E-Paper
Advertisement

75కు పైగా అవార్డులను గెలుచుకున్న సినిమా… అంతుచిక్కని మలుపులతో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ను ఎక్కడ చూడచ్చో తెలుసా ?

75కు పైగా అవార్డులను గెలుచుకున్న సినిమా… అంతుచిక్కని మలుపులతో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ను ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Psychological Thriller OTT : సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇచ్చే థ్రిల్ మామూలుగా ఉండవు. ఇక హాలీవుడ్ సినిమాలైతే ఈ కంటెంట్ ను అదరగొడతారు కూడా. అయితే తెలుగులో కూడా అలాంటి అదిరిపోయే సినిమాలు ఓ ఊపు ఊపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే, అనేక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులను గెలుచుకుంది. ఒక్కటి కాదు రెండు కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా 75కు పైగా అవార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఇందులో
హీరోయిన్ వేదిక డ్యూయల్ రోల్ లో అదరగొట్టింది. క్లైమాక్స్ వరకు అస్సలు చూపు తిప్పుకోకుండా చేస్తుంది ఈ సినిమా.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఫియర్’ (Fear). ఈ చిత్రానికి డా. హరిత గోగినేని దర్శకత్వం వహించారు. సాఫ్ట్‌వేర్ రంగం నుండి వచ్చిన ఆమెకు దర్శకురాలిగా ఇదే మొదటి సినిమా. ఈమె ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ బాధ్యతలను కూడా నిర్వహించారు. 2024లో విడుదలైన ఈ చిత్రంలో వేదిక ప్రధాన పాత్రలో నటించారు. వేదిక నటనకు ఈ సినిమాలో మంచి గుర్తింపు లభించింది. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ‘దత్తాత్రేయ మీడియా’ బ్యానర్‌పై ఏఆర్ అభి, డా. వంకి పెంచలయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. వీరిద్దరూ కలిసి అంతకుముందు ‘లక్కీ లక్ష్మణ్’ అనే సినిమాను కూడా నిర్మించారు. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒరిజినల్‌గా తెలుగులో రూపొందించబడినప్పటికీ.. హిందీ, తమిళం, కన్నడ మలయాళ భాషల్లోకి కూడా డబ్ అయ్యి పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.

స్టోరీలోకి వెళ్తే

సింధు అనే అమ్మాయికి తన ప్రియుడు సంపత్ అంటే పిచ్చి ప్రాణం. ఇద్దరూ హ్యాపీగా లవ్ చేసుకుంటున్న టైమ్ లో, సడన్ గా ఒకరోజు ఆ కుర్రాడు మాయమైపోతాడు. అసలు వాడు ఎక్కడికి పోయాడు, ఏమయ్యాడు అని టెన్షన్ పడుతుంటే.. సీన్ కట్ చేస్తే, ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఒక మెంటల్ హాస్పిటల్ లో పడేస్తారు. అక్కడ అసలు గొడవ మొదలవుతుంది. ఆ హాస్పిటల్ లో అంతా వింత వింతగా ఉంటుంది. ఎవరో తనని చంపడానికి వస్తున్నట్టు, గాలిలో దెయ్యాలు తిరుగుతున్నట్టు ఈ అమ్మాయికి పిచ్చెక్కిపోతుంది. తన గతాన్ని తలుచుకుంటే ఏవో భయంకరమైన నిజాలు బయటపడతాయి. అక్కడ ఉండే డాక్టర్లు, స్టాఫ్ కూడా ఏదో దాస్తున్నట్టు ప్రవర్తిస్తుంటారు. తన చుట్టూ జరుగుతున్న ఈ మాయాజాలం ఏంటి, తన ప్రియుడిని ఎవరు కిడ్నాప్ చేశారు అనేది తెలుసుకోవడానికి సింధు నరకం చూస్తుంది.

చివరికి వచ్చేసరికి అసలు ట్విస్ట్ ఏంటంటే.. సింధు ఎదుర్కొంటున్న ఈ గోల అంతా బయట శక్తుల వల్లేనా లేక తన మైండ్ లో ఉన్న ఇంకో మనిషి వల్లేనా అనేది రివీల్ అవుతుంది. వేదిక ఈ సినిమాలో రెండు రకాల షేడ్స్ ఉన్న రోల్స్ లో అదరగొట్టేసింది. ఆ పిచ్చోళ్ల హాస్పిటల్ నుండి తను ఎలా బయటపడింది, సంపత్ దొరికాడా లేదా అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : కళ్ళముందే మాయమైన కొడుకు… ఓటీటీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాన్ని అందుకున్న జర్మన్ యాక్షన్ థ్రిల్లర్

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×