Mountain Regions Train Travelling: దేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తరం నుంచి దక్షిణం దాకా, తూర్పు నుంచి పడమర వరకు కనువిందు చేసే ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. టూర్లను ఇష్టపడే వారికి గొప్ప సంస్కృతి, ఉత్కంఠభరితమైన సహజ ప్రకృతి అందాలను వీక్షేందుకు చాలా ప్రదేశాలు ఉన్నాయి. పర్వత ప్రాంతాల్లో పర్యటించాలనుకునే వారికి హిమాలయ రాష్ట్రాలు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోచ్చు. ఈ రాష్ట్రాల్లో పర్యాటక ప్రదేశాలు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి. అదే సమయంలో అండ్వెంచరస్ గా ఉంటాయి. మీకూ పర్వత ప్రాంతాల్లో పర్యటించాలనే కోరిక ఉంటే ఈ రైలు ప్రయాణాలను సెలక్ట్ చేసుకోండి.
⦿ ఘుమ్ రైల్వే స్టేషన్
ఇదే దేశంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లో ఉంది. ఆ రైల్వే స్టేషన్ సముద్ర మట్టానికి ఏకంగా 2,258 మీటర్లు, అంటే 7,407 అడుగుల ఎత్తులో ఉంది. ఈ రైల్లో ప్రయాణిస్తుంటే మేఘాల్లో తేలిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది.
⦿ ఊటీ రైల్వే స్టేషన్
ఊటీ రైల్వే స్టేషన్ కూడా అత్యంత ఎత్తులో ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ సముద్ర మట్టానికి 2,210 మీటర్లు.. అంటే 7,251 అడుగుల ఎత్తులో ఉంటుంది. నీలగిరి పర్వత రైల్వే పరిధిలో ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇది ఓ అడ్వెంచర్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ రైలు ప్రయాణం జీవితంలో మర్చిపోలేని రీతిలో ఉంటుంది. ప్రకృతి అందాల నడుమ కొనసాగుతుంది.
⦿ సిమ్లా రైల్వే స్టేషన్
ఈ రైల్వే స్టేషన్ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకుంది. కల్కా-సిమ్లా రైల్వే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. హిమాలయ ప్రాంతంలోని నారో-గేజ్ రైల్వే లైన్ లో సిమ్లా రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి ఏకంగా 2,086 మీటర్ల, అంటే 6,844 అడుగుల ఎత్తులో ఉంది.
⦿ అహ్జు రైల్వే స్టేషన్
పర్వత ప్రాంతాల్లో పర్యటించాలనుకునే టూరిస్టులకు బెస్ట్ రైల్వే స్టేషన్ అహ్జు రైల్వే స్టేషన్. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో ఉంటుంది. సముద్ర మట్టానికి 1,290 మీటర్లు అంటే, 4,233 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ హిమాలయాల ధౌలాధర్ శ్రేణులైన పఠాన్ కోట్ నుంచి జోగిందర్ నగర్ వరకు కొనసాగుతుంది. ఈ రైల్వే ఉప హిమాలయ ప్రాంతంలో ఉంటుంది.
Read Also: ఏపీ ప్రయాణీకులకు అలర్ట్.. ఆ రూట్లో నెల రోజుల పాటు రైళ్లు రద్దు, కారణం ఏంటంటే?
⦿ జోగిందర్ నగర్ రైల్వే స్టేషన్
జోగిందర్ నగర్ రైల్వే స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా లోయలో ఉంటుంది. సముద్ర మట్టానికి 1,189 మీటర్లు, అంటే 3,901 అడుగుల ఎత్తులో ఉంటుంది. జోగిందర్ నగర్ రైల్వే స్టేషన్.. పఠాన్ కోట్ నుంచి జోగిందర్ నగర్ మధ్యలో ఉంటుంది.
Read Also: ఆ రూట్‌లో వందే భారత్ రైలు బోగీల తగ్గింపు.. ఈ తేదీ నుంచే అమలు!
Read Also: హైదరాబాద్ నుంచి ఆ నగరాలకు హైస్పీడ్ రైల్.. జస్ట్ 2 గంటల్లోనే గమ్యానికి!