HHVM OTT: సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఇటీవల కాలంలో సినిమాలను పూర్తిస్థాయిలో తగ్గించారని చెప్పాలి. ఈయన జనసేన పార్టీ(Janasena Party)ని స్థాపించిన తర్వాత క్రమ క్రమంగా సినిమాలను తగ్గిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కొత్త సినిమాలను ప్రకటించలేదు కానీ ఇదివరకు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా జులై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఏ.యం. రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డిప్యూటీ సీఎం హోదాలో పవన్…
పవన్ కళ్యాణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలం అయింది అలాంటిది ఆయన డిప్యూటీ సీఎం(Deputy Cm) అయిన తర్వాత విడుదల కాబోతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఏర్పడ్డాయి.. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయిందని చెప్పాలి. ఈ సినిమా హిస్టారికల్ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన హరిహర వీరమల్లు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
నెలరోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి..
ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వారు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని ఆగస్టు 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.. థియేటర్లో విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ సినిమా మాత్రం ఆగస్టు 22న విడుదల కాబోతుందని , త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.
రాజకీయాలలో బిజీగా మారిన పవన్..
ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 25వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఈయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది . ఇదివరకు కమిట్ అయిన సినిమాలు అన్నింటినీ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ప్రస్తుతం ఈయన పూర్తిస్థాయి రాజకీయ కార్యకలాపాలలో బిజీగా గడుపుతున్నారు.
Also Read: Director Ram Jagadeesh: సైలెంట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన కోర్టు డైరెక్టర్.. ఫోటోలు వైరల్!