Rice Water Serum: జుట్టు రాలడం ఇప్పుడు ఒక సాధారణ సమస్యగా మారింది. ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఎల్లప్పుడూ సిల్కీగా, పొడవుగా, మందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలి, క్రమరహిత ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం వంటి అంశాలు జుట్టు ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.
ఇలాంటి సమయంలోనే చాలా మంది జుట్టు రాలడాన్ని నివారించడానికి ఖరీదైన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఈ రోజుల్లో హోం రెమెడీస్ ప్రయత్నిస్తున్నారు.
మీరు బియ్యం నీటిని కూడా వివిధ మార్గాల్లో జుట్టుకు ఉపయోగించవచ్చు. దీని వల్ల జుట్టు బలంగా మారుతుంది. అంతే కాకుండా బియ్యం నీళ్లలో విటమిన్లు, ఖనిజాలు , అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు బలాన్ని, ఆకృతిని, పెరుగుదలకు ఉపయోగపడతాయి. వీటిలో ఉండే విటమిన్లు బి , ఇ, అమైనో ఆమ్లాలు, ఖనిజాలు మీ తలకు పోషణనిచ్చి, జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.
బియ్యం నీరు జుట్టు రాలడాన్ని ఎలా నివారిస్తుంది ?
నిజానికి రాత్రిపూట ఉంచిన బియ్యం నీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో లభించే ఇనోసిటాల్ అనే మూలకం జుట్టు మూలాలను బలపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. అదనంగా పులియబెట్టిన బియ్యం నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ,అమైనో ఆమ్లాలు తల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా జుట్టుకు లోతైన పోషణను అందిస్తాయి.
బియ్యం నీటిని జుట్టుకు ఎలా వాడాలంటే ?
ముందుగా 1/2 కప్పు బియ్యం తీసుకొని బాగా కడగాలి. తరువాత ఈ బియ్యానికి 2-3 కప్పుల నీళ్లు పోసి రాత్రంతా ఇలాగే ఉంచండి. మరుసటి రోజు ఉదయం దానిని వడకట్టి, ఆ నీటిని వేరే పాత్రలోకి నిల్వ చేయండి. ఇలా తయారుచేసిన బియ్యం నీటిని మూసి ఉన్న కంటైనర్‌లో 24 గంటలు ఉంచండి. తద్వారా అది పులియబెట్టబడుతుంది. హెయిర్ సీరం తయారవుతుంది. ఈ హెయిర్ సీరం జుట్టుకు ఉపయోగించడం వల్ల మరింత ప్రభావవంతమైన ఫలితాలు లభిస్తాయి. దీని తరువాత బియ్యం నీటిని తలకు, జుట్టుకు రాయండి. నీరు జుట్టు మూలాలకు చేరేలా చేతులతో మసాజ్ చేయండి. జుట్టు మీద 20-30 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి.
రైస్ వాటర్ సీరం:
బియ్యం నీళ్లలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది తలపై చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. అంతే కాకుండా చుండ్రు వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది. అంతే కాకుండా జుట్టును మృదువుగా, సిల్కీగా చేస్తుంది.
జుట్టు పెరుగుదలకు ఉపయోగం:
బియ్యం నీటిలో ఉండే అమైనో ఆమ్లాలు , విటమిన్లు జుట్టును పోషిస్తాయి. వేగంగా పెరగడానికి , మందంగా మారడానికి సహాయపడతాయి. ఇది జుట్టును రిపేర్ చేస్తుంది. అంతే కాకుండా కాలుష్యం, ఎండ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తుంది.
Also Read: ఈ ఆయిల్ ఒక్క సారి వాడినా చాలు.. జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది !
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది:
బియ్యం నీటిలో ఉండే ఇనోసిటాల్ అనే మూలకం జుట్టు మూలాలను బలపరుస్తుంది. దీని కారణంగా మీ జుట్టు రాలడం సమస్య కొన్ని రోజుల్లోనే తగ్గుతుంది.
జుట్టు మెరుపును పెంచుతుంది:
జుట్టు యొక్క సహజ మెరుపును పెంచడానికి బియ్యం నీటితో తయారు చేసిన హెయిర్ సీరం సహాయపడుతుంది. బియ్యం నీటిలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను మృదువుగా చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా జుట్టును మెరిసేలా, సిల్కీగా ఉంచుతాయి.