OTT Movie : టైమ్ ట్రావెల్ జానర్ లో వచ్చే స్టోరీలు ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేస్తాయి. సరికొత్త స్టోరీలతో ముందుకు వస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ నలుగురు భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిలు టైమ్ ట్రావెల్ ద్వారా ఫ్యూచర్ లోకి వెళ్తారు. ఆ తరువాత స్టోరీ ఊహించని ట్విస్టులతో నడుస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ అమెరికన్ సైన్స్-ఫిక్షన్ డ్రామా సిరీస్ పేరు ‘పేపర్ గర్ల్స్’ (Paper Girls). 2022లో విడుదలైన ఈ సిరీస్ బ్రియాన్ కె. వాన్ రాసిన 2015–2019 కామిక్ బుక్ సిరీస్ ఆధారంగా స్టెఫానీ ఫోల్సమ్ రూపొందించారు. ఈ సిరీస్‌లో కామ్రిన్ జోన్స్, రిలే లై నెలెట్, సోఫియా రోసిన్స్కీ, ఫినా స్ట్రాజా నటించారు. ఇది ఎనిమిది ఎపిసోడ్‌లతో ఒకే సీజన్‌గా 2022 జూలై 29 న ప్రీమియర్ అయింది. ఈ సిరీస్ టైమ్ ట్రావెల్, కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా వంటి థీమ్స్ తో తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం డబ్బింగ్‌లతో అందుబాటులో ఉంది. IMDb లో దీనికి 7.3/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
1988లో హాలోవీన్ తర్వాత ఓహియోలోని స్టోనీ స్ట్రీమ్ అనే పట్టణంలో ఎరిన్ టియెంగ్, మాక్ కాయిల్, టిఫనీ క్విల్కిన్, కేజే బ్రాండ్‌మన్ అనే 12 ఏళ్ల అమ్మాయిలు ఒక వింత సంఘటనలో చిక్కుకుంటారు. వీళ్ళు న్యూస్ పేపర్ డెలివరీకి వెళ్ళే సమయంలో, అనుకోకుండా 2019కి టైమ్ ట్రావెల్ చేస్తారు. అక్కడ వీళ్లంతా టైమ్-ట్రావెలర్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో, ఓల్డ్ వాచ్ (టైమ్‌లైన్‌ను స్వచ్ఛంగా ఉంచాలనుకునే సంస్థ), STF (టైమ్ ట్రావెల్ ద్వారా భవిష్యత్తును మెరుగుపరచాలనుకునే తిరుగుబాటుదారులు) మధ్య చిక్కుకుంటారు. ఈ యుద్ధంలో ఎరిన్ తన ముసలి రూపాన్ని కలుస్తుంది. అయితే ఆమె తన కలలకు భిన్నమైన జీవితాన్ని ఇక్కడ గడుపుతోంది. ఇది ఎరిన్‌కు షాక్ ఇస్తుంది.
మాక్ తన సోదరుడు డైలాన్ ముసలి రూపాన్ని కలుస్తుంది. తన కుటుంబం భవిష్యత్తు గురించి నిరాశపరిచే విషయాలను తెలుసుకుంటుంది. అదే సమయంలో ఆమె తన స్వంత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. టిఫనీ, కేజే కూడా వారి వయోజన రూపాలను కలుస్తారు. వారి భవిష్యత్ గురించి అనేక విషయాలను తెలుసుకుంటారు. ఈ అమ్మాయిలు తమ భిన్నమైన వ్యక్తిత్వాలను అధిగమించి 1988కి తిరిగి వెళ్లడానికి, ప్రపంచాన్ని రక్షించడానికి కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అనుకోని సంఘటనలు ఎదురుపడతాయి. వీళ్లంతా మళ్ళీ 1988కి తిరిగి వస్తారా ? భవిష్యత్తులోనే ఉంటారా ? అనేది ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : చచ్చినోడితో పాటే సమాధిలో ఫోన్ పాతిపెట్టే పిల్లాడు… కట్ చేస్తే పార్ట్స్ ప్యాక్ అయ్యే ట్విస్ట్