AQUA D PURE Copper RO Water Purifier: ఇంట్లోని చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారు తాగే నీటి స్వచ్ఛతపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం బోరు నీరు లేదా మున్సిపల్ వాటర్ నేరుగా తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మార్కెట్లో వేల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన వాటర్ ప్యూరిఫైర్లు కొనలేక ఇబ్బంది పడే మధ్యతరగతి కుటుంబాల కోసం AQUA D PURE 4 in 1 Copper RO Water Purifier అనే బెస్ట్ మోడల్ అందుబాటులోకి తెచ్చింది. లేటెస్ట్ డిజైన్‌తో, టెక్నాలజీతో వస్తున్న ఈ వాటర్ ఫిల్టర్.. స్వచ్ఛత, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ అదుర్స్ అనిపిస్తోంది.
10 స్టేజ్ ప్యూరిఫికేషన్:
RO, UV, UF, TDS అడ్జస్టర్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో నీటిలోని హానికరమైన బ్యాక్టీరియా, ప్రమాదకరమైన వైరస్‌లు, రసాయనాలు, కంటికి కనిపించని మలినాలను పూర్తిగా తొలగిస్తుంది. ఇది మీకు వంద శాతం సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తుంది.
4-ఇన్-1 కాపర్ టెక్నాలజీ :
మన పూర్వీకులు రాగి పాత్రలో నీరు తాగి ఎంత ఆరోగ్యంగా ఉండేవో మనకు తెలుసు. అదే రాగి అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఈ ప్యూరిఫైయర్ ద్వారా నేరుగా పొందవచ్చు. ఇది నీటిలోని పోషకాలను సంరక్షించి, మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణశక్తిని మెరుగు పరచడంలో అద్భుతంగా పని చేస్తుంది.
12 లీటర్ల స్టోరేజ్ ట్యాంక్ :
కుటుంబం పెద్దదైనా, చుట్టాలు ఇంట్లో ఉన్నా లేదా అనుకోకుండా.. కరెంట్ పోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిరంతరం నీటిని అందించడానికి వీలుగా ఇందులో పెద్దైన.. 12 లీటర్ల స్టోరేజ్ ట్యాంక్ ఇవ్వబడింది. దీని వల్ల నీటి కొరత అనే మాటే రాదు.
స్మార్ట్ TDS అడ్జస్టర్:
వచ్చే నీటిని బట్టి, అందులోని మినరల్స్ స్థాయిని అంచనా వేసి TDSని ఆటోమేటిక్‌గా నియంత్రించుకునే.. అవకాశం ఇందులో ఉంది. దీని వల్ల నీరు ఎల్లప్పుడూ సహజమైన తీపిదనంతో, ఆరోగ్యకరమైన మినరల్స్‌తో గొంతుకి చాలా హాయిగా ఉంటుంది.
Also Read: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. హాఫ్ ప్రైస్‌కే బెస్ట్ ట్యాబ్స్! డోంట్ మిస్
సామాన్యులకు అందుబాటులో ధర:
సాధారణంగా మార్కెట్లో ఈ రకమైన 10 స్టేజ్ కాపర్ RO ప్యూరిఫైర్ల ధర సుమారు రూ. 12,000 నుంచి రూ. 15,000 వరకు ఉంటుంది. అంత ధర పెట్టి కొనడం సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు కాస్త భారంగా మారుతుంది. అందుకే కస్టమర్లు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్ల కింద ఈ మోడల్ కేవలం రూ. 5,247 ప్రారంభ ధరకే మార్కెట్లో లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన తాగునీరు కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.
రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరగడం కంటే, ముందే అప్రమత్తమై మంచి ప్యూరిఫైయర్ ను వాడటం ఎంతో మేలు. కలుషిత నీటి భయాలను పూర్తిగా దూరం చేసి, ప్రతి గుక్కలోనూ ఆరోగ్యాన్ని పంచే ఈ మోడల్ వాటర్ ప్యూరిఫైర్ మీ కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ అద్భుతమైన ఆఫర్‌ను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండండి.