BigTV English

Deepika Padukone: దీపికాలో ఈ టాలెంట్ కూడా ఉందా.? కొత్తగా బయటికొచ్చిన షాకింగ్ విషయం..

Deepika Padukone: దీపికాలో ఈ టాలెంట్ కూడా ఉందా.? కొత్తగా బయటికొచ్చిన షాకింగ్ విషయం..

Deepika Padukone: హీరోయిన్స్ అనేవాళ్లు కేవలం నటనకే పరిమితం కాదు. వారిలో కూడా ప్రేక్షకులకు తెలియని చాలా టాలెంట్స్ ఉంటాయి. అవి సమయం వచ్చినప్పుడు మాత్రమే బయటపడుతుంది. అలా ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్స్ టాలెంట్స్ చూసి ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా తన ఫ్యాన్స్‌కు తెలియని ఒక కొత్త టాలెంట్‌ను బయటపెట్టింది. ఇటీవల దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసింది. దాని ద్వారానే తన టాలెంట్ గురించి బయటపడింది. ప్రస్తుతం సినిమాలను తగ్గించేసిన దీపికా.. ఎక్కువగా బిజినెస్‌లో లీనమయిపోయింది. అంతే కాకుండా బ్రాండ్స్ ప్రమోషన్స్‌తో కూడా బిజీ అయ్యింది.


ఫ్రెంచ్ వచ్చు

తాజాగా దీపికా పదుకొనె షేర్ చేసిన వీడియోలు ముందుగా తనకు ఫ్రెంచ్ చాలా బాగా వచ్చు అంటూ చెప్పడం మొదలుపెట్టింది. ఇంటర్‌లో తనకు ఫ్రెంచ్ సబ్జెక్ట్ ఉండేదని, అలా తనకు ఫ్రెంచ్ వచ్చని బయటపెట్టింది. అలా పారిస్‌లోని ఒక షూటింగ్‌లో పాల్గొన్న దీపికా.. అక్కడి వారితో ఫ్రెంచ్‌లోనే మాట్లాడడం మొదలుపెట్టింది. పారిస్ రోడ్లపై స్కూటీ, బైక్ రైడ్స్ ఎంజాయ్ చేసింది. మొత్తానికి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత పారిస్‌లో ఫోర్బ్స్ ఫోటోషూట్ కోసం వెళ్లనప్పుడు తను ఎలా ఎంజాయ్ చేసిందో చెప్పడం కోసం దీనిని దీపికా పోస్ట్ చేసిందని క్లారిటీ వస్తుంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దీపికా ప్రస్తుతం ఎక్కువగా ఫోటోషూట్స్‌తోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.


చివరి సినిమా ఫ్లాప్

గతేడాది ఏకంగా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది దీపికా పదుకొనె. ముందుగా 2024ను హృతిక్ రోషన్‌తో కలిసి చేసిన ‘ఫైటర్’తో మొదలుపెట్టింది. ఆపై ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’లో సుమతి పాత్రలో మెప్పించింది. ఈ సినిమాతోనే తను తెలుగులో కూడా అడుగుపెట్టింది. ఆపై అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సింగం అగైన్’లో లేడీ సింగంగా నటించి అందరినీ మెప్పించింది. మొదటి రెండు సినిమాలు మంచి హిట్ అయినా దీపికా చివరి చిత్రం ‘సింగం అగైన్’ మాత్రం డిశాస్టర్‌ను మూటగట్టుకుంది. ఇందులో దీపికా చేసిన ఫైట్స్, స్టంట్స్ కూడా సినిమాను సేవ్ చేయలేకపోయాయి.

Also Read: ఆ సినిమా ఫ్లాప్, ఒక్క రూపాయి కూడా తీసుకొని స్టార్ హీరో.. ఇప్పుడు ఇదే ట్రెండ్.!

బ్రేక్ ఇచ్చింది

‘సింగం అగైన్’ తర్వాత మరొక మూవీని ప్రారంభించలేదు దీపికా పదుకొనె (Deepika Padukone). ఇంతలోనే దువా సింగ్ పదుకొనెకు తను జన్మనిచ్చింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్న దీపికా.. పాప పుట్టిన తర్వాత అన్నింటికి కాస్త బ్రేక్ ఇచ్చింది. ఎక్కువగా బ్రాండ్ ప్రమోషన్స్, ఫోటోషూట్స్, తన కాస్మటిక్ బిజినెస్‌తోనే బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఒక్క మూవీ కూడా సైన్ చేయకపోవడంతో వెండితెరపై దీపికాను మిస్ అవుతున్నారు తన ఫ్యాన్స్. అందుకే తనను మళ్లీ ఎప్పుడెప్పుడు స్క్రీన్‌పై చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దీపికా పదుకొనె చేతిలో నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కే ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సీక్వెల్ మాత్రమే ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×