E-Paper
Advertisement

హిమాలయాలలో దొరికిన అస్థిపంజరం… ఓటీటీని షేక్ చేస్తున్న హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్

హిమాలయాలలో దొరికిన అస్థిపంజరం… ఓటీటీని షేక్ చేస్తున్న హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

Psychological Horror Thriller Movie on OTT : ఓటీటీలోకి ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు ప్రత్యేకత చాటుకుంటాయి. ఎందుకంటే ఆ సినిమాలు థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయినా కూడా ఓటీటీలలో బాగా ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఇది మామూలు దెయ్యం సినిమా కాదు.. ఒక రేంజ్ మైండ్ గేమ్ తో సాగుతుంది. స్టార్టింగ్‌లో పక్కింటి అమ్మాయి మాయమైందని ఒక మాజీ పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెడితే, సీన్ కట్ చేస్తే అది కాస్తా ఒక వింత ఆచారంతో భయంకరమైన శక్తి చుట్టూ తిరుగుతుంది. థియేటర్లలో దెబ్బతిన్నా, ఓటీటీలోకి వచ్చాక హారర్ లవర్స్ పిచ్చెక్కిపోయి చూసిన కల్ట్ మూవీ ఇది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బుర్ర తిరిగేలా చేస్తుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ అమెరికన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘The Empty Man’. 2020లో వచ్చిన ఈ సినిమా డేవిడ్ ప్రయర్ దర్శకత్వంలో తెరకెక్కింది. వనెస్సా ఆర్. డెల్ రే రాసిన ప్రసిద్ధ గ్రాఫిక్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో జేమ్స్ బ్యాడ్జ్ డేల్, మారిన్ ఐర్లాండ్, సాషా ఫ్రోలోవా, ఓవెన్ టీగ్ లీడ్ రోల్స్ లో నటించారు. నిజానికి ఈ సినిమా 2020 కరోనా సమయంలో ఎలాంటి ప్రమోషన్లు లేకుండా థియేటర్లలో విడుదల చేశారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన ఈ చిత్రం, ఆ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోకి వచ్చాక దాని మేకింగ్ శైలి కారణంగా హారర్ ప్రేమికుల ఆదరణ పొంది ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియో, ఆపిల్ టివిలలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ సినిమా కథ 1995లో భూటాన్ పర్వతాల్లో మొదలవుతుంది. నలుగురు స్నేహితులు ట్రెకింగ్‌కు వెళ్ళినప్పుడు, వారిలో పాల్ అనే వ్యక్తి అనుకోకుండా ఒక లోతైన గుహలో పడిపోతాడు. అక్కడ ఒక వింతైన అస్థిపంజరం చూసిన తర్వాత అతను దెయ్యం పట్టినట్లుగా మారిపోతాడు. కొద్దిరోజులకే అతని స్నేహితులంతా వింత పరిస్థితుల్లో చనిపోతారు. ఆ తర్వాత కథ 2018లో అమెరికాలోని మిస్సోరీకి మారుతుంది. జేమ్స్ అనే ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ తన భార్యాపిల్లలను కోల్పోయిన బాధలో ఒంటరిగా బతుకుతుంటాడు. ఒకరోజు అతని పక్కింటి అమ్మాయి అమండా హఠాత్తుగా మాయమవడంతో, ఆమెను వెతకడం కోసం జేమ్స్ రంగంలోకి దిగుతాడు.

అమండాను వెతికే క్రమంలో ఆమె స్నేహితులంతా ఒక వంతెనపైకి వెళ్ళి, ‘ఎంప్టీ మ్యాన్’ అనే ఒక భయంకరమైన శక్తిని పిలిచే వింత ఆచారం చేసినట్లు జేమ్స్ తెలుసుకుంటాడు. ఆ శక్తిని పిలిచిన మూడు రోజుల్లోనే ఆ పిల్లలంతా ఒక్కొక్కరుగా వింతగా ఆత్మహత్యలు చేసుకుని చనిపోతారు. దీని వెనుక ఒక ప్రమాదకరమైన కల్ట్ ఉందని, వాళ్ళు ఒక దైవిక శక్తిని భూమిపైకి తేవడానికి ప్రయత్నిస్తున్నారని జేమ్స్ తెలుసుకుంటాడు. చివరకు ఆ ముఠా అసలు ప్లాన్ ఏంటి ? తన జీవితానికి ఆ ఎంప్టీ మ్యాన్‌కు ఉన్న సంబంధం ఏమిటి ? అనేడి జేమ్స్ తెలుసుకోవడమే ఈ సినిమా కథ.

Advertisement

Read Also : ఆత్మల సాయంతో మర్డర్ ఇన్వెస్టిగేషన్… ఊహించని మలుపులతో సాగే మైండ్ బ్లోయింగ్ సిరీస్

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×