BigTV English

OTT Movie : బంగారాన్ని ప్రేమించే పెళ్లి కొడుకు… చుక్కలు చూపించే పెళ్లికూతురు…

OTT Movie : బంగారాన్ని ప్రేమించే పెళ్లి కొడుకు… చుక్కలు చూపించే పెళ్లికూతురు…

OTT Movie : మలయాళం సినిమాలకు మనవాళ్లు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. ఈ సినిమాలను చాలా వరకు వదలకుండా చూస్తున్నారు. వీటిలో బాసిల్ జోసెఫ్ నటించిన సినిమాలు గురించి ముందుగా చెప్పుకోవాలి. పక్కింటి అబ్బాయిలా కనిపించే ఈ హీరో నటన కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. ఇతడు నటించిన అన్ని సినిమాలు మంచి టాక్ తెచ్చు కుంటున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక మూవీ కూడా సూపర్ హిట్ అయింది. కామెడీ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


జియో హాట్ స్టార్ (jio hotstar) లో

ఈ మలయాళం కామెడీ మూవీ ‘పొన్మన్’ (Ponman). జోతిష్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఇందులో భాషలు జోసెఫ్, సాజిన్ గోపు లిజోమోల్ ప్రధాన పాత్రలో పోషించారు. ఈ మూవీ జనవరి 30న థియేటర్లలో రిలీజ్ అయింది. మూడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 10 కోట్లకు పైగా వసూలు చేసింది. మార్చి 14 నుంచి ఈ కామెడీ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (jio hotstar) లో స్ట్రీమింగ్ కు వచ్చింది. హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది.


స్టోరీ లోకి వెళితే

ఒక ఫ్యామిలీలో పెళ్లిచూపులు జరుగుతాయి. అయితే పెళ్లి కొడుకు కట్నంగా 15 సవర్ల బంగారం అడుగుతాడు. ఆ ఫ్యామిలీ దగ్గర అంత డబ్బు ఉండదు. వీళ్లంతా కలసి హీరో దగ్గర బంగారాన్ని అరువుగా తీసుకుంటారు. ఇతడు కూడా ఒక బంగారం షాప్ కి ఏజెంట్ లా ఉంటాడు. అయితే పెళ్లికి వచ్చిన వాళ్లు కట్నాలు చదివిస్తే, ఆ పైసలతో ఆ అప్పు తీర్చాలి అనుకుంటారు తీసుకున్న వాళ్ళు. హీరో అనుకున్నట్టుగానే బంగారాన్ని ఆ  ఫ్యామిలీకి ఇస్తాడు. అయితే పెళ్లికి అనుకున్నంత జనం రాకపోవడంతో, వాళ్లకు చదివింపులు కూడా పెద్దగా రావు. ఇది తెలిసి అప్పు ఎలా కట్టాలి అని ఆ ఫ్యామిలీ ఆలోచనలో పడుతుంది. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మొదటి రాత్రి చేసుకుంటూ ఉంటారు. హీరో మాత్రం బయట కాపలా కాస్తుంటాడు. వాళ్లు బయటికి వస్తే బంగారాన్ని అడిగి తీసుకువెళ్లాలని అక్కడే ఉంటాడు.

చివరికి వాళ్ళు అక్కడినుంచి తెలివిగా పెళ్ళికొడుకు ఊరికి వెళ్ళిపోతారు. హీరో కి ఇది చూసి దిమ్మతిరిగిపోతుంది. పెళ్ళికొడుకు ఏరియా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అక్కడ రౌడీయిజం ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్లి బంగారాన్ని తీసుకురావడానికి హీరో బయలుదేరుతాడు. అక్కడ స్టోరీ చాలా రసవత్తరంగా సాగుతుంది. చివరికి హీరో ఆ బంగారాన్ని తెచ్చుకుంటాడా? ఆ ఊరిలో జనాలకి బలవుతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతున్న, ‘పొన్మన్’ (Ponman) అనే ఈ కామెడీ  ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×