Manku Bhai Foxy film : చిన్న ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ అని లేకుండా సినిమాలు మంచి కథలతో తెరకెక్కుతున్నాయి. కన్నడ, మలయాళం ఇండస్ట్రీని ఒకప్పుడు తక్కువగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి కథలతో, పాన్ ఇండియా లెవెల్లో సినిమాల్లో వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. చిన్న మూవీనే అయినా కథ సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘మంకు భాయ్ ఫోక్షి రాణి’ (Manku bhai foxy Rani). రాజేష్ అనే అమాయకుడు తన తండ్రితో కలిసి మంగళూరు తీరప్రాంత శివార్లలోని ఒక మారుమూల గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. అతని స్నేహితులందరికీ లవర్స్ ఉంటారు. రాజేష్ కూడా లవర్ కోసం వెతకడం ప్రారంభిస్తాడు. కానీ అది అనుకున్నంత సులభంగా జరగదు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
రాజేష్ ఒక మారుమూల గ్రామంలో నాటకాలు వేస్తూ, వ్యవసాయంలో తండ్రికి సాయం చేస్తూ ఉంటాడు. ఇతడు కాస్త తెలివైన అమాయకుడిగా ఉంటాడు. ఫ్రెండ్స్ తో ఎప్పుడు సరదాగా తిరుగుతూ, వాళ్ల పుట్టినరోజు బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. రాజేష్ కి మాత్రం ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండదు. అయితే ఒక రోజు ఇతని పుట్టినరోజు వస్తుంది. రాజేష్ పుట్టినరోజుకి ఫ్రెండ్స్ ఎవరు రాకుండా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. వాళ్లు రాలేదని బాగా బాధపడతాడు రాజేష్. తన ఫ్రెండ్స్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో సరదాగా గడపడానికి వెళ్లి ఉంటారని అనుకుంటాడు. నేను కూడా ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ వెతకాలని బయలుదేరుతాడు. అయితే ఎంత వెతికినా ఇతన్ని అందరూ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. చివరికి తండ్రిని పెళ్లి చేయమని అడుగుతాడు. పెళ్లి చూపులకు వెళ్లిన ప్రతి అమ్మాయి కూడా ఏదో ఒక కారణంతో, పెళ్లి ని క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటుంది.
చివరికి ఒకచోట బాధపడుతూ కూర్చుంటాడు రాజేష్. అక్కడికి సిటీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి, రాజేష్ కి ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు. అందులో రాణి అనే అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతుంది. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది. రాజేష్ కూడా ఆమెతో గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ఇద్దరూ కలవాలని అనుకుంటారు. తనని కలవడానికి వచ్చిన రాణిని చూసి రాజేష్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆమె చాలా లావుగా ఉంటుంది. తనకు ఫేస్బుక్లో ఒక అమ్మాయి ఫోటో పెట్టి మోసం చేశారని అనుకుంటాడు. చివరికి రాజేష్ రాణిని పెళ్లి చేసుకుంటాడా? రాజేష్ ని రాణి ఎందుకు మోసం చేస్తుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే.