Viral video: భారతదేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దేశంలో చాలా చోట్ల కుండపోత వర్షం పడుతోంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై భారీ వరద నీరు చేరడంలో పలు రాష్ట్రాల మధ్య రాకపోకలు సైతం నిలిచిపోయాయి. భారీ వర్షంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షితం ప్రాంతాల్లోకి తరలివెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఏపీలో గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా వానలు పడుతున్నాయి. అయితే ఈ వర్షాలతో పలు చోట్ల రహదారులపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. సోషల్ మీడియాలో చాలా మంది వరదల వీడియోలు పోస్టులు చేస్తున్నారు. అయితే ముంబైలో ఓ మాల్ ప్రవేశ ద్వారం వద్ద భారీగా వరదనీరు రావడంతో అది స్విమ్మింగ్ పూల్ ను తలపించింది. దానిలో కొంత మంది పిల్లలు ఈదుకుంటూ ముందుకెళ్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాల గురించి తెలుసుకుందాం.
Oberoi Mall Goregaon Mumbai !
हर तरफ़ ख़ुशी की लहर
— Arun Arora (@Arun2981) August 19, 2025
స్విమ్మింగ్‌పూల్‌ను తలపించిన వరదనీరు..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని గోరేగావ్ లో ఉన్న ఒబెరాయ్ మాల్ ప్రవేశ ద్వారం వద్ద భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఈ వరద ప్రవాహం చూస్తుంటే స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తోంది. దీంతో అక్కడ కొంత మంది ఈదుకుంటూ ముందుకెళ్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోలో పిల్లలు వరద నీటిలో ఆనందంగా ఈత కొడుతూ.. ఆ ప్రాంతాన్ని ఆట స్థలంగా మార్చిన దృశ్యం కనిపిస్తుంది. చుట్టూ ఉన్నవారు ఈ దృశ్యాన్ని వీడియో తీస్తూ కనిపించారు. అందులో ఓ వ్యక్తి దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీడియో తెగ వైరల్ గా మారింది.
ALSO READ: CM Revanth Reddy: ఇదే అసలైన సమయం.. చంద్రబాబు, కేసీఆర్‌కు CM రేవంత్ కీలక విజ్ఞప్తి
ఇది ముంబై నగర పరిస్థితి…
భారీ వర్షాలతో ముంబై నగరం తడిసి ముద్దయింది. వరద నీటితో రహదారులు చెరువులను, వాగులను తలపిస్తున్నాయి, దీంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రజలను అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని సూచించింది. రహదారులపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: Weather Update: రాష్ట్రంలో కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో అయితే భారీ వానలు, బయటకు వెళ్లొద్దు
సీఎం దేవేంద్ర పడ్నవీస్ కీలక సూచనలు
ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ ముంబై, థానే, రాయ్‌గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది, రాబోయే కొన్ని గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్ నగరంలో, చుట్టుపక్కల జిల్లాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు బృందాలను మోహరించింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విపత్తు నిర్వహణ బృందంతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే 48 గంటలు ముంబై, సమీప ప్రాంతాలక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చెప్పారు.