలౌట్ అయింది. అలాగే టీమిండియా భారీ స్కోరు సాధిస్తుందనుకున్న తరుణంలో వరుస వికెట్లు కోల్పోయి 387 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మళ్లీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. ఆసందర్భంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలి ఓవర్ బుమ్రా బౌలింగ్ చేస్తున్న సమయంలో టైమ్ వేస్ట్ చేయాలని.. ఎక్కువ ఓవర్లు వేయకుండా ఉండాలని ఓపెనర్ బ్యాట్స్ మెన్ క్రాలీ తొలి ఓవర్ మూడో బంతికి వికెట్ల వద్ద నుంచి పక్కకు తప్పుకున్నాడు. మళ్లీ 5వ బంతి అతనికీ తాకడంతో ఫిజిషియన్ పిలిచి టైమ్ వేస్ట్ చేశాడు. దీంతో రెండు, మూడు ఓవర్లు జరగాల్సిన సమయంలో కేవలం ఒకే ఒక్క ఓవర్ జరిగింది.


Also Read : Jadeja – Carse : రన్ తీయకుండా ఇంగ్లాండ్ బౌలర్ కార్స్ కుట్రలు.. జడేజాను ఆపేసి మరి… ఇచ్చి పడేసిన జడ్డూ

మ్యాచ్  ఫీజులో కోత.. 


ఇదే సమయంలో కెప్టెన్ శుబ్ మన్ గిల్ ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలీ పై బండి బూతులు తిట్టాడు. మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతని పై మ్యాచ్ నిషేదం ఉంటుందని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఎలా ఏమి జరగలేదు. అయితే టీమిండియా బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఆరో ఓవర్ లో డకెట్ ను ఔట్ చేశాడు. ఆ తరువాత అతను దూకుడుగా సంబురాలు చేసుకున్నాడు. అందుకు సిరాజ్ కి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విదించినట్టు తాజగా ఐసీసీ తెలిపింది. అయితే టీమిండియా కెప్టెన్ బండ బూతులు తిట్టినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. పాపం సిరాజ్ సంబురాలు చేసుకున్న పాపానికి అతనికి ఫీజులో కోతనా..? అని నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం. ఇక సిరాజ్ కి ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. గతంలో డిసెంబర్ 2024లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ తో వాగ్వాదంతో డీమెరిట్ పాయింట్ ఇవ్వబడింది.

వాళ్లకో న్యాయం.. ఇతనికో న్యాయమా..? 

వాస్తవానికి డీ మెరిట్ పాయింట్ ఇవ్వడం ఒక నేరం కిందికే వస్తుంది. తాజాగా మ్యాచ్ ఫీజు కోత.. ఇలా అంత సిరాజ్ కే ఎదురవుతోంది. గతంలో విరాట్ కోహ్లీకి కి కూడా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. అది  ఆస్ట్రేలియా జట్టు పై ఆడినప్పుడు డీమెరిట్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇంగ్లాండ్ జట్టు పై విరాట్ బెయిర్ స్టో తో గొడవ పెట్టుకున్న సమయంలో అతను కెప్టెన్ గా ఉన్నాడనే ఏమో ఎలాంటి ఫీజు కోత.. జరిమానా విధించలేదు. కానీ  నిన్న సిరాజ్ ప్రమాదవశాత్తు భుజం తాకడంతో అతనికి జరిమానా విదించారు. సిరాజ్ వెళ్తున్న సమయంలో డకెట్ అతన్ని తాకాడు. దీంతో సిరాజ్ కి మ్యాచ్ కోత విధించారు. సోషల్ మీడియాలో సిరాజ్ కి ఒక న్యాయం.. కెప్టెన్ గిల్ కి ఒక న్యాయమా..? ఐసీసీకి అస్సలు కళ్లు కనిపించడం లేదా..? అని ప్రశ్నించడం గమనార్హం.

Related News

Asia Cup winners : ఇప్పటివరకు ఆసియా కప్ గెలిచిన జట్లు ఇవే.. టీమిండియాకే ఎక్కువ ట్రోఫీలు వచ్చాయా!

Asia Cup 2025 : సూర్య కుమార్ యాదవ్ లేకుండానే టీమిండియా జట్టు…?

IPL 2026 : CSK సంచలన నిర్ణయం..10 స్టార్ ప్లేయర్లను వదిలేయాలని ధోని ఆదేశాలు ?

Rishabh Pant : గిల్ ప్రైవేట్ పార్ట్స్ ను టచ్ చేసిన రిషబ్ పంత్.. వీడియో వైరల్

Cricketers: ఇదెక్కడి స్టేడియం రా… మెట్లపైనే స్కోర్ బోర్డు వివరాలు.. ఎక్కడంటే

Arjun Tendulkar Engagement: అర్జున్ టెండూల్కర్ కు 500 కోట్ల కట్నం..?

Big Stories

×