BigTV English

Pushpa 2 OTT Date : నెట్‌ఫ్లిక్స్‌తో 5 వారాల డీల్‌…? స్ట్రీమ్ అయ్యే డేట్ ఇదే..

Pushpa 2 OTT Date : నెట్‌ఫ్లిక్స్‌తో 5 వారాల డీల్‌…? స్ట్రీమ్ అయ్యే డేట్ ఇదే..

Pushpa 2 OTT Date : సినిమా ఎలా ఉంది అనేది పక్కన పెడితే పుష్ప 2 సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ము లేపుతుంది. మిక్సిడ్ టాక్ వచ్చినా… కలెక్షన్లకు మాత్రం డోకా లేదు. ఇప్పటికే 1300 కోట్ల మార్క్ దాటింది ఈ మూవీ. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి చర్చ స్టార్ట్ అయింది. ముందుగా ఈ మూవీతో ప్రైమ్ వీడియో వాళ్లు డీల్ సెట్ చేసుకున్నారట. కానీ, ఇప్పుడు పుష్ప 2 మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాకుండా, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కాబోతుంది. పుష్ప 2 మూవీ ఓటీటీ విషయంలో ఏం జరిగింది ? ఈ 5 వారాల డీల్ ఏంటి.? ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఏ డేట్ నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.? అనేవి ఇప్పుడు చూద్ధాం….


పుష్ప పార్ట్ 1 తర్వాత సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2పై అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ఆడియన్స్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. మూడేళ్లు ఆలస్యమైనా ఓపిగ్గా ఎదురుచూశారు. ఫైనల్‌గా ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. మూడేళ్ల నుంచి హై హోప్స్ పెట్టుకోవడం వల్లనేమో చాలా మంది ఈ సినిమాపై మిక్సిడ్ టాక్ ఇచ్చారు. రివ్యూలు కూడా మిక్సిడ్ గానే వచ్చాయి. కానీ, కలెక్షన్ల పరంగా మాత్రం పుష్ప 2 మూవీ దూసుకెళ్తుంది. ఇప్పటికే 1300 కోట్ల కలెక్షన్లను సాధించింది ఈ మూవీ. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమ్ డేట్ పై అందరి కళ్ళు పడ్డాయి.

ముందుగా అమెజాన్‌తో ఒప్పందం…


పుష్ప 2 మూవీ ఓటీటీ రైట్స్ ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుందని టాక్ వచ్చింది. భారీ ధరకు ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని అప్పట్లో హాట్ టాపిక్. అయితే ఇప్పుడు పుష్ప 2 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాదు, నెట్‌ఫ్లిక్స్ లో ఉంటుందని గాసిప్స్ వచ్చాయి. ఇండస్ట్రీ నుంచి వచ్చే టాక్ ఏంటంటే… పుష్ప 2 మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దగ్గర లేవట. నెట్‌ఫ్లిక్స్ దగ్గరే ఉన్నాయని సమాచారం.

నెట్‌ఫ్లిక్స్‌తో 5 వారాల డీల్…

అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లు ఆఫర్ చేసిన దాని కంటే.. పుష్ప 2 మూవీ నిర్మాతలకు నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేసిందట. దీనికి ఓ కండీషన్ కూడా పెట్టిందట. రిలీజ్ డేట్ నుంచి 5 వారాల తర్వాత స్ట్రీమింగ్ ఉంటుందని పుష్ప 2 నిర్మాతలకు చెప్పిందట నెట్ ఫ్లిక్స్. అందుకు ఒప్పుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లు చెప్పిన దాని కంటే ఎక్కువ ఇస్తామని నెట్ ఫ్లిక్స్ చెప్పిందట. డబ్బులు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియోను పక్కన పెట్టి… నెట్ ఫ్లిక్స్ తో డీల్ క్లోజ్ చేసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ వస్తుంది.

రిలీజ్ డేట్ ఛేంజ్ ఈ డీల్ కోసమే…

పుష్ప 2 మూవీ రిలీజ్ డేట్‌ను డిసెంబర్ 6వ తేదీగా పెట్టుకున్నారు. దీనికి కారణం… అల్లు అర్జున్ ఫేవరెట్ / లక్కీ నెంబర్ 6. అందుకే 6వ తేదీని ఫిక్స్ చేశారు. కట్ చేస్తే కొన్ని రోజులకు పుష్ప 2 మూవీ రిలీజ్ డేట్ 6 కాదు.. 5 అని ఒక రోజు ప్రీ పోన్ చేస్తున్నట్టు నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. అయితే దీనికి ఓ కారణం ఉందట. నెట్ ఫ్లిక్స్ పెట్టిన 5 వారాల డీల్ ప్రకారమే.. రిలీజ్ డేట్ ను 6వ తేదీ నుంచి 5 వ తేదీకి మార్చినట్టు తెలుస్తుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యేది ఈ రోజే…?

ప్రచారంలో ఉన్నట్టు… పుష్ప 2 – నెట్ ఫ్లిక్స్ మధ్య జరిగిన 5 వారాల డీల్ ప్రకారం… జనవరి 8వ తేదీకి మూవీ రిలీజ్ అయి 5 వారాలు పూర్తి అవుతుంది. దీంతో టాలీవుడ్ నిర్మాత సంఘం విధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డెడ్ లైన్ క్రాస్ అవుతుంది. దీంతో నెట్ ఫ్లిక్స్ ఎప్పుడైనా స్ట్రీమ్ చేసుకొవచ్చు. ఈ లెక్కన జనవరి 8న 5 వారాలు పూర్తి అయితే, జనవరి 9 నుంచి పుష్ప 2 స్ట్రీమింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట.

గేమ్ ఛేంజర్‌కి పోటీగా…?

నెట్ ఫ్లిక్స్ ఒక వేళ జనవరి 9 నుంచి పుష్ప 2 ను స్ట్రీమ్ చేస్తే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి పోటీ తప్పదు. గేమ్ ఛేంజర్ మూవీ కూడా సరిగ్గా అదే రోజున థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సంక్రాంతి కాబట్టి వ్యూయర్ షిప్ ఎక్కువ ఉంటుందని మేకర్స్, నెట్ ఫ్లిక్స్ అనుకున్నా… ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో ఇది పోటీ అనే కామెంట్స్ వినిపిస్తాయి.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×