BigTV English

IPL Resumption: ఐపిఎల్ వెంటనే ప్రారంభిస్తాం.. శుభవార్త తెలిపిన చైర్మన్

IPL Resumption: ఐపిఎల్ వెంటనే ప్రారంభిస్తాం.. శుభవార్త తెలిపిన చైర్మన్

IPL Resumption: ఇండియా, పాకిస్తాన్ మధ్య కాల్పుల ఒప్పందం కుదరడంతో ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 పున:ప్రారంభం వీలైనంత త్వరగా కానుంది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్.. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసిన తరువాత పాకిస్తాన్ సైన్యం భారత్ సరిహద్దుల్లోని జమ్మూ ప్రాంతంలో మిసైల్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరుగుతన్న ఐపిఎల్ మ్యాచ్ ని బిసిసిఐ భద్రతా చర్యల దృష్ట్యా రద్దు చేసింది. ఆ తరువాత మరుసటి శుక్రవారం ప్రకటన జారీ చేసింది.


యుద్దం కారణంగా ఐపిఎల్ 2025ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని బిసిసిఐ ప్రకటించింది. దీంతో ఐపిఎల్ లోని 10 ప్రాంచైజీలకు చెందిన విదేశీ ప్లేయర్లు తమ స్వదేశాలకు పయనమయ్యారు. శనివారం నుంచే వారంతా తమ ఇళ్లకు బయలుదేరారు.

అయితే ఇంతలోనే యుద్ధం ఆపేందుకు పాకిస్తాన్, భారత్ లు అంగీకరించాయి. అందులో భాగంగానే కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఇప్పుడు కాల్పులు విరమణ అమల్లో ఉండడంతో ఐపిఎల్ వెంటనే ప్రారంభించాలని ఐపిఎల్ కమిటీ భావిస్తోంది. ఈ క్రమంలో ఐపిఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపిఎల్ వెంటనే ప్రారంభించేందుకు బిసిసిఐ భావిస్తున్నట్లు తెలిపారు.


“కాల్పుల విరమణ ప్రకటన ఇప్పుడే జరిగింది. మేము ఐపిఎల్ ప్రారంభించి వీలైనంత త్వరగా టోర్నమెంట్ పూర్తి చేసేందుకు అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. ఒకవేళ వెంటనే నిర్వహించే అవకాశముంటే మ్యాచ్ వెన్యూ, తేదీలు, మిగతా అంశాలను టీమ్ ఓనర్లు, కమిటీ సభ్యులు, బ్రాడ్ కాస్టర్స్, కీలక భాగస్వాములతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అన్నింటి కంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించాలి, చర్చలు జరిపి వీలైనంత త్వరగా ఐపిఎల్ ప్రారంభ తేదీ ప్రకటిస్తాం.” అని అరుణ్ ధుమాల్ ఒక జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ అన్నారు.

మరోమైపు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఐపిఎల్ 2025ని గురువారం లేదా శుక్రవారం తిరిగి ప్రారంభం కానుంది. “దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తల కారణంగా ఇండియా క్రికెట్ బోర్డ్ అయిన బిసిసిఐ ఐపిఎల్ టోర్నమెంట్ ని పరిస్థితులు సామాన్యం అయ్యేంతవరకు తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే కాల్పుల విరమణ అమలులోకి రావడంతో ఐపిఎల్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్వదేశాలకు తిరిగి వెళ్లిన విదేశీ ప్లేయర్లందరూ తిరిగి తమ ఫ్రారంచైజీ జట్లలో వెంటనే చేరాలని నిర్దేశించింది” అని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ తెలిపింది .

Also Read: ఉగ్రవాదులను అంతం చేయాలంటే అదొక్కటే మార్గం.. ఇండియాకు గ్లోబల్ సెక్యురిటీ నిపుణుడి సూచన

రిపోర్ట్ ప్రకారం.. ఫ్రాంచైజీ యజమాన్యాలు బిసిసిఐ మార్గనిర్దేశకాల ప్రకారం.. కొత్తగా ఏర్పాట్లు చేయనున్నాయి. విదేశీ ప్లేయర్లు టోర్నమెంట్ రద్దు కారణంగా త్వరగా వెళ్లిపోవడం లేదు. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లు మూసివేత కారణంగా వారు భయపడుతున్నారు. అందుకే వారు వీలైనంత త్వరగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయేందుకు ఆత్రుతగా ఉన్నారు.

ఈ అంశంపై బిసిసిఐ సెక్రటరీ దేవజీత్ సైకియా కూడా స్పందించారు. ఐపిఎల్ పున:ప్రారంభం కోసం కొత్త షెడ్యూల్, వెన్యూ ల గురించి త్వరలోనే చర్చలు చేసి ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×