BigTV English

OTT Movie : 90 శాతం జంతుజాతిని తుడిచి పెట్టేసే వైరస్… మనుషుల్ని ముక్కలు ముక్కలుగా నరికేసే అమ్మాయిలు… నరాలు తెగే ఉత్కంఠ

OTT Movie : 90 శాతం జంతుజాతిని తుడిచి పెట్టేసే వైరస్… మనుషుల్ని ముక్కలు ముక్కలుగా నరికేసే అమ్మాయిలు… నరాలు తెగే ఉత్కంఠ

OTT Movie : హాలీవుడ్ సినిమాలు భిన్నమైన కథలతో వస్తుంటాయి. వీటిలో థ్రిల్లర్ సినిమాలను ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇస్తుంది. ఒక ఫామ్ హౌస్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. భూమి మీద తొంభై శాతం వైరస్ తో అంతమవుతారు. ఇక మిగిలిన వాళ్ళు ఆహార కొరతతో మనుషుల్ని చంపుకుతింటారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో ఉందంటే

’40 ఎకరాలు’ (40 Acres) 2024లో విడుదలైన కెనడియన్ పోస్ట్-అపోకలిప్టిక్ థ్రిల్లర్ చిత్రం. ఆర్.టి. థోర్న్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో డానియెల్ డెడ్‌వైలర్ (హేలీ ఫ్రీమాన్), మైఖేల్ గ్రేయెస్ (గాలెన్), కటేమ్ ఓ’కానర్ (ఇమాన్యుయెల్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2025 జూలై 2న థియేటర్లలో విడుదలైంది. 113 నిమిషాల రన్‌టైమ్‌తో అమెజాన్ వీడియో, ఆపిల్ టీవీ, ఫండాంగో ఎట్ హోమ్‌లో అందుబాటులో ఉంది.


కథలోకి వెళ్తే

ఒక వైరస్, అమెరికన్ సివిల్ వార్‌తో ఆహార కొరత వల్ల ప్రపంచం నాశనమవుతుంది. హేలీ ఫ్రీమాన్ అనే ఒక మాజీ సైనికురాలు, తన భర్త గాలెన్, నలుగురు పిల్లలతో కెనడా గ్రామీణ ప్రాంతంలోని 40 ఎకరాల ఫార్మ్‌లో జీవిస్తుంది. వీళ్ళు అమెరికన్ సివిల్ వార్ తర్వాత 1875లో కెనడాకు వలసవెళ్లిన ఆఫ్రికన్-అమెరికన్ రైతుల వారసులు. హేలీ, గాలెన్ తమ పిల్లలకు సైనిక శిక్షణ ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఆహారం కోసం కన్నిబల్స్ దాడులు చేస్తుంటారు. హేలీ కఠినమైన నియమాలు ఆమె పిల్లలను కాపాడుతూ వస్తుంది. అయితే ఆమె పెద్ద కొడుకు ఇమాన్యుయెల్ యుక్తవయసులో ఉండటంతో స్టోరీ మలుపు తిరుగుతుంది. అతను అడవిలో ఒక యువతితో సంబంధం పెట్టుకుంటాడు. దీంతో ఫార్మ్‌ ప్రమాదంలో పడుతుంది.

ఇప్పుడు కన్నిబల్ రైడర్‌ల దాడులు తీవ్రమవుతాయి. హేలీ, గాలెన్, వారి పిల్లలు తమ ఫార్మ్‌ను రక్షించడానికి ఒక ఉత్కంఠభరిత యుద్ధంలో పాల్గొంటారు. ఇమాన్యుయెల్ అమ్మాయితో పెట్టుకున్న సంబంధం కుటుంబంలో ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఈ కుటుంబం యుద్ధంలో ఒక భయంకరమైన మిలిషియా అనే కన్నిబల్ తో తలపడుతుంది. ఇది ఉత్కంఠభరిత యాక్షన్ సీక్వెన్స్‌లకు దారితీస్తుంది. చివరికి కన్నిబల్స్ చేతిలో ఈ కుటుంబం ఏమవుతుంది ? ఇమాన్యుయెల్ ప్రేమించిన అమ్మాయి ఎవరు ? ఈ క్లైమాక్స్ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ అపోకలిప్టిక్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

Read Also : రైతే కదా అనుకుంటే రప్పా రప్పా… ఒక్కొక్కడి దుమ్ముదులిపే రైతు బిడ్డ… ఇది కదా రివేంజ్ అంటే

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Param Sundari : బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న జాన్వీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movie : మత ప్రచారానికి వెళ్లి మట్టిలోకి… అంతుచిక్కని మిస్టరీలు ఉన్న నరకం ఆ ఊరు… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ మూవీ

OTT Movie : ఈమె అమ్మాయా ఆడ పిశాచా? ఇంత కరువులో ఉందేంటి భయ్యా… సింగిల్స్ కు ఎంజాయ్ పండగో

OTT Movie : రాత్రయితే క్రూరంగా మారే ముసలి భర్త… మొగుడి కళ్లు గప్పి పెయింటర్ తో యవ్వారం… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

Big Stories

×