Betting Apps Promotions: తెలంగాణలో ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే వీటిపై యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటి ఉన్న కొంతమంది బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసి డబ్బులను తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి వాటివల్ల అమాయపు ప్రజలు మోసపోయి ప్రాణాలను కోల్పోతున్నారు. ఎందరో ఇలాంటి వాటిని గుడ్డిగా నమ్మి సర్వస్వం కోల్పోయి ప్రాణాలను విడిచారు. ఈ మధ్య తెలంగాణాలో ఇలాంటివి ఎక్కువ అయ్యాయి. దీంతో తెలంగాణ సర్కార్ వీటిని పూర్తిగా తీసెయ్యాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కొందరు సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన వీడియోలు సోషల్ మీడియా నుంచి తొలగించారు. కానీ యాంకర్ శ్రీముఖి ప్రమోట్ చేసిన యాప్ వీడియోను ఇంకా తొలగించలేదు.. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది..
బెట్టింగ్స్ యాప్ చేస్తున్న 11 మంది పై కేసు..
తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ పై కేసులు నమోదైన విషయం తెలిసిందే.. ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసి అనేకమంది అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ పోలీసులు సెలబ్రిటీల పై కేసుల నమోదు చేసి వారిని విచారణకు హాజరుకావాలని కోరారు. ఇప్పటికే 11 మంది పై పోలీసులు కేసులు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11మందిపైన, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 25మందిపైన కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురికి నోటీస్ లు జారీ చేసి విచారణ సైతం ప్రారంభించారు.. అయితే ఇలాంటి కేసులు నమోదు అవుతున్న సరే యాంకర్ శ్రీముఖి సంబంధించిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: కమెడియన్ భరత్ జీవితంలో విషాదం.. గుండెబరువెక్కే బాధలు..
శ్రీముఖి ఇంకా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తుంది..?
యాంకర్ శ్రీముఖి గురించి అందరికి తెలిసిందే.. బుల్లితెర పై ఫేమస్ యాంకర్ లలో ఒకరు ఈమె.. తన అందం యాటిట్యూడ్ తో యువతను బాగా ఆకట్టుకుంటుంది. దాంతో ఆమె ఏ షో చేసిన కూడా ఆ షో భారీగా సక్సెస్ అవుతుంది.. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే హీరోయిన్ ని మించిన ఫాలోయింగ్ శ్రీముఖి కుంది. అయితే ఇటీవల బెట్టింగ్ యాప్స్ లలో శ్రీముఖి పేరు కూడా వినిపించింది. ఈమె ఓ యాప్ నీ ప్రమోట్ చేసిందంటూ వార్తలు వినిపించాయి. ఫైర్ ప్లే అని బెట్టింగ్ యాప్ ను శ్రీముఖి ప్రమోట్ చేసినట్టు తెలుస్తుంది అందుకు సంబంధించిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో శ్రీముఖికి కొంచెం కూడా బుద్ధి లేదు జరుగుతున్న కూడా ఇప్పటికీ ఇలాంటి యాప్లను ప్రమోట్ చేస్తుందంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. కొందరేమో ఆమెను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై శ్రీముఖి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..