E-Paper
Advertisement

దేవుడి పేరుతో దారుణ హత్యలు… కొడుకులను హంతకులుగా మార్చిన తండ్రి… క్లైమాక్స్ వరకు గగుర్పొడిచే ఉత్కంఠ

దేవుడి పేరుతో దారుణ హత్యలు… కొడుకులను హంతకులుగా మార్చిన తండ్రి… క్లైమాక్స్ వరకు గగుర్పొడిచే ఉత్కంఠ
Advertisement

Psychological horror thriller : వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ కోసం చూస్తున్నారా ? అయితే ఈ సినిమాపై ఓ లుక్ వేయండి. ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒక తండ్రికి సడన్‌గా దేవుడు కనిపిస్తున్నాడని, లోకంలో మనుషుల రూపంలో ఉన్న రాక్షసులను చంపాలని కొడుకులకు చెప్పడం, ఆ తరువాత వరుసగా హత్యలు జరగడం జరిగిపోతాయి. అసలు ఆ తండ్రికి నిజంగానే దేవుడు కనిపించాడా ? ఆయన ఒక సీరియల్ కిల్లరా అనే సస్పెన్స్‌తో సినిమా సాగుతూ, క్లైమాక్స్‌లో మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇస్తుంది. ఈ మూవీ హాలీవుడ్ లెజెండ్స్ అయిన స్టీఫెన్ కింగ్, జేమ్స్ కామెరాన్ వంటి వాళ్ళ నుండి గొప్ప ప్రశంసలు అందుకుంది.

ప్రైమ్ వీడియో (Prime video)లో స్ట్రీమింగ్ 

ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫ్రైల్టీ’ (Frailty). నటుడు బిల్ పాక్స్టన్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో బిల్ పాక్స్టన్, మాథ్యూ మెక్కానహీ, పవర్స్ బూత్ లీడ్ రోల్స్ లో నటించారు. 2001 లో వచ్చిన ఈ సినిమా విజువల్స్, స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమాలోని డార్క్ క్లైమేట్, సస్పెన్స్ ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తాయి. నటన పరంగా బిల్ పాక్స్టన్, మాథ్యూ మెక్కానహీ తమ అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చారు. ముఖ్యంగా తండ్రి పాత్రలో పాక్స్టన్ నటన సినిమాకు ప్రాణం పోసింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ నుండి ‘స్పెషల్ రికగ్నిషన్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఫిలిం మేకింగ్’ వంటి పలు అవార్డులను ఈ చిత్రం గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియో (Prime video)లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక మిడిల్ క్లాస్ తండ్రి తన ఇద్దరు కొడుకులతో కలిసి ప్రశాంతంగా జీవిస్తుంటాడు. అయితే ఒక రాత్రి తనకు దేవుడు కనిపించాడని, లోకంలోని పాపులను అంతం చేయమని ఆజ్ఞాపించాడని కొడుకులకు చెప్తాడు. దేవుడు తనకు కొన్ని ఆయుధాలను, చంపాల్సిన వ్యక్తుల లిస్ట్ కూడా ఇస్తున్నాడని, తన ఇద్దరు పిల్లలను కూడా ఆ పనిలో లీనం చేస్తాడు. చిన్న కొడుకు తండ్రి మాటలను గుడ్డిగా నమ్ముతాడు. కానీ పెద్ద కొడుకు ఫెంటన్ మాత్రం తన తండ్రికి మానసిక స్థితి సరిగ్గా లేదని భయపడతాడు. తండ్రి చేసే హత్యలను ఆపాలని ప్రయత్నించినప్పుడల్లా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. తన కళ్ల ముందే జరుగుతున్న ఘోరాలను చూసి తట్టుకోలేక, ఆ పెద్ద కొడుకు నరకం అనుభవిస్తాడు. అసలు ఆ తండ్రికి నిజంగానే దేవుడి శక్తులు ఉన్నాయా ? లేక ఆయన ఒక సీరియల్ కిల్లరా? అనే ఉత్కంఠతో సినిమా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని మలుపు ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది.

Read Also : ఒక్క తప్పుతో నరాలు తెగే ఉత్కంఠ… శవం దాచడానికి పడరాని పాట్లు… ఓటీటీలో కేక పెట్టిస్తున్న క్రేజీ థ్రిల్లర్

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×