BigTV English

OTT Movie : పుట్ బాల్ ఆడే కుక్క… ఈ మలయాళ కామెడీ ఫ్యామిలీ డ్రామాకు పొట్ట చెక్కలే

OTT Movie : పుట్ బాల్ ఆడే కుక్క… ఈ మలయాళ కామెడీ ఫ్యామిలీ డ్రామాకు పొట్ట చెక్కలే

OTT Movie : సింపుల్ స్టోరీలతో మంచి విజయాలను అందించడంలో, మలయాళం దర్శకులు ఒక అడుగు ముందే ఉన్నారు. అందరి చూపు ఇప్పుడు మాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఉంది. ఈ సినిమాలు ఓటీటీలో కూడా సక్సెస్ రేటును పెంచుకున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం సినిమా, కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ మూవీ స్టోరీ ఒక కుక్క చుట్టూ తిరిగే కామెడీ, ఎమోషన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

కుంజవ, సింటో అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఫుట్‌బాల్ ఆటను ఎక్కువగా అభిమానిస్తుంటారు. మరోవైపు డోనా అనే అమ్మాయిని కుంజవ ఇష్టపడుతుంటాడు. ఆమె దృష్టిలో పడటానికి నానా తంటాలు పడుతుంటాడు. ఈ క్రమంలో ఆమెను తనవైపు తిప్పుకోవడానికి, సింటో సలహా తీసుకుని ఒక కుక్కను కొనుగోలు చేస్తాడు. దానికి బ్రెజిలియన్ ఫుట్‌బాల్ స్టార్ ‘నెయ్మర్’ పేరును పెడతాడు. అయితే నెయ్మర్ అనే ఈ కుక్క చాలా చిలిపి పనులు చేస్తూ, వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. కుంజవ తండ్రి సహదేవన్ నెయ్మర్ వల్ల సమస్యలు రావడంతో, ఆ కుక్కను పాండిచ్చేరికి వెళ్ళే వాహనంలో వదిలేస్తాడు. దీంతో కుంజవ, సింటో తమ పెంపుడు కుక్కను తిరిగి తీసుకురావడానికి ఒక సాహస యాత్రలాగా బయలుదేరతారు. ఈ ప్రయాణంలో వాళ్ళు అనేక సమస్యలను ఎదుర్కుంటారు. ఒకచోట కుక్కల పోటీలు జరుగుతున్నాయని తెలుసుకుని అక్కడికి వెళతారు. అయితే అక్కడ పోటీలలో, వీళ్ళు పెంచుకునే కుక్క కూడా ఉంటుంది. దానిని చూసి వీళ్లిద్దరూ షాక్ అవుతారు. చివరికి ఆ కుక్కను మళ్ళీ వెనక్కి తెస్తారా ? అక్కడ జరిగే పోటీలలో ఆ కుక్క గెలుస్తుందా ? ఆ కుక్క వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.


Read Also : అమ్మాయిలకు డబ్బులిచ్చి మరీ ఆ పార్ట్ కట్… ఈ సైకో కిల్లర్ చేసే పనికి గుండె జారిపోవాల్సిందే మచ్చా

 

జియో హాట్ స్టార్ (Jio hotstar) లో

ఈ మలయాళ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘నెయ్మర్’ (Neymar). 2023 లో వచ్చిన ఈ సినిమాకి సుధి మాడిసన్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇందులో మాథ్యూ థామస్, నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. V సినిమాస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై, పద్మ ఉదయ్ దీనిని నిర్మించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×