Vijay Devarakonda: టాలీవుడ్ లో మల్టీ స్టార్ ట్రెండ్ బాగా కొనసాగుతుంది. ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించడం, మల్టీ హంగామా తో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రెండు అలనాటి రోజుల నుండి కొనసాగుతుంది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేశారు. అవి ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి,వెంకటేష్ , నాగార్జున ఇలా అప్పటినుంచి ఈ ట్రెండు కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన విధ్వంసాన్ని చూసాము. ఈ కోవకు చెందిన సినిమా గురించి ఇప్పుడు ఒక హాట్ టాపిక్ బయటికి వచ్చింది. ఆ సినిమా ఏంటి? ఆ హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
ఆ సినిమా ఇదేనా ..
చిన్న హీరోలు మల్టీ స్టార్ సినిమాలు చేయడం, ఒకరికొకరు సపోర్టుగా ఈవెంట్స్ కు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు 2015లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాలో సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం పాత్రలో నాని నటించిన సంగతి తెలిసిందే, అదే సినిమాలో రిషి అన్న పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. సినిమాలో మాళవిక నాయర్, రీతు వర్మ, హీరోయిన్ గా చేసారు. ఈ సినిమాతో నాగ అశ్విన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో నాని విజయ్ దేవరకొండ ను ఇంట్రడ్యూస్ చేసినట్లుగా ఒకటి రెండు చోట్ల వార్త బయటకు వచ్చింది.
అది నిజం కదా ..
ఇక అది నిజం కాదని, నాగ అశ్విన్ విజయ్ దేవరకొండ ఎప్పటినుంచో ఫ్రెండ్స్.. ఆ స్నేహం అప్పటి నుంచి ట్రావెల్ అయ్యి మహానటి, కల్కి దాకా తీసుకువచ్చింది. నాగ అశ్విన్, విజయ్ దేవరకొండతో ఒక యాడ్ కూడా తీసారు. అశ్విని దత్ నిర్మాతగా చేస్తున్న ఒక సినిమాలో విజయ్ దేవరకొండ తో మరో హీరో ని తీసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు, అప్పుడే హిట్ అందుకుంటున్న హీరో అయితే బాగుంటుంది అని, నాని, శర్వానంద్ అలాంటి వాళ్ళని తీసుకోవాలని ఆలోచించినప్పుడు నానిని సెలెక్ట్ చేశారు. విజయ్ దేవరకొండ ముందే సినిమాకి సెలెక్ట్ అయ్యాడు. ఆయన సినిమాలోకి నానిని తీసుకున్నారు. అంతేకానీ నాని, విజయ్ దేవరకొండ అని ఎవడే సుబ్రహ్మణ్యంతో ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. ఇలాంటివి అక్కడక్కడ మనం వింటున్నాం అది నిజం కాదు. నాని ఎప్పుడూ ఈ మాట బయటికి చెప్పలేదు కానీ, చెప్పే వాళ్ళు ఉన్నారు. నాని ఛాన్స్ ఇచ్చాడు కాబట్టే విజయ్ దేవరకొండ ఇప్పుడు హీరోగా కొనసాగుతున్నాడు అనే మాట వాస్తవం కాదు. సినిమా రీసెంట్ గా ఎవడే సుబ్రమణ్యం రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ఏది ఏమైనా ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మల్టీ స్టార్స్ సినిమాలని ఎంకరేజ్ చేస్తూ టాలీవుడ్ ని ముందుకు తీసుకువెళ్లాలి. హీరో ఎవరైనా ఒకరికొకరు సహకారం అందించుకుంటున్న ఈ ట్రెండు ఎప్పటికీ ఇలానే కొనసాగాలని మనము కోరుకుందాం.
Also read: Star Heroine : చేతినిండా సినిమాలు పెట్టుకోవడం కాదు… ఒక్క హిట్ అయినా కొట్టాలి మేడం