OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో మలయాళం సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న కథలతో సినిమాలను తరికెక్కిస్తున్నారు మేకర్స్. మీరాజాస్మిన్ నటించిన ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
సైనాప్లే (Saina play) లో
ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘పాలమ్ పజవుమ్‘ (Paalum Pazhavum). 2024లో విడుదలైన ఈ మలయాళం మూవీకి V. K. ప్రకాష్ దర్శకత్వం వహించారు. క్రియేటివ్ మైండ్స్ ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ మూవీలో మీరా జాస్మిన్, అస్విన్ జోస్ నటించారు. వయసు దాచిపెట్టి పెళ్లి చేసుకొనే ఒక జంట చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ 23 ఆగస్టు 2024న థియేట్రికల్‌గా విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ సైనాప్లే (Saina play) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
సుమి తన అన్నయ్య, తల్లితో కలిసి ఒక పల్లెటూరులో ఉంటుంది. సుమికి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచరుగా జాబ్ వస్తుంది. సుమి ఆనందంతో గట్టిగా అరవడంతో, అటుగా వస్తున్న సుమి అమ్మ కాలుజారి కింద పడుతుంది. ఆమెకు వెన్నెముక ఫ్రాక్చర్ అవ్వడంతో మంచానికే పరిమితం అవుతుంది. అప్పుడు తన తల్లిని చూసుకోవడానికి జాబ్ వదిలి అక్కడే ఉండాల్సి వస్తుంది సుమి. తన అన్నయ్య ఒక్కడు మాత్రమే జాబ్ చేయడానికి సిటీకి వెళ్ళిపోతాడు. ఆ తరువాత సుమీకి 33 సంవత్సరాలు వస్తాయి. సుమి అన్నయ్యకు కూడా చాలా రోజుల క్రితమే పెళ్లి అవుతుంది. సుమి తన సొంత కాళ్ళ మీద నిలబడాలని జాబ్ చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో ఒక బ్యాంకులో క్లర్క్ గా జాయిన్ అవుతుంది. మరోవైపు సునీల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని, ఉద్యోగం కంటే బిజినెస్ బెటర్ అని తండ్రిని సహాయం అడుగుతుంటాడు. సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాడు సునీల్. సుమీ, సునీల్ సోషల్ మీడియాలో పరిచయమవుతారు. ఇలా వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు.
సుమి తన వయసును 33 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలకు తగ్గించుకుంటుంది. సునీల్ కూడా 23 నుంచి ఐదు సంవత్సరాలు పెంచుకుంటాడు. ఇలా వీరి వయసు దాచిపెట్టి రిజిస్టర్ పెళ్లి చేసుకుంటారు. అయితే ఆ తర్వాత వీళ్ళకి అసలు వయసు తెలిసిపోతుంది. సునీల్, సుమి నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. సుమి బ్యాంకు క్లర్క్ కావడంతో లోన్ తీసుకొని బిజినెస్ పెట్టాలనుకుంటాడు. పెళ్లి చేసుకున్న తరువాత వీళ్ళిద్దరూ కలిసి సుమీ ఇంటికి వెళ్తారు. చివరికి వీళ్ళ పెళ్లిని కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేస్తారా? వయసు తేడాతో వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి? సునీల్ తన బిజినెస్ మొదలు పెడతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఓటిటి ప్లాట్ ఫామ్ సైనాప్లే (Saina play) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘పాలమ్ పజవుమ్’ (Paalum Pazhavum) అనే ఈ ఫ్యామిలీ డ్రామా మూవీని చూడాల్సిందే.