Nindu Noorella Saavasam Serial Today Episode: రూంలో ఆనంద్ హ్యాపీగా డాన్స్ చేస్తుంటాడు. అంజు ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. దీంతో ఆనంద్ సంతోషంతో అంజు దీనంతటికీ నువ్వేనే కారణం అంటూ ముద్దాడుతూ ఎన్ని థాంక్స్ చెపితే సరిపోతావే నేను గెలిచానంటే నువ్వేనే కారణం అంటుంటాడు. దీంతో అంజు నేనేం చేశానురా అంటుంది. నిజంగా నీవల్లే ఆనంద్ విన్ అయ్యాడే ఆ బంటి గాడు ఇచ్చిన ఐస్క్రీమ్స్ చాక్లెట్స్ కాదని నువ్వు ఇచ్చిన స్పీచ్‌కే అందరూ పడిపోయారు అని చెప్తుంది అమ్ము.. దీంతో అంజు అయ్యో నేను స్పీచ్ ఇచ్చానా..? అంటుంది. దీంతో ఆకాష్ మరీ అంత ఓవరాక్షన్ చేయకే నీ మాటలకే మన ఆనంద్ గాడికి ఓట్లు పడ్డాయి అంటాడు.
అంతగా నేనేం మాట్లాడానురా..? లేదురా ఆకాష్ నిజంగా నాకేం తెలియదు. అసలు నాకేం గుర్తు లేదురా..? అంటుంది. దీంతో అమ్ము చ నీ గురించి మాకు తెలియదా ఏంటి..? ఇక నిన్ను పొగిడే ఓపిక మాకు లేదు కానీ ఓరేయ్ ఆనంద్ రేపటి నుంచి నువ్వే లీడర్‌వి.. ఇక నువ్వు చేయాల్సినవి అన్ని చేసేయ్ అని అమ్ము చెప్తుంది. సరే అక్కా నిన్నే ఫాలో అవుతాను.. లాస్ట్ టైం నువ్వు చేసిన మంచి పనులు అన్ని కంటిన్యూ చేస్తాను అని ఆనంద్ చెప్తాడు. సరే దానితో పాటుగా చదువు మీద కూడా కాంన్‌సంట్రేషన్ చేయ్.. మంచి మార్కులు రావాలి. లేదంటే డాడ్ మళ్లీ సీరియస్ అవుతారు. అని అమ్ము చెప్పగానే.. సరే అక్కా నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటాడు ఆనంద్. బంటి గెలిస్తే మనకు చుక్కలు చూపిస్తా అన్నాడు కదా ఇప్పుడు నువ్వు వాడికి చుక్కలు చూపించు.. అంటాడు ఆకాష్.
అది ఎందుకు మర్చిపోతాను.. నెక్స్ట్ టైం వాడు మన జోలికి రాకుండా చేస్తాను అని ఆనంద్ చెప్పగానే.. వద్దురా ఆనంద్ వాడు చేసిందే మనం చేస్తే వాడికి మనకు తేడా ఏముంటుంది వదిలేసేయ్ అని అమ్ము చెప్తుంది. అలా ఎలా వదిలేస్తాం అక్కా.. ప్రన్సిపాల్ అండ చూసుకుని వాడు ఎంత రెచ్చి పోయాడు.. అంటాడు ఆకాస్. అవునక్కా వాడు స్కూల్ వదిలి వెళ్లిపోయేలా చేస్తాను..అనగానే.. వద్దు ఆనంద్ అదే వద్దంటున్నాను.. లీడర్ అన్నవాడు అందరినీ కలుపుకుని వెళ్లిపోవాలి ఎవరిని టార్గెట్ చేయకూడదు.. అని అమ్ము చెప్తుంది. బంటి గాడు గెలిచి ఉంటే అదే పని చేసేవాడు కదక్కా..?మనల్ని టార్చర్ చేసి ఉండేవాడు.. అని ఆకాష్ చెప్పగానే.. అందుకే వాడు గెలవలేదురా..? న్యాయం గెలిచింది. స్కూల్‌కు ఎలాంటి నాయకుడు కావాలో స్టూడెంట్స్ తెలుసుకున్నారు.. చూడు ఆనంద్ ఎలక్షన్స్ వరకు ఏ గొడవైనా ఒకసారి గెలిచిన తర్వాత అన్ని మర్చిపోవాలి. పైగా మనం స్కూల్‌కు వెళ్లేది మనం చదువుకోవడానికి అది మీ ఇద్దరు గుర్తు పెట్టుకోండి అని చెప్తుంది.
ఇంతలో అంజు ఓరేయ్ ఇవాళ ఉదయం నుంచి ఏం జరిగింది. నేను ఎంత ట్రై చేసినా నాకు ఏమీ గుర్తు రావడం లేదు అంటుంది. దీంతో అమ్ము కోపంగా నువ్వు నీ ఓవరాక్షన్ నిన్ను నైటంతా పొగడటం మా వల్ల కాదే.. ఓరేయ్ ఆకాస్ నువ్వేనా చెప్పరా దానికి అనగానే.. నాకు ఓపిక లేదక్కా..? నాకు నిద్దరొస్తుంది అంటాడు ఆకాష్.. నాన్నా ఆనంద్ నువ్వైనా చెప్పు దానికి అని అమ్ము చెప్పగానే.. ఒసేయ్ అంజు నీకు దండం పెడతానే నన్ను గెలపించినందుకు థాంక్స్ అంతకు మిచి నన్నేం అడగకు అంటాడు ఆనంద్. దీంతో అంజు అసలు నేను ఏం అడుగుతున్నాను.. మీరేం చెప్తున్నారురా..? అసలు మార్నింగ్ నుంచి నేనేం చేశాను.. నాకేం అయింది. అసలు నాకేం గుర్తు రావడం లేదు అంటుంది.. అందరూ తిట్టి అంజును పడుకోబెడతారు..
మరుసటి రోజు అమర్ ఇంటి మీద గద్ద తిరుగుతుంది. అది చూసిన రాథోడ్ భయంగా అమర్ తో సార్ మన ఇంటిపై గద్ద తిరుగుతుంది సార్ అని చెప్తాడు. దీంతో గద్ద తిరిగితే ఏమవుతుంది రాథోడ్.. అని అమర్ అడగ్గానే.. ఇంటిపై గద్ద తిరగడం ప్రమాదానికి సంతేకం సార్ అని రాథోడ్ చెప్పగానే.. ఏం మాట్లాడుతున్నావు రాథోడ్ అని అమర్ అడుగుతాడు. దీంతో రాథోడ్ అవును సార్ తీతువు పిట్ట అరవడం గద్దలు, రాబందులు ఇంటిపై తిరగడం ఏదో ప్రమాదం జరుగబోతుందనడానికి సూచన సార్. ఏదైనా కీడు జరగబోయే ముందు పక్షులు, ప్రకృతి ఇలా హెచ్చరిస్తూ ఉంటాయి సార్ అని చెప్తుండగానే.. అమర్ ఆలోచిస్తుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం