This Week OTT Releases : ఆగస్టు తొలి వారం ఓటీటీ ప్రేక్షకులకు పండుగలా మారబోతోంది. థియేటర్లలో సందడి చేసిన పలు సినిమాలు ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్‌ల కొత్త సీజన్‌లు కూడా ఈ వారమే స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ, ఫ్యామిలీ డ్రామా, యానిమేషన్.. ఇలా అన్ని జానర్లలో ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఈ వారం అందుబాటులోకి రానుంది.
రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘ఉయిర్’ ఆగస్టు 4 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, కథనం మరియు సస్పెన్స్ ఎలిమెంట్స్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా ఈ చిత్రం తెలుగు డబ్బింగ్‌తో కూడా అందుబాటులోకి రావడం విశేషం.
బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మూవీ ఎట్టకేలకు ఆగస్టు 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా పలు భారతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఆగస్టు 7న నెట్‌ఫ్లిక్స్ ఒకేసారి మూడు ప్రధాన టైటిల్స్‌ను విడుదల చేస్తోంది. ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ‘మై వాపస్ ఆవుంగా’ (Main Waapas Aaunga) భావోద్వేగ కథతో ప్రేక్షకుల ముందుకు రానుండగా, కార్గిల్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ (Operation Safed Sagar) మిలిటరీ వెబ్ సిరీస్ తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే అథర్వ నటించిన కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీ ‘ఇధయం మురళి’ (Idhayam Murali) కూడా ఇదే రోజు విడుదలవుతోంది. ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘హృదయం మురళి’ పేరుతో అందుబాటులో ఉంటుంది.
మొదటి సీజన్‌తో మంచి పేరు తెచ్చుకున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్ ‘వదంతి’ ఇప్పుడు రెండో సీజన్‌తో తిరిగి వస్తోంది. ఎం. శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కొత్త కేసు, కొత్త మలుపులు, మరింత ఉత్కంఠ ఈ సీజన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
విజయ్ ఆంటోనీ నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘నూరు సామి’ (Nooru Saami – తెలుగులో ‘వంద దేవుళ్లు’) ఆగస్టు 7 నుంచి జీ5లో విడుదల కానుంది. అదే రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యానిమేషన్ చిత్రం ‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’ (The Super Mario Galaxy Movie) జియోహాట్‌స్టార్‌లో తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభించనుంది.
మలయాళ ట్రెజర్ హంట్ మిస్టరీ థ్రిల్లర్ ‘సత్యత్తిల్ సంభవిచ్చతు’ (Sathyathil Sambhavichathu) ఆగస్టు 7 నుంచి సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘కాట్టాలన్’ (Kattalan) మనోరమా మ్యాక్స్‌లో విడుదల అవుతోంది.
ఇక తెలుగు కామెడీ డ్రామా ‘ఓ సుకుమారి’ (O Sukumari) థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఆగస్టు 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‌కు రానుంది.
Also Read : ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఓటీటీలో… 30 ఏళ్లు పోలీసులకు దొరకని మాస్టర్‌మైండ్ కథ
ఆగస్టు 4 – ఉయిర్- జియోహాట్‌స్టార్
ఆగస్టు 7 – లెనిన్- జీ5
ఆగస్టు 7 – మై వాపస్ ఆవుంగా -నెట్‌ఫ్లిక్స్
ఆగస్టు 7 – ఇధయం మురళి (హృదయం మురళి – తెలుగు) – నెట్‌ఫ్లిక్స్
ఆగస్టు 7 – వదంతి సీజన్ 2 – అమెజాన్ ప్రైమ్ వీడియో
ఆగస్టు 7 – ఆపరేషన్ సఫేద్ సాగర్ -నెట్‌ఫ్లిక్స్
ఆగస్టు 7 – నూరు సామి (వంద దేవుళ్లు) – జీ5
ఆగస్టు 7 – ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ – జియోహాట్‌స్టార్
ఆగస్టు 7 – సత్యత్తిల్ సంభవిచ్చతు – సన్ నెక్స్ట్
ఆగస్టు 7 – కాట్టాలన్ – మనోరమా మ్యాక్స్
ఆగస్టు 7 – ఓ సుకుమారి – అమెజాన్ ప్రైమ్ వీడియో