E-Paper
Advertisement

ప్రియురాలి చెల్లెలితో అలాంటి పాడు పని… బాయ్‌ఫ్రెండ్ కు చెమటలు పట్టించే ప్రియురాలి కథ

ప్రియురాలి చెల్లెలితో అలాంటి పాడు పని… బాయ్‌ఫ్రెండ్ కు చెమటలు పట్టించే ప్రియురాలి కథ
Advertisement

Revenge Drama OTT : రొమాంటిక్ డ్రామాలకు, రివేంజ్ థ్రిల్లర్లకు ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. అయితే లవ్ – రివేంజ్ వంటి రెండు అంశాలు కలిపి ఒకే సినిమాలో ఉంటే… ఇలాంటి సినిమాలను కూడా వదలకుండా చూస్తారు. కొంతమంది స్పెషల్ గా ఇలాంటి సినిమాలనే చూడడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఆ మూవీ పేరేంటి ? దాని కథ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇంటెన్స్ రివేంజ్, రొమాన్స్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా Perfect Addiction. క్లాడియా టాన్ రాసిన ప్రసిద్ధ వాట్‌ప్యాడ్ (Wattpad) నవల ఆధారంగా రూపొందింది ఈ మూవీ. దర్శకురాలు కాస్టిల్ లాండన్ దీనిని తీర్చిదిద్దారు. ఈ సినిమా ఇప్పుడు Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో యాక్షన్ ప్రియులు మెచ్చేలా భారీ ఫైట్ సీన్లు ఉంటాయి. అలాగే రొమాంటిక్ మూవీ లవర్స్ కోసం ఇంటెన్స్ రొమాన్స్ కూడా ఉంటుంది. అమ్మాయి పగ తీర్చుకోవడం అనే కథాంశంతో సాగే ఈ చిత్రం యూత్ ఆడియన్స్‌కు బాగా నచ్చుతుంది. ‘After’ సిరీస్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ ‘సైకో-రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా’ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

కథలోకి వెళ్తే…

Advertisement

సక్సెస్ ఫుల్ ఎమ్‌ఎమ్‌ఏ (MMA) ట్రైనర్ సియెన్నా లేన్ (కేలీ కోవాన్). ఆమె ప్రియుడు బాక్సింగ్ ఛాంపియన్ జాక్స్ (మాథ్యూ నోస్కా). అతన్ని ఆమె ఎంతో ప్రాణంగా ప్రేమిస్తుంది. హీరోయిన్ అతన్ని గొప్ప ఫైటర్‌ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఇంత ప్రాణంగా ప్రేమిస్తే, జాక్స్ తన సొంత చెల్లెలితోనే బెడ్‌రూమ్‌లో అడ్డంగా దొరికిపోతాడు. ఈ ద్రోహాన్ని సియెన్నా తట్టుకోలేకపోతుంది. జాక్స్‌పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది. అందులో భాగంగా అతని కెరీర్‌ ను నాశనం చేయాలని గట్టిగా డిసైడ్ అవుతుంది.

Also Read : హిమాలయాలలో దొరికిన అస్థిపంజరం… ఓటీటీని షేక్ చేస్తున్న హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్

Advertisement

దానికి తగ్గట్టుగా ప్రతీకార ప్లాన్ చేస్తుంది. అందుకోసం జాక్స్‌ ను రింగులో ఓడించగల ఏకైక వ్యక్తి కోసం సియెన్నా వెతుకుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు కేడెన్ విలియమ్స్ అనే ఒక అండర్‌గ్రౌండ్ ఫైటర్ దొరుకుతాడు. కానీ అతనేమో చాలా మొరటుగా, క్రమశిక్షణ లేకుండా బిహేవ్ చేస్తాడు. సియెన్నా అతనికి షెల్టర్ ఇస్తుంది. తన పర్యవేక్షణలో అతనికి కఠినంగా శిక్షణ ఇస్తుంది. జాక్స్ నుండి టైటిల్ బెల్ట్‌ ను లాక్కోవడమే వీరిద్దరి టార్గెట్. కలిసి ట్రైనింగ్ తీసుకునే క్రమంలో సియెన్నా, కేడెన్ మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమలో పడతారు. దీంతో గతంలో ఉన్న లవ్ స్టోరీ, ఇప్పటి లవ్ స్టోరీల మధ్య హీరోయిన్ గందరగోళానికి గురవుతుంది. చివరకు రింగులో జాక్స్, కేడెన్ మధ్య జరిగే ఆఖరి హై-స్టేక్స్ బాక్సింగ్ ఫైట్ లో ఎవరు నెగ్గుతారు ? అనేది స్టోరీ.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×