BigTV English

OTT Movie : రక్తం ఏరులై పారే నది… అల్టిమేట్ యాక్షన్, ఎక్స్ట్రీమ్ వయొలెన్స్… ఈ కన్నడ మూవీ మెంటల్ మాస్ మావా

OTT Movie : రక్తం ఏరులై పారే నది… అల్టిమేట్ యాక్షన్, ఎక్స్ట్రీమ్ వయొలెన్స్… ఈ కన్నడ మూవీ మెంటల్ మాస్ మావా

OTT Movie : కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒక అదిరిపోయే యాక్షన్ సినిమా ఓటీటీలో టాప్ లేపుతోంది. ఈ సినిమా కుల వివక్ష, గ్రామీణ హింస, మహిళల హక్కులు వంటి సామాజిక అంశాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే ఈ కథ, పెపె అనే యువకుడి పోరాటం, తన ప్రజల కోసం నిలబడటం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

‘పెపే’ (Pepe) శ్రీలేష్ ఎస్. నాయర్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ యాక్షన్ చిత్రం. ఈ చిత్రంలో వినయ్ రాజ్‌కుమార్ టైటిల్ రోల్‌లో నటించగా, మయూర్ పటేల్, నవీన్ డి. పడిల్, యష్ శెట్టి, కాజల్ కుందర్, మెడిని కెలమనే, అరుణ బాలరాజ్, సంధ్య అరకెరె సహాయక పాత్రల్లో కనిపించారు. ఇది 2024 ఆగస్టు 30న థియేటర్లలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2024 అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 6 నిమిషాల ఈ సినిమా, IMDbలో 5.1/10 రేటింగ్ ను పొందింది.


స్టోరీలోకి వెళ్తే

ఈ కథలో ఒక చిన్న నది రెండు గ్రామాలను విభజిస్తుంది. ఒకటి ఆధిపత్య కులం, మరొకటి దిగువ కులం. ఈ గ్రామాల మధ్య రక్తపాత గొడవలు మూడు తరాలుగా నడుస్తుంటాయి. పెపే ఒక దిగువ కులానికి చెందిన యువకుడు, తన తండ్రి ధర్మ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు. ఈ హత్యలో ఆధిపత్య కులానికి చెందిన మల్పే, ఒక స్థానిక ఇసుక మాఫియా నాయకుడి హస్తం ఉందని ఆరోపణలు ఉంటాయి. పెపే తన తల్లి సునీత, మామ గుణతో కలిసి జీవిస్తుంటాడు. సునీత ఈ రక్తపాతం ముగియాలని కోరుకుంటుంది. కానీ పెపే తీవ్రమైన స్వభావం, అతన్ని హింసాత్మక మార్గంలో నడిపిస్తాయి. పెపే తన సమాజం కోసం నిలబడి, అణగారిన వారి హక్కుల కోసం పోరాడుతాడు. అయితే ఈ పోరాటం అనేక రక్తపాత సంఘటనలకు దారితీస్తుంది.

మరోవైపు సింధు అనే యువతి పాత్ర కూడా ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఆధిపత్య కుల కుటుంబంలో జన్మించినప్పటికీ, సాంప్రదాయ నమ్మకాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. ఆమె పెపేతో ప్రేమలో ఉంటుంది. ప్రభ అనే మరొక మహిళా పాత్ర కూడా మహిళలపై జరిగే అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆమె కథ సినిమాకు హైలెట్ అవుతుంది. ఇక ఈ సినిమా నాన్-లీనియర్ కథన శైలిని అనుసరిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లను చూపిస్తూ, ప్రజెంట్ స్టోరీ నడుస్తుంటుంది. చివరికి పెపే ఈ వివాదాన్ని ముగిస్తాడా ? మరింత రక్తపాతానికి దారితీస్తాడా ? అతని లవ్ స్టోరీ ఏమవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఇదసలు సూపర్ హీరో సిరీసేనా ? అన్నీ మసాలా సీన్లే…ఫ్యామిలీతో అస్సలు చూడకూడని సిరీస్

Related News

OTT Movie : సీక్రెట్ లవ్… ఒకడు ప్రేమిస్తే, పెళ్లి మరొకడితో… ఊహించని ట్విస్ట్ తో లైఫ్ నాశనం

OTT Movie : చచ్చిన 7 రోజుల తరువాత రీఎంట్రీ… అఘాయిత్యం చేసిన గ్యాంగ్ ను చచ్చినా వదలకుండా… బతికుండగానే నరకం

OTT Movie : పడుచు పిల్లతో పాడు పనులు… కల్లోనూ అదే యావ… మస్ట్ వాచ్ మలయాళ కాంట్రవర్సీ డ్రామా

OTT Movie : టీనేజ్ కూతురున్న తల్లిపై ప్రేమ… మనసుకు హత్తుకునే మలయాళ ఆంథాలజీ

OTT Movie : మజా ఇచ్చే రాజకీయాలు… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులున్న హిందీ డార్క్ కామెడీ – క్రైమ్ డ్రామా

Big Stories

×