BigTV English

OTT Movie : ఈ మేడమ్ స్టైలే వేరు … పెళ్లి వద్దంట, అదిమాత్రమే కావాలంట … ఒకరి తరువాత ఒకరు

OTT Movie : ఈ మేడమ్ స్టైలే వేరు … పెళ్లి వద్దంట, అదిమాత్రమే కావాలంట … ఒకరి తరువాత ఒకరు

OTT Movie :  హాలీవుడ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలను చాలా మంది ఇంట్రెస్టింగా చూస్తుంటారు. అయితే కొన్ని సినిమాలలో శృతిమించిన సన్నివేశాలు ఉంటాయి. వీటిని ఒంటరిగానే చుడాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో ఒక మహిళా ఎగ్జిక్యూటివ్, ఆమె ప్రేమికుడి మధ్య జరిగే రచ్చ మామూలుగా ఉండదు. దీనిని ప్రేమ అనేకంటే, వేరే అర్థాలే బాగుంటాయి. మీరు కూడా ఈ సినిమాని చూడాలనుకుంటే, రీసెంట్ గానే ఓటీటీలోకి వచ్చింది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


కథలోకి వెళితే

సోఫీ ఒక నలభై ఏళ్ల వయస్సులో ఉన్న విజయవంతమైన ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. న్యూయార్క్ సిటీలో ఒక హోటల్‌లో జరిగిన కాక్‌టెయిల్ పార్టీలో ఎలియట్ అనే 33 ఏళ్ల వెయిటర్‌ను కలుస్తుంది. సోఫీ తన జీవితంలో గట్టిగా నిలబడిన మహిళ. ఎలియట్‌తో ఫీలింగ్స్ మొదలవుతాయి. ఇక మ్యాటర్ కూడా మొదలుపెట్టేస్తారు. ఒక రాత్రి ఏకాంతంగా కూడా గడుపుతారు. ఇది ఒక సాధారణ సంబంధంగా కొనసాగుతుంది. సోఫీ, ఎలియట్‌ను తన వ్యాపార పర్యటనలో పారిస్‌కు తీసుకెళ్తుంది. అక్కడ వీళ్ళు ఒక రొమాంటిక్ బౌడోయిర్ ఫోటో షూట్‌లో పాల్గొంటారు. ఆమె అతని ఫోటోగ్రఫీ ఆసక్తిని ప్రోత్సహిస్తూ కెమెరా బహుమతిగా ఇస్తుంది. ఎలియట్ ఒక సాధారణ జీవితం గడిచే వ్యక్తి. సోఫీ జీవనశైలి, ఆమె అందించే అనుభవాలతో ఆకర్షితుడవుతాడు. ఈ సంబంధం అతనికి ఒక మరచిపోలేని రొమాంటిక్ అనుబంధంగా మారుతుంది.


అయితే సోఫీకి ఈ సంబంధం కేవలం ఒక తాత్కాలిక ఆనందం మాత్రమే. ఆమెకు వివాహం, దీర్ఘకాలిక సంబంధాలపై పెద్దగా ఆసక్తి ఉండదు. ఆమె యువకులతో ఇలాంటి సంబంధాలను కొనసాగించడానికి ఇష్టపడుతుంది. ఇక పని అయిపోయాక ఎలియట్‌ను విడిచిపెట్టి, ఆమె తన జీవితంలో ముందుకు సాగుతుంది. కానీ ఎలియట్ ఈ విడిపోవడాన్ని అంగీకరించలేకపోతాడు. అతను సోఫీని స్టాక్ చేయడం ప్రారంభిస్తాడు. ఆమెను ఫోన్‌లో వేధిస్తాడు. ఆమె పనిచేసే చోట, ఆమె ఇంటికి కూడా వెళ్తాడు. అతను పారిస్‌లో తీసిన సోఫీ సన్నిహిత ఫోటోలను ఆమె ఆఫీస్ కి పంపుతాడు. ఆమె వృత్తిపరమైన గౌరవాన్ని దెబ్బతీస్తాడు. సోఫీ ఈ దీని నుంచి బయటపడటానికి, ఎలియట్‌కు మాటలతో, డబ్బుతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.

Read Also :  ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

కానీ అతని మానసిక ప్రవర్తన వల్ల ఆమె ప్రయత్నాలు ఫలించవు. ఆమె బాక్సింగ్ శిక్షణ తీసుకుంటూ, తనను తాను రక్షించుకోవడానికి సిద్ధపడుతుంది. చివరికి ఎలియట్ వేధింపులు ఎక్కువకావడంతో, సోఫీ అతన్ని తీవ్రంగా కొట్టి, తన స్థానాన్ని గట్టిగా నిలబెట్టుకుంటుంది. ఈ హింసాత్మక చర్య ఆమెకు న్యాయం అందిస్తుంది. ఆమె ఆఫీస్ లో తన ప్రెజెంటేషన్‌ను తిరిగి నిలబెట్టుకుంటుంది. ఇంతకీ ఎలియట్‌ ఆమెకు దూరమవుతాడా ? అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు వస్తుంది ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ప్రెట్టీ థింగ్” (Pretty Thing) ఒక అమెరికన్ ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం, దీనిని జాక్ డొన్నెల్లీ రచించి, జస్టిన్ కెల్లీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అలిసియా సిల్వర్‌స్టోన్ (సోఫీ), కార్ల్ గ్లస్మన్ (ఎలియట్), కేథరిన్ కర్టిన్ (పెగ్గీ), టామీ బ్లాంచర్డ్ (అమండా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ న్యూయార్క్ సిటీ, పారిస్‌లో జరుగుతుంది.ఈ సినిమా 2025 ఆగస్టు 8 నుంచి Lionsgate Play, Amazon Video, Apple TV లలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

: నాలుగు స్టోరీలతో కేక పెట్టిస్తున్న సినిమా … ఒక్కొక్కటి ఒక్కోరకం … ఉహకందని ట్విస్టులే

OTT Movie : స్టార్ నటుడి వెర్రి వేషాలు … నవ్వులు పూయిస్తున్న మళయాళ సినిమా … తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie : ఆ ఇంట్లో అడుగుపెడితే చావు మేళం మోగినట్లే … సినిమా మొత్తం అరాచకమే … ఐ.యమ్.డి.బిలో 9.1 రేటింగ్

OTT Movie : 7 నుంచి 17 ఏళ్ళున్న అమ్మాయిలే టార్గెట్… ఊహించని మలుపులు… థ్రిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అంతర్జాతీయ స్థాయిలో చితగ్గొట్టిన చిన్న సినిమా… పీడకల నిజమై వెంటాడితే…

Big Stories

×