Anasuya: బుల్లితెర ఆడియన్స్ ని అలరించే పోగ్రామ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2. గత ఏడాది మొదలైన ఈ గేమ్ షో సీజన్ వన్ ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంది. దానికి సీక్వెల్ గా ప్రస్తుతం స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న సీజన్ 2 టాప్ రేటింగ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ షో పది ఎపిసోడ్లు పైనే పూర్తయింది సీజన్ వన్ ఎంటర్టైన్మెంట్ కన్నా సీజన్ 2 లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువైంది అని చెప్పొచ్చు. తాజాగా శని ఆదివారాల్లో టెలికాస్ట్ అయ్యే ఫుల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఆడవాళ్ల కు సపోర్ట్ గా అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..
ఆడవాళ్ల జోలికొస్తే ఊరుకోను..
కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2 లో బాయ్స్ వైపు శేఖర్ మాస్టర్, గర్ల్స్ టీం కు అనసూయ సపోర్ట్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. బాయ్స్ లో నిఖిల్,మానస్, బం చిక్ బబ్లు, పృద్వి, ఇమ్మానుయేల్, దీపక్, సాకేత్ వంటి వారు కిర్రాక్ బాయ్స్ గా పాల్గొన్నారు. గర్ల్స్ టీం లో హమీద, రోహిణి, తేజస్విని, సుస్మిత, లాస్య,విష్ణు ప్రియా, శ్రీ సత్య ఐశ్వర్య, పాల్గొన్నారు. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో గర్ల్స్ బాయ్స్ మధ్య ఓ గేమ్ నిర్వహిస్తారు. అందులో మానస మొదట గేమ్ ఆడతాడు అమ్మాయిల లో విష్ణు ప్రియ ఆడుతుంది. ఆడుతూ మధ్యలో విష్ణు ప్రియ బాల్స్ బౌన్స్ ఏ వెనక్కి వస్తున్నాయి మీరే ఆడండి అని లేచి వెళ్ళిపోతుంది. సాకేత్ అందరికీ అలానే జరుగుతుంది అని అంటాడు. గర్ల్స్ గేమ్స్ ఆడుతుంటే మధ్యలో బాయ్స్ రావడంతో అనసూయ రాంగ్ అంటుంది. కట్ చేస్తే మళ్లీ ఇంకో గేమ్ ఆడుతుంటారు. నిఖిల్, మరోవైపు ప్రియాంక జైన్ ఆడుతూ ఉంటారు. ప్రియాంక కోపంతో గేమ్ మధ్యలో వదిలేస్తుంది. నిఖిల్ ఆశ్చర్యంగా చూస్తాడు. వెంటనే అనసూయ మీరు ఇది బ్యాడ్ అనుకున్నా నేనేం చేయలేను అమ్మాయిలకు నెక్స్ట్ టైం అయితే మాత్రం రాంగ్ గా ప్లే చేస్తే వూరుకోను అంటూ వార్నింగ్ ఇస్తుంది. అందరి ముందు అనసూయ తన సపోర్ట్ చేసే టీం తో ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం అనసూయ కే సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆడవాళ్ళ జోలికొస్తే ఊరుకోను అంటూనె మరోవైపు ఆడవాళ్ళని కూడా గేమ్ సరిగ్గా ఆడండి అని చెప్పడం విశేషం.
అందరి ముందే అలా ..
ఇక కిర్రాక్ బాయ్స్ కిలాడి గేమ్ షో అంటూ ఇటీవల ఓ ప్రోమో ని రిలీజ్ చేద్దాం మనం చూసాం. అందులో పృద్వి అనసూయని ఎత్తుకోవడం, ఆమె బాయ్స్ బ్యాచ్ తో డాన్స్ చేస్తూ ఉంటే, వెనుక నుండి వచ్చే ఆమెను ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు ఇది ఊహించని అనసూయ ఉలిక్కిపడుతుంది తర్వాత ఏదోలా మేనేజ్ చేసి, దింపమని అడుగుతుంది. అమ్మాయిల గ్యాంగ్ అయితే వెంటనే ఒకరికొకరు ఈ సంఘటన చూసి మాట్లాడుకోవడం ఆ ప్రోమోలో మనం చూడొచ్చు. ఇక శ్రీముఖి శేఖర్ మాస్టర్ మీరు ఎప్పుడు ఇలా డాన్స్ చేశారు కానీ ఎత్తుకోలేదు అంటూ కామెంట్ చేయడం. పృద్వి ఆ ప్రోమోలో ముసిముసినవ్వులు నవ్వుకోవడం, అనసూయ సిగ్గుపడడం మనం చూడొచ్చు. ఇప్పుడు తాజాగా మరో ప్రోమోతో ఇన్స్టాలో పోస్ట్ చేశారు స్టార్ మా. ఎపిసోడ్ ఆదివారం 9 గంటలకు ప్రసారం కానుంది.
Kiraack Boys Khiladi Girls 2 : పృథ్వీ బాత్రూం విషయాలు బయటపెట్టిన విష్ణుప్రియ… మనకు ఇదేం కర్మరా బాబు
?utm_source=ig_web_copy_link