OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలకు చాలామంది అభిమానులు ఉంటారు. ఈ సినిమాలు చూస్తున్నప్పుడు వచ్చే ఫీలింగ్స్ ను తలుచుకున్నప్పుడు నవ్వు తెప్పిస్తుంటాయి. వీటిని సాధారణంగా ఒంటరిగా చూడటం కష్టంగానే ఉంటుంది. వెన్నులో వణుకు పుట్టించే సినిమాలను, ఒంటరిగా చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం. అటువంటి గూస్ బంప్స్ తెప్పించే ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో
ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఓయిజా : ఒరిజినల్ ఆఫ్ ఈవిల్‘ (Ouija: Original of Evil). 2016 లో వచ్చిన ఈ మూవీకి మైక్ ఫ్లానాగన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2014 లో వచ్చిన Ouijaకి సీక్వెల్ గా వచ్చింది. ఇందులో ఎలిజబెత్ రీజర్, లులు విల్సన్, అన్నలైజ్ బస్సో, హెన్రీ థామస్ నటించారు. ఒక వితంతువు తన ఫోనీ సీన్స్ వ్యాపారంలో ఓయిజా బోర్డ్‌ను ప్రవేశపెడుతుంది. దాని వల్ల చిన్న కుమార్తెకు ఆత్మలు వస్తుంటాయి. Ouija: Origin of Evil యునైటెడ్ స్టేట్స్‌లో అక్టోబర్ 21, 2016న యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా విడుదలైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా $81 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఆలిస్ తన భర్త చనిపోవడంతో, ఇద్దరు కూతుర్లతో కలసి జీవిస్తూ ఉంటుంది. ఆలిస్ ఆత్మలతో మాట్లాడతాను అంటూ కస్టమర్లకు చెప్పి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో పెద్ద కూతురు పొలినో తన ఫ్రెండ్స్ దగ్గర ఓయిజా గేమ్ ఎలా ఆడాలో తెలుసుకుంటుంది. ఈ గేమ్ ఒంటరిగా, స్మశానంలో ఆడకూడదు. గేమ్ ఆడేటప్పుడు ఆ వ్యక్తి అడిగే ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఈ విషయం తల్లికి చెప్పి ఆ గేమ్ ని ఇంట్లో ఆడటానికి ప్రయత్నిస్తారు. ఒకరోజు ఆలిస్, తన చిన్న కూతురుతో కలిసి ఆ గేమ్ ఆడుతుంది. చిన్న కూతురు డోరిస్లో ఆత్మ ప్రవేశించి, ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఇలా తన దగ్గరికి వచ్చే కస్టమర్లకు, గేమ్ ఆడిపిస్తూ ఉంటుంది ఆలిస్. ఆత్మలు మాత్రం డోరిస్ శరీరంలో నుంచి మాట్లాడుతాయి. ఈ క్రమంలో డోరిస్ స్కూల్ కి వెళ్లడం కూడా మానేస్తుంది. స్కూల్ ఫాదర్ అక్కడికి వచ్చి విషయం తెలుసుకుంటాడు.
ఆ గేమ్ గురించి తెలుసుకున్న ఫాదర్, నేను కూడా ఆడతానంటూ మొదలుపెడతాడు. తన భార్య పేరు చెప్పి తనతో మాట్లాడాలని అడుగుతాడు. అప్పుడు డోరిస్ లో ఉన్న ఆత్మ జవాబు చెప్పడం మొదలు పెడుతుంది. ఇది విన్న ఫాదర్ ఆలిస్ కి దిమ్మ తిరిగే విషయాలు చెబుతాడు. ఇప్పుడు వీళ్ళు ఉన్న ఇల్లు స్మశానం మీద కట్టారని, ఒక డాక్టర్ ఎంతోమందిని చంపి ఇక్కడే పాతి పెట్టాడని చెబుతాడు. వీళ్లు మాట్లాడుకుంటుండగా పోలినో బాయ్ ఫ్రెండ్ మైక్ అక్కడికి వస్తాడు. డోరిస్ లో ఆత్మ పూర్తిగా ఆవహించడంతో, పోలినో బాయ్ ఫ్రెండ్ మైకిని డోరిస్ చంపేస్తుంది. చివరికి డోరిస్ ఏమవుతుంది? ఆత్మల వల్ల ఇంకా ఎంతమంది చనిపోతారు? ఆ గేమ్ ఆడటం వల్లే ఇదంతా జరుగుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.