OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చే కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమాలు మూవీ లవర్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరోయిన్ కి డాన్స్ పిచ్చి ఉంటుంది. అందుకోసం ఆమె చేసే సైకో పనులు మామూలుగా ఉండవు. ఒకసారి నవ్వు తెప్పిస్తూ, ఒకసారి వణుకు పుట్టిస్తూ ఉండే, ఈ సినిమాను చూస్తే మూవీ లవర్స్ బాగా చిల్ అవుతారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళ్తే…
జియో సినిమా (Jio cinema) లో
ఈ హాలీవుడ్ సైకో థ్రిల్లర్ మూవీ పేరు ‘పెరల్‘ (Pearl). 2022 వచ్చిన ఈ మూవీకి టీ వెస్ట్ దర్శకత్వం వహించారు. ఇందులో డేవిడ్ కోర్న్స్‌వెట్, టాండి రైట్, మాథ్యూ సుందర్‌ల్యాండ్, ఎమ్మా జెంకిన్స్-పురో నటించారు. సెప్టెంబర్ 3, 2022న 79వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌ను ప్రదర్శించి, యునైటెడ్ స్టేట్స్‌లోని థియేటర్‌లలో సెప్టెంబర్ 16, 2022న విడుదలైంది. ఈ మూవీ జియో సినిమా (Jio cinema) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ తల్లి, తండ్రి తో అమెరికాలో ఒక పల్లెటూరు ప్రాంతంలో నివసిస్తుంది. ఈమె భర్త సోల్జర్ గా హిట్లర్ తరపున జర్మనీలో పోరాడుతుంటాడు. అయితే హీరోయిన్ తండ్రి అనారోగ్యం కారణంగా కుర్చీకే పరిమితం అవుతాడు. హీరోయిన్ కి ఆమె తల్లి చాలా కండిషన్స్ పెడుతూ ఉంటుంది. ఇంటిలో ఉండే ఫామ్ ని చూసుకోమని చెప్తుంది. అయితే హీరోయిన్ కి డ్యాన్స్ అంటే చాలా పిచ్చి. ఇంట్లో తెలియకుండా సినిమాలను కూడా థియేటర్ కి వెళ్లి చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో హీరోయిన్ కి ఓక డైరెక్టర్ పరిచయం అవుతాడు. నువ్వు గొప్ప డాన్సర్ అవుతావు అంటూ పొగుడుతాడు. ఈ మాటలకి హీరోయిన్ చాలా ఆనందపడుతుంది. ఆ తర్వాత తన భర్త చెల్లెలు ఇంటికి రావడంతో హీరోయిన్ ఎంతో సంతోషపడుతుంది. డాన్స్ కాంపిటీషన్ ఉందని చెబుతూ, ఆమెకు అడ్రస్ కూడా ఇచ్చి వెళ్తుంది. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తానని తల్లికి చెప్తుంది హీరోయిన్. అయితే తల్లి ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఆమెను గట్టిగా కొట్టి ఒకచోట బంధిస్తుంది.
ఆ తర్వాత హీరోయిన్ డాన్స్ ఆడిషన్ కి వెళ్తుంది. అందులో ఆమె సరిగ్గా డాన్స్ చేయకపోవడంతో తిరిగి వెనక్కి పంపిస్తారు. ఈ క్రమంలో హీరోయిన్ ఇంటికి వచ్చిన డైరెక్టర్ కి అక్కడ అనుమాన పరిస్థితులు కనబడతాయి. ఇంతలోనే హీరోయిన్ ఆ డైరెక్టర్ ని చంపేస్తుంది. ఆ తర్వాత ఇంటి లోపల ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్లి ఆమెను కూడా చంపేస్తుంది. తన తండ్రి కుర్చీకే పరిమితమైనా కూడా, ఈమెకు ఏమొచ్చిందో గాని అతనిని కూడా చంపేస్తుంది. ఆ తర్వాత ఆ శవాలతో కలిసి భోజనం చేస్తుండగా, అక్కడికి తన భర్త చెల్లెలు వస్తుంది. ఆమె డాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యానని చెప్తుంది. ఆ కోపంతో ఆమెను కూడా అక్కడ చంపేస్తుంది. ఆ తర్వాత అక్కడికి, మిలటరీ నుంచి తన భర్త వస్తాడు. చివరికి హీరోయిన్ చేతిలో భర్త కూడా చనిపోతాడా? ఈ విషయం తెలియాలంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.