Mosambi: బత్తాయిని రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లో పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండి కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. రోజూ బత్తాయి పండ్లు తింటే మెటబాలిజం పెరుగుతుంది. హైడ్రేషనల్ లెవల్స్ పెరుగుతాయి. ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పండు తింటే కేలరీలను తగ్గించినవారవుతాం. ఇందులోని ఫైబర్ వల్ల కడుపు నిండుతుంది. దీంతో చాలాసేపటి వరకూ కడుపు నిండుగా ఉంటుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
బత్తాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనిని రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండులో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంను హైడ్రేట్‌గా ఉంచుతుంది. మెటబాలిజం పెరిగి ఎనర్జీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ పండ్లలో నీటి శాతం కారణంగా హైడ్రేషన్ పెరుగుతుంది. కేలరీలను తగ్గిస్తుందని అంటున్నారు.
షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది:
బత్తాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కావున వీటిని తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇది చాలా వరకూ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరడతాయి. అంతేకాకుండా, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు అలర్జీలను తగ్గిస్తుందని వైద్యులు తెలిపారు.
బరువుకు చెక్:
బత్తాయిలు బరువు తగ్గేందుకు అనేక రకాలుగా తీసుకోవచ్చు. దీనిలో కేలరీలు తక్కువగానూ, పీచు పదార్థాలు ఎక్కువగానూ ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలుస్ట్రాల్ ను తగ్గిస్తుంది, అలాగే బరువును కూడా తగ్గిస్తుంది. బత్తాయి లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
దంత సమస్యలు మాయం:
బత్తాయిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని రెగ్యులర్‌గా తింటే ఆ పీచు పదార్థం కారణంగా దంత సమస్యలు దూరమవుతాయి. ఈ బత్తాయి రసం చిగుళ్ల నొప్పులను తగ్గిస్తుంది. అలాగే గొంతు ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. కావున బత్తాయిను అన్ని సీజన్‌లో తీసుకోవచ్చని అంటున్నారు.
జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:
బత్తాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువగా మనం జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తగ్గిపోతాయని చెబుతున్నారు. అంతే కాకుండా బత్తాయిలోని విటమిన్ సి చర్మానికి మేలు చేస్తుంది, చర్మ సంరక్షణను కాపాడుతుంది, చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.