E-Paper
Advertisement

Psychological Drama OTT : జీవితం బోర్ కొట్టేసిందా ? 4 ఆస్కార్ నామినేషన్లు కొట్టేసిన ఈ మూవీని చూడాల్సిందే

Psychological Drama OTT : జీవితం బోర్ కొట్టేసిందా ? 4 ఆస్కార్ నామినేషన్లు కొట్టేసిన ఈ మూవీని చూడాల్సిందే
Advertisement

Psychological Drama OTT : జీవితం రొటీన్‌గా, బోరింగ్‌గా అనిపిస్తున్నప్పుడు కొన్ని మూవీలు చూస్తే హార్ట్ టచ్ అయి, లైఫ్ మళ్లీ మీనింగ్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అయితే గత ఏడాది అలాంటి ఒక హాలీవుడ్ మూవీ వచ్చింది. ఈ సినిమా 98వ అకాడమీ అవార్డులలో ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లేతో సహా నాలుగు నామినేషన్లను అందుకుంది. సుమారు 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమాను, జీవితం బోర్ అనిపిస్తున్నప్పుడు చూస్తే మైండ్ ని రిఫ్రెష్ అవుతుంది. ఇక ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ?అనే వివరాలను తలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘ట్రెయిన్ డ్రీమ్స్’ (Train Dreams) 2025లో విడుదలైన అమెరికన్ పీరియాడిక్ డ్రామా చిత్రం. దీనికి క్లింట్ బెంట్లీ దర్శకత్వం వహించారు. ఆయన గ్రెగ్ క్వేదర్‌తో కలిసి స్క్రీన్‌ప్లే రాశారు. 2011లో డెనిస్ జాన్సన్ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో జోయెల్ ఎడ్జెర్టన్, ఫెలిసిటీ జోన్స్, నథానియల్ ఆర్కాండ్, క్లిఫ్టన్ కాలిన్స్ జూనియర్, జాన్ డీహెల్, పాల్ ష్నైడర్, కెర్రీ కాండన్ నటించారు. ‘ట్రైన్ డ్రీమ్స్’ 2025 జనవరి 26న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌ అయింది. 2025 నవంబర్ 7న సినిమాహాళ్లలో విడుదలైంది. నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం బెంట్లీ దర్శకత్వం, ఎడ్జెర్టన్ నటనకు ప్రశంసలు అందుకోవడమే కాకుండా, నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ, అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రెండింటిలో 2025లో టాప్ టెన్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. నటుడు ఎడ్జెర్టన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయ్యాడు కూడా. ఇది 98వ అకాడమీ అవార్డులలో నాలుగు నామినేషన్లను అందుకుంది.

స్టోరీ ఏమిటి ?

Advertisement

అనాథగా పెరిగిన రాబర్ట్ గ్రెయినియర్ (జోయెల్ ఎడ్జర్టన్) అనే ఒక కార్మికుడు, అడవుల్లో కలపను నరకడం, రైల్వే వంతెనల నిర్మాణం వంటి కష్టతరమైన పనుల ద్వారా జీవనం సాగిస్తుంటాడు. గ్లాడిస్ (ఫెలిసిటీ జోన్స్) అనే మహిళతో వివాహం తర్వాత, వారిద్దరూ ఒక చిన్న నదీ తీరంలో అందమైన ఇల్లు నిర్మించుకుని, ఒక కుమార్తెతో సంతోషంగా గడుపుతారు. అయితే గ్రెయినియర్ పని నిమిత్తం దూరంగా ఉన్న సమయంలో సంభవించిన ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం అతని ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది. ఆ దుర్ఘటనలో అతను తన భార్యను, బిడ్డను కోల్పోతాడు. కుటుంబం దూరమైన తర్వాత, గ్రెయినియర్ సమాజానికి దూరంగా అడవుల్లో ఒంటరిగా జీవించడం ప్రారంభిస్తాడు. తన గతాన్ని తలుచుకుంటూ, ప్రకృతిలో తన జీవితాన్ని గడుపుతాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న అనేక సంఘటనలను ఈ సినిమా ఎమోషనల్ గా చూపిస్తుంది. ఒక్కసారి చూస్తే మళ్లీ చూడాలనిపించే మూవీ ఇది.

Read Also : ప్రపంచాన్ని చూసే కోణాన్ని మార్చేసే మూవీ… మైండ్ బెండింగ్ ఎక్స్పీరియన్స్… తెలుగులోనే స్ట్రీమింగ్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×